Sunday, May 19, 2024

దర్శకులు వర్సెస్​ నిర్మాతలు

  • దర్శకులు వర్సెస్​ నిర్మాతలు
  • కోట్లకు పెరుగుతున్న ఖర్చులు, రెమ్యూనరేషన్లు
  • భారంగా భావిస్తున్న నిర్మాతలు
  • ధరలు పెంచుతున్న సంగీత దర్శకులు
  • సొంతంగా సినిమాలు చేసేందుకు సిద్ధమవుతున్న దర్శకులు

తెలుగు ఇండస్ట్రీలు నిర్మాతలకు, దర్శకులకు మధ్య విభేదాలు వస్తున్నాయి. రెమ్యూనరేషన్లు పెంచడం, ఒకరి ధర చూసి మరొకరు పెంచుకుంటూ పోతుండటమే కాకుండా..

దర్శకుల ప్లానింగ్ లేని ఆలోచనలతో నిర్మాతలు నిలువునా మునిగిపోతున్నామనే ఆలోచనకు వస్తున్నారు. ఏం తీస్తున్నారో, ఎంత మేరకు తీస్తున్నారో, ఎంత ఖర్చు చేస్తున్నారో కూడా కనీసం క్లారిటీ లేకుండా.. ఇష్టమొచ్చినట్లు ఖర్చు పెట్టిస్తూ ప్రొడ్యూసర్స్‌ను అడ్రస్ లేకుండా చేస్తున్నట్లుగా మారిపోయింది పరిస్థితి. తాజాగా ఇద్దరు స్టార్​ డైరెక్టర్​, ప్రొడ్యూషర్​ మధ్య ఇదే వివాదం జరిగినట్లుగా ఇండస్ట్రీలో హాట్​ టాపిక్​. ఈ మధ్య కాలంలో చిత్ర పరిశ్రమను గమనిస్తే.. కనీసం ఓపెనింగ్స్ రాని భారీ సినిమాలు చాలానే ఉన్నాయి. వాటి బాధ్యత తీసుకునేదెవరు..? నిర్మాతల నష్టాలకు సమాధానమిచ్చేదెవరు..? ఫ్లాపులు ఎవరైనా తీస్తారు.. అదేం పెద్ద క్రైమ్ కాదు. ప్రతీ దర్శకుడి నుంచి అలాంటి సినిమాలు వస్తుంటాయి. కానీ, తలాతోక లేకుండా సినిమాలు తీస్తూ నిర్మాతలతో కోట్లు ఖర్చు చేయించడం మాత్రం ముమ్మాటికీ తప్పే అని అంటున్నారు. హీరో కథ విన్న తర్వాతే ఓకే అంటారేమో గానీ దానికి అయ్యే ఖర్చును డిసైడ్ చేయాల్సింది దర్శకుడే కదా..! ఆ ప్లానింగ్ దర్శకుల్లో మిస్​ అవుతుందని భావిస్తున్నారు. ఇటీవల తెలుగులో అలాంటి సినిమాలు చాలానే వచ్చాయి. ముఖ్యంగా అక్కినేని బ్రదర్స్ నుంచి వచ్చిన ఏజెంట్, కస్టడీ సినిమాలకు ఖర్చు భారీగా అయింది. ఇటు సురేందర్ రెడ్డి.. అటు వెంకట్ ప్రభు ఇద్దరూ హీరోల మార్కెట్‌కు మించి ఖర్చు చేయించారు కానీ రిజల్ట్ మాత్రం దారుణం. అంతేకాకుండా గుణశేఖర్ మరోసారి శాకుంతలంతో నిరాశ పరిచారు.. దీనికి 50 కోట్ల నష్టాలొచ్చాయి. ఇదే వరుసలో ప్రవీణ్ సత్తారు తెరకెక్కించిన గాంఢీవదారి అర్జున అయితే వచ్చిన సంగతి కూడా తెలియదు ప్రేక్షకులకు. వరుణ్ తేజ్ కెరీర్‌లో హైయ్యస్ట్ బడ్జెట్‌తో వచ్చిన గాండీవదారి.. బిగ్గెస్ట్ డిజాస్టర్‌గా నిలిచింది. భోళా శంకర్ ఇదే లిస్ట్ లోకి వస్తుంది. చిరంజీవి లాంటి హీరోను పెట్టుకుని ఇష్టమొచ్చినట్లు తీసారు మెహర్ రమేష్.

అంతా డిమాండ్​మీదే..!

