Wednesday, June 26, 2024

రెండు రోజుల పాటు పలు ఎంఎంటిఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసుల రద్దు

దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ
హైదరాబాద్‌లోని ఎంఎంటిఎస్ ప్రయాణికులకు దక్షిణ మధ్య రైల్వే అలర్ట్ జారీ చేసింది. రెండు రోజుల పాటు పలు ఎంఎంటిఎస్ రైళ్లు, 4 డెమో సర్వీసుల రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ప్రకటించింది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ సంబంధించిన ఆధునీకరణ పనుల నేపథ్యంలో, ఫుట్ ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనుల వల్ల పలు రైళ్లను రద్దు చేస్తున్నట్టు తెలిపింది.

ఇక ఇందులో, సికింద్రాబాద్ టు – ఫలక్‌నుమా, మేడ్చల్ టు- సికింద్రాబాద్, లింగంపల్లి టు- మేడ్చల్, హైదరాబాద్ టు మేడ్చల్‌ల మధ్య సేవలందించే 22 ఎంఎంటిఎస్ సర్వీసులను రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది. ఇక వీటితో పాటు సిద్దిపేట, సికింద్రాబాద్‌ల మధ్య సర్వీసులందించే 4 డెమూ రైళ్లను కూడా రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైలే పేర్కొంది. అందులో కొన్ని రైళ్లను కేవలం రెండు రోజుల పాటు, మరికొన్ని ఒక్కరోజు మాత్రమే సర్వీసులు రద్దు చేస్తున్నట్లు దక్షిణ మధ్య రైల్వే ఓ ప్రకటనలో తెలిపింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ప్రస్తుత పరిస్థితుల్లో జగన్ మోహన్ రెడ్డి అసెంబ్లీ లో అడుగు పెట్టె సాహసం చేస్తాడా?

Most Popular