వర్ధన్నపేట నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మొట్టమొదటి ఎన్నికలు జరిగిన నాటి నుండి నేటివరకు 10 మంది ఎమ్మెల్యేలు ప్రాతినిథ్యం వహించారు. 1952 నుండి 2009 వరకు వర్ధన్నపేట జనరల్ అసెంబ్లీ స్థానంగా ఉండేది. పెండ్యాల రాఘవరావు మొదలు నేటి పాలకూర్తి నియోజకవర్గ ఎమ్మెల్యే ఎర్రబెల్లి దయాకర్ రావు ఈ నియోజకవర్గానికి 2009 వరకు జనరల్ కేటగిరిలో ప్రాతినిధ్యం వహించారు.
2009 లో ఎస్సీ రిజర్వుడ్ స్థానంగా మారిన క్రమంలో కొండేటి శ్రీధర్ కాంగ్రెస్ నుంచి గెలుపొంది 2014 వరకు ఎమ్మెల్యే గా కొనసాగారు. 2014 లో తెలంగాణ రాష్ట్రం సాకారం అనంతరం జరిగిన ఎన్నికల్లో కడియం శ్రీహరి ప్రియ శిష్యుడు ఆరూరి రమేష్ తెరాస ప్రభంజనంలో 86 వేల మెజారిటీ తో ఎమ్మెల్లేగా గెలిచారు. ఆ ఎన్నికల్లో తెరాస అభ్యర్థి ఆరూరి రమేష్ లక్ష 17 వేలు, 66. 04 శాతం ఓట్లు సాధించి గెలిచారు. కాంగ్రెస్ అభ్యర్థి కొండేటి శ్రీధర్ 30వేల 905 అంటే 17.41 శాతం ఓట్లతో సరిపెట్టుకున్నారు. ఈ ఎన్నికల్లోన్నే మాదిగ దండోరా నాయకుడు కృష్ణ మాదిగ స్వతంత్ర అభ్యర్తిగా పోటీ చేసి 20 వేల 256 ఓట్లు సాధించారు. 2018 ఎన్నికల్లో ఆరూరి రమేశ లక్ష 1 వేల మెజారిటీ ఓట్లతో తన విజయ ప్రస్థానాన్ని కొనసాగించారు. ఈ ఎన్నికల్లో అమెరికా ఎన్నారై డాక్టర్ పగిడిపాటి దేవయ్య టీజెస్ పార్టీ తరపున పోటీ చేసి 32012 ఓట్లతో ఓటమి చెందారు. ప్రస్తుతం వర్ధన్నపేట నియోజకవర్గం వరంగల్ జిల్లాలోని 2 మండలాలు వర్దన్నపేట, పర్వతగి , హన్మకొండ జిల్లాలోని హాసనపర్తి, హన్మకొండ మండలాల్లో మొత్తం 2,24 ,760 ఓటర్లను కలిగి ఉంది. గ్రామాలు, సబర్బన్ ప్రాంతాల్లో లక్షా నాలుగు వేల పురుష ఓటర్లు, లక్షా 3 వేల మహిళా ఓటర్లను కలిగి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ మరోవైపు బీజేపీ ఈసారి గట్టి పోటినిచ్చే అవకాశముంది. ఈ నేపథ్యంలో సిట్టింగ్ ఎమ్మల్యే మళ్లీ గెలిచి హ్యాట్రిక్ సాధిస్తాడా? లేక బోల్తాపడతాడా అన్నది త్వరలో తేలుతుంది.