Sunday, April 20, 2025

బిజెపి దేశాన్ని దోచుకుంటుంది

  • బిజెపి దేశాన్ని దోచుకుంటుంది
  • కాంగ్రెస్ అకౌంట్లను మోడీ సర్కారు సీజ్ చేసింది

బిజెపి దేశాన్ని దోచుకుంటుందని, కాంగ్రెస్ అకౌంట్లను మోడీ సర్కారు సీజ్ చేసిందని పిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ మహేశ్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పార్లమెంట్ ఎన్నికల ముందు ఇలా అకౌంట్స్ క్లోజ్ చేయడం బిజెపి రాజకీయ దిగజారుడు తనానికి నిదర్శనమని ఆయన మండిపడ్డారు. ఉన్న డబ్బులు ఖర్చు చేయకుండా ఆంక్షలు పెట్టడం ఏమిటి..? అని ఆయన ప్రశ్నించారు. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఇన్‌కంటాక్స్ పరిధిలోకి రావని ఆయన వెల్లడించారు. కానీ, బిజెపి పార్టీ కాంగ్రెస్ అకౌంట్స్‌పై ఐటీ అధికారులతో ఇబ్బంది పెడుతుందని, బిజెపి మమ్మల్ని తప్పుపడుతూ వాళ్లు సత్యమంతుల లాగా మట్లాడుతున్నారని మహేశ్ కుమార్ గౌడ్ ధ్వజమెత్తారు. బాండ్ల దోపిడీ ప్రపంచంలోనే పెద్ద దోపిడీ అని, బాండ్లన్నీ బిజెపి ఖాతాలోకి వెళ్లాయన్నారు.

మోడీ దిష్టిబొమ్మ దహనం
నల్లకుంట చౌరస్తాలో హైదరాబాద్ యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ ఆధ్వర్యంలో మోడీ దిష్టిబొమ్మ దహనం చేశారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన బ్యాంక్ ఖాతాలను కేంద్ర ప్రభుత్వం ఫ్రీజ్ చేయడానికి నిరసనగా ఈ కార్యక్రమం చేపట్టినట్టు రోహిత్ తెలిపారు. బిజెపి ప్రభుత్వానికి తగిన గుణపాఠం చెప్పాలని, పిరికిపంద చర్యలు మానుకోవాలని యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ మోత రోహిత్ ఈ సందర్భంగా హెచ్చరించారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com