Thursday, May 2, 2024

పదేళ్లలో నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి కెటిఆర్?

  • పదేళ్లలో నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి కెటిఆర్?
  • తెలంగాణ యువత భవిష్యత్ మా గ్యారంటీ!
  • కెటిఆర్ ఆరోపణలపై కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కౌంటర్

తెలంగాణ ఏర్పడ్డాక మొట్టమొదటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి, నువ్వు, మీ నాన్న తెలంగాణ సమాజానికి ఒరగబెట్టింది ఏంటి కెటిఆర్? అని కాంగ్రెస్ ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ ప్రశ్నించారు. కపట నీతికి మారుపేరు కాంగ్రెస్! అంటూ బిఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ చేసిన ట్వీట్‌కు బల్మూరి వెంకట్ శుక్రవారం కౌంటర్ ఇచ్చారు. ఇప్పుడు ఇంట్లో కుర్చోబెట్టాక తెలంగాణ యువత గుర్తుకు వచ్చిందా! పదేళ్లుగా గుర్తుకు రాలేదా యువత? అధికారంలో ఉన్నప్పుడు ఒక్కసారి అయినా వాళ్లని కలిసిన పాపాన పోలేదు.

ఇప్పుడు ఎగిరి గంతేస్తున్నావ్! అని వెంకట్ దుయ్యబట్టారు. అలాగే మొన్నటి మీ బిఆర్‌ఎస్ మేనిఫెస్టోలో విద్యార్థులు, యువత అంశం ఒక్కటయినా ఉందా?? అని బల్మూరి ప్రశ్నించారు. ఇంటికో ఉద్యోగం అనే నినాదంతో 2014లోకి అధికారంలోకి వచ్చారని. గత పదేళ్లలో ఊరికో ఉద్యోగం కూడా ఇవ్వలేకపోయారని, కానీ, మీ ఇంటి నిండా ఉద్యోగాలే అని ఆయన ఎద్దేవా చేశారు. మీరు ఇచ్చిన ప్రతి నోటిఫికేషన్‌లో చిక్కుముడులే ఉన్నాయన్నారు. తాను వేసినవి తప్పుడు కేసులు అయితే, న్యాయస్థానం ఎందుకు ఆ నోటిఫికేషన్‌లను రద్దు చేస్తుందని, ఇప్పుడు నువ్వు ఎవ్వరినీ తప్పు పడుతున్నావ్, నన్నా లేక న్యాయస్థానాన్నా? ఎమ్మెల్యే పదవిలో ఉన్నావు, ఏం మాట్లాడుతున్నావో జర చూసుకొని మాట్లాడాలని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ కెటిఆర్‌కు సూచించారు.

మరి పేపర్ లీకేజీపై ఏమంటావు? వాటికి కూడా నేనే కారణం అంటావా? లీకుల గురించి నోరు మెదిపితే ఎక్కడ నీ బాగోతం బయట పడ్తుందని తెలివిగా లీకేజీ ప్రస్తావన తీయడం లేదన్నారు. వచ్చే ఎన్నికల వరకు మీ పార్టీ ఉంటదా? నీకూ, నీ నాన్నకు తెలంగాణ యువత గురించి మాట్లాడే హక్కు లేనే లేదు. తెలంగాణ యువత సమస్యల పరిష్కారం కోసం ప్రజా ప్రభుత్వం నిబద్ధతతో ఉంది. తెలంగాణ యువత భవిష్యత్ మా గ్యారంటీ! అని బల్మూరి తేల్చి చెప్పారు. ఎండలతో ఆగం అవుతున్నావ్, నువ్వు ఎసి ఫుల్ పెట్టుకొని ఇంట్లో బజ్జో కెటిఆర్! అని బల్మూరి వెంకట్ వ్యంగ్యాంస్త్రాలు విసిరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular