Tuesday, May 21, 2024

మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పై కేసు నమోదు

  • మాజీ డిఎస్పి ప్రణీత్ రావు పై కేసు నమోదు
  • పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఫిర్యాదు చేసిన ఏసీబీ అధికారులు

సస్పెండెడ్ మాజీ డీఎస్పీ ప్రణీత్ రావుపై కేసు నమోదు అయింది. ఆదివారం పంజాగుట్ట పోలీసు స్టేషన్ లో ఏసీబీ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆయనపై ఐపీసీ 409, 427, 201, 120(బీ), పీడీపిపి యాక్ట్, ఐటీ యాక్ట కింద కేసులు నమోదు చేశారు. ప్రణీత్ రావుతో పాటు అతడికి సహకరించిన అధికారులపై కేసులు పెట్టారు.గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పలువురు రాజకీయ నాయకుల ఫోన్లు ట్యాంపరింగ్ చేశారు. దీని కోసం ప్రత్యేకంగా 17 సిస్టమ్స్ ఏర్పాటు చేసుకుని రహస్య సమాచారం సేకరించారన్న ఆరోపణల నేపథ్యంలో ప్రభుత్వం ఎస్ఐబీ డీఎస్పీ ప్రణీత్ రావును స్పస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. నిబంధనలకు విరుద్ధంగా ప్రతిపక్ష నేతల ఫోన్లు టాప్ చేసి రాష్ట్రంలో ప్రభుత్వం మారడంతో ఆ డేటా మొత్తం డిలీట్ చేసినట్లు ప్రణీత్ రావుపై తీవ్ర ఆరోపణలు ఉన్నాయి. అలాగే సీసీ కెమెరాలు ఆఫ్ చేసి సాక్ష్యాలు తారుమారు చేసినట్లుగా ఎస్ఐబీ అధికారులు ఇప్పటికే గుర్తించారు. ఈ క్రమంలో ప్రణీత్ రావు వ్యవహారంపై సీరియస్ అయిన ప్రభుత్వం విచారణకు ఆదేశించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular