Friday, May 3, 2024

బిజెపికి భారీ షాక్

  • బిజెపికి భారీ షాక్
  • కాంగ్రెస్ పార్టీలో చేరిన బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్

రాష్ట్రంలో లోక్‌సభ ఎన్నికలకు ముందు బిజెపికి భారీ షాక్ తగిలింది. శుక్రవారం బిజెపి మాజీ ఎంపి రవీంద్ర నాయక్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సమక్షంలో రవీంద్రనాయక్ కాంగ్రెస్‌లో చేరారు. ఈ సందర్భంగా రవీంద్రనాయక్‌కు సిఎం కండువా కప్పి కాంగ్రెస్‌లోకి ఆహ్వానించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో రెండుసార్లు ఎమ్మెల్యేగా, 2004లో వరంగల్ ఎంపిగా పనిచేసిన రవీంద్రనాయక్ బిఆర్‌ఎస్‌ను వీడి కాంగ్రెస్‌లో చేరారు. ఆ తర్వాత కాంగ్రెస్‌ను వీడి 2019లో బిజెపిలో చేరి గత నెలలో బిజెపికి రాజీనామా చేసి మళ్లీ కాంగ్రెస్‌లో చేరారు. బంజారా కమిషన్ ఏర్పాటులో బిజెపి అధిష్టానం నిర్లక్ష్యం వహిస్తోందని, తాను బిజెపిలో సీనియర్ లంబాడీ నేతగా ఉన్నా బిజెపి నేతలు ఏ విషయంలోనూ తనను సంప్రదించడం లేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular