సంఘ వ్యతిరేక శక్తులకు పాల్పడితే ఉపేక్షించేది లేదు వీలైనచోట్ల మొత్తం సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. కేసుకు సంబంధించి ఐదుగురు పరారీలో ఉన్నారు ఐదుగురిలో నలుగురు దొరికారు.. అనిల్ ను పట్టుకోవాల్సి ఉంది – గాలించేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశాం 2019లోనూ ఫిర్యాదు దారులపై దాడి కేసు నమోదైంది.
చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే ఊరుకునేది లేదు రౌడీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తామంటే వదిలే ప్రసక్తే లేదు. గౌతమ్ రెడ్డిపై హత్య కేసులతో పాటు దాదాపు 43 కేసులు నమోదై ఉన్నాయి గౌతమ్ రెడ్డిపై రౌడీషీట్ నమోదైంది.. అది ఎందుకు క్లోజ్ చేశారో పరిశీలిస్తాం. గౌతమ్ రెడ్డిపై నమోదైన కేసులన్నింటిపై విచారణ చేస్తాం స్థలం విషయంలో నకిలీ దస్త్రాలతో మోసగించినట్లు ఫిర్యాదులు వచ్చాయి.
ఉమామహేశ్వరశాస్త్రి ఇచ్చిన ఫిర్యాదుపైనా చర్యలుతీసుకుంటున్నాం అనిల్ కు కూడా పృథ్వీరాజ్ నుంచి కాల్స్ వచ్చాయి. సాంకేతిక ఆధారాలన్నీ సేకరించి విచారణ చేస్తున్నాం సాంకేతిక ఆధారాలున్నప్పుడు తప్పనిసరిగా చర్యలు తీసుకోవాల్సిందే. రూ.24 లక్షలు సుపారీ విషయంలోనూ దర్యాప్తు చేస్తున్నాం ఇప్పటికే సేకరించిన ఆధారాలను కోర్టు ముందు ఉంచుతాం. హత్య కేసుపై దర్యాప్తు చేస్తుంటే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తున్నాయి స్థల యజమానిని హతమార్చడానికి సుపారీ తీసుకున్న విషయంపై దర్యాప్తు చేస్తున్నాం.. విజయవాడ సీపీ రాజశేఖర్ బాబు.