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిమాండ్స్ చేసేది కేవలం హీరోలే. స్టార్ హీరోలు బడాబడా హీరోలు ఫామ్ ఉన్న హీరోలు మాత్రమే తమకు మార్కెట్ పరంగా ఒక రేట్లు ఫిక్స్ చేసుకొని అంత రెమ్యూనరేషన్ ఇవ్వాలి అంటూ డిమాండ్ చేసేవాళ్ళు . రాను రాను ఆ పద్ధతి మారిపోయింది. ఇప్పుడు కేవలం స్టార్ హీరోలు పాన్ ఇండియా హీరోలు మాత్రమే కాదు ..హీరోయిన్స్, పాన్ ఇండియా బ్యూటీస్, చైల్డ్ ఆర్టిస్ట్ ఇండస్ట్రీలో చిన్నచితకా పాత్రలు చేసుకునే క్యారెక్టర్ ఆర్టిస్ట్ లు కూడా మా పాత్రకి ఇంత రెమ్యూనరేషన్ ఇస్తేనే ఓకే చేస్తాం అన్న స్థాయికి వచ్చేసారు. చాలామంది సినిమా ఇండస్ట్రీలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేస్తూ ఉండడం గమనార్హం. అయితే ఈ మధ్యకాలంలో పలువురు స్టార్ట్ డైరెక్టర్స్ కూడా 100 కోట్ల రెమ్యూనిరేషన్ డిమాండ్ చేస్తున్నారు అన్న వార్తలు పెరిగిపోతున్నాయి. బడాబడా డైరెక్టర్స్ గా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకులు ఒక్కొక్క సినిమాకి 70 లేదా -80 లేదా -90 కోట్లు రెమ్యూనరేషన్ అడుగుతున్నారట. అందుకే భారీ బడ్జెట్ సినిమాలు ఎక్కువగా వచ్చేస్తున్నాయి. తాజాగా ఓ టాక్​ వైరల్​గా మారింది. స్టార్ డైరెక్టర్గా పాపులారిటీ సంపాదించుకున్న దర్శకుడు 50 కోట్లు చేతిలో పెడితే కానీ సినిమాకి ఓకే చెయ్యను అంటూ మొండిగా కూర్చుంన్నాడు. మంచి పేరు పబ్లిసిటీ పాపులారిటీ ఉన్న ఈ దర్శకుడు అసలు డబ్బు మనిషే కాదు ..డబ్బుకు విలువ ఇవ్వడు.. కానీ ఈ మధ్యకాలంలో ఆయన ఈ విధంగా మారిపోయాడు అనేది ఇండస్ట్రీలో టాక్​. పులిని చూసి నక్క వాత పెట్టుకుంది అన్న రేంజ్ లో బడా డైరెక్టర్స్ ను చూసి ఈ డైరెక్టర్ ఇలా చేస్తున్నాడనే అంటున్నారు. దీంతో, నిర్మాతలు కూడా సదరు దర్శకుడి బిహేవియర్ పై గుర్రుగా ఉన్నట్లు తెలుస్తోంది. ఒక దశలో బాయ్ కాట్ చేయాలి అంటూ నిర్మాత మండలి నిర్ణయం కూడా తీసుకోబోతుందట.

నిజానికి, సౌత్ నుండి పాన్ ఇండియా హీరోలుగా ప్రభాస్, యశ్, ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇప్పటికే వెయ్యి కోట్ల వసూళ్ల క్లబ్ లో చేరగా బాలీవుడ్ నుండి అమిర్ ఖాన్ ఒక్కడే సింగిల్ పీస్ గా బాలీవుడ్ హీరో అమీర్ కనిపిస్తున్నాడు. నెక్స్ట్ మహేష్ లాంటి హీరోలు ఈ క్లబ్ లో చేరేందుకు సన్నాహాలు కూడా మొదలయ్యాయి. వెయ్యి కోట్ల వసూళ్లను రాబట్టే హీరోలంటే ఈ హీరోల పారితోషకం కూడా భారీగానే ఉంటుందని ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పనిలేదు. ఇక హీరోలను వెయ్యి క్లబ్ లో పడేసిన దర్శకులు కూడా ఆ హీరోలకు ఏ మాత్రం తగ్గేదే లే అంటున్నారు. రూటు మార్చి రేట్ పెంచి కాస్ట్లీ కెప్టెన్ ఆఫ్ ది షిప్ అనిపించుకుంటున్నారు. అవును సౌత్ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో నిలబెడుతున్న ది గ్రేట్ డైరెక్టర్స్ తీసుకునే పారితోషకం హాట్ టాపిక్ గా మారుతోంది.

ఇదే సమయంలో మేకింగ్ విషయంలో ట్రెండ్ సృష్టిస్తున్నారు. ఖరీదైన కంటెంట్ తో ఫిదా చేస్తున్నారు. ప్రేక్షకులని సీట్ ఎడ్జ్ లో కూర్చోబెట్టి విజిల్స్ వేయిస్తున్నారు. కనివినీ ఎరుగని రికార్డులకు సౌత్ డైరెక్టర్స్ కొందరు కేరాఫ్ అడ్రాస్ అవుతున్నారు. అంతేనా భారీ బ్లాక్ బస్టర్ కొట్టాక.. అదే రేంజ్ లో హై రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నారు. వసూళ్లలో వాటాలు అడుగుతున్నారు. వాళ్లు అడగకపోయినా మాతో సినిమా చేయండంటూ నిర్మాతలే కొత్త కొత్త ఆఫర్స్ ప్రకటించేస్తున్నారు.

ఇటీవలే రూ. 50 కోట్ల నిచ్చెనను ఎక్కేశాడు ప్రశాంత్ నీల్. ఓ కన్నడ సినిమాను పాన్ ఇండియా లెవెల్ లో ప్రొజెక్ట్ చేయడమే కాదు.. 1000 కోట్లను క్రాస్ చేసి పరుగులు పెట్టించడంలో ప్రశాంత్ నీల్ దే మేజర్ రోల్. కేజీఎఫ్ ఫ్రాంచైజ్ మెగా సక్సెస్ తో నేషన్ వైడ్ రికగ్నైజ్ సాధించిన నీల్.. ప్రభాస్ హీరోగా సలార్ తెరకెక్కించాడు. ఈ సినిమాను కూడా కేజీఎఫ్ ప్రొడక్షన్ హౌజ్ హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. అయితే ఈ మూవీకి దాదాపు 25 కోట్లు ప్రశాంత్ నీల్ కు ముట్టు జెప్పారు నిర్మాతలు. అంతే కాదు లాభాల్లో వాటాను కూడా షేర్ చేసేలా ఒప్పందం కుదుర్చుకున్నారు.

కోట్లు దాటేశారు

సలార్ తర్వాత టాలీవుడ్ నిర్మాతలతో ఒప్పుకున్న రెండు సినిమాలకు మాత్రం ప్రశాంత్ నీల్ రెమ్యునరేషన్ డబుల్ చేసినట్టు