Sunday, May 19, 2024

ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరం

  • నరేంద్ర మోడీ కుల పెద్దకు ఎక్కువ,
  • మత గురువుకు తక్కువగా మాట్లాడుతున్నారు
  • కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీ రెడ్డి

ప్రధాని మోడీపై కాంగ్రెస్ అధికార ప్రతినిధి భవానీరెడ్డి తీవ్ర విమర్శలు చేశారు. రాహుల్ గాంధీని పాకిస్తాన్ ప్రధానమంత్రిగా కోరుకుంటున్నారని మోడీ చేసిన వ్యాఖ్యలను ఆమె తప్పుబట్టారు. ఇలాంటి వ్యాఖ్యలు మోడీ నుంచి వస్తాయని తాను ఊహించలేదన్నారు. గాంధీభవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ నరేంద్ర మోడీ కుల పెద్దకు ఎక్కువ, మత గురువుకు తక్కువ అన్నట్లు మాట్లాడుతున్నారని ఆమె ధ్వజమెత్తారు. ప్రధాని స్థాయి వ్యక్తి దిగజారి వ్యాఖ్యలు చేయడం దురదృష్టకరమన్నారు. 1965లో పాకిస్తాన్ మీద కాంగ్రెస్ యుద్ధం చేసిందన్నారు.

పాకిస్తాన్, బంగ్లాదేశ్ లను కాంగ్రెస్ విడదీసిందన్నారు. పాక్ మాజీ ప్రధాని ముషారఫ్‌ను పిలిచి ఆతిథ్యం ఇచ్చింది మీరు కాదా ? అని మోడీని ఆమె ప్రశ్నించారు. ఏఐసిసి అధ్యక్షుడు ఖర్గే చిన్న స్థాయి నుంచి పైకి వచ్చారని ఆమె తెలిపారు. ప్రధాని విధానపరమైన అంశాలపై మాట్లాడితే బాగుంటుందని ఆమె సూచించారు. దేశానికి ఏం చేశారో మోడీ ప్రజలకు వివరించాలన్నారు. రెండుసార్లు మిమ్మల్ని ప్రజలు ప్రధానిని చేశారు, కానీ, ఈ సారి మళ్లీ వచ్చే అవకాశం లేదన్నారు. మళ్లీ అవకాశం ఇస్తే కూడా ప్రజలకు ఏమీ చేస్తారో చెప్పాలన్నారు. కశ్మీర్ నుంచి కన్యాకుమారి, మణిపూర్ నుంచి ముంబై వరకు రాహుల్ గాంధీ న్యాయ్ యాత్ర చేశారని ఆమె తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular