Monday, March 10, 2025

ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు

  • వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తాం
  • టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ హెచ్చరిక

ఆర్టీసి సిబ్బందిపై దాడులు చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని, వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని టిఎస్ ఆర్టీసి ఎండి విసి సజ్జనార్ హెచ్చరించారు. వికారాబాద్ పరిధిలోని ఆర్టీసి డ్రైవర్ రాములు పై జరిగిన దాడిపై ఆయన ట్విట్టర్ వేదికగా స్పందించారు. ప్రజల మధ్య విధులు నిర్వర్తించే టిఎస్ ఆర్టీసి సిబ్బందిపై దాడులకు పాల్పడితే తీవ్రమైన కఠిన చర్యలుంటాయని, నిబద్ధత, క్రమశిక్షణతో డ్యూటీ చేస్తోన్న వారిపై దౌర్జన్యం చేయడం బాధాకరమని అన్నారు.

పోలీస్ శాఖ సహకారంతో నిందితులకు కఠిన శిక్షలు పడేలా చూస్తామని, వారిపై హిస్టరీ షీట్స్ కూడా తెరుస్తామని ఆయన హెచ్చరించారు. టిఎస్ ఆర్టీసి సిబ్బంది ఆత్మస్థైర్యాన్ని దెబ్బతిసే, మనోవేదనకు గురిచేసే ఇలాంటి దాడులను యాజమాన్యం ఏమాత్రం సహించబోదని, నిందితులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటుందని సజ్జనార్ పేర్కొన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

ఆ మనిషి కార్పొరేట‌ర్‌కు ఎక్కువ... ఎమ్మెల్యేకు త‌క్కువ: పవన్ పై జ‌గ‌న్‌ కామెంట్స్ ను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com