Saturday, May 10, 2025

భార్య‌ని ఏలుకోలేని మోడీ.. దేశాన్నేం ఏలుతాడు?

కేంద్ర హోం మంత్రి అమిత్ షాపై టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా అద్దంకి దయాకర్ మాట్లాడుతూ అమిత్ షా నువ్వు రిజర్వేషన్లు ఎత్తివేస్తానని చెప్పలేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తే బిజెపిని పాతాళానికి తొక్కుడే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని అద్దంకి సవాల్ విసిరారు.

అమిత్ షా తెలంగాణకు వచ్చి రాజ్యాంగాన్ని రద్దు చేస్తానని అంటున్నారని ఆయన మండిపడ్డారు. రాజ్యాంగాన్ని రద్దు చేస్తావా అంటూ పౌరుషపదజాలంతో అద్దంకి మాట్లాడారు. అలాగే అద్దంకి దయాకర్ ప్రధాని మోడీపై కూడా విరుచుకుపడ్డారు. మోడీ భార్యను కూడా ఏలుకోలేనోడు దేశాన్ని ఎలా ఏలగలడంటూ విమర్శలు చేశారు. కాగా ఆలోచించి ఓటు వేయాలని ప్రజలకు ఆయన సూచించారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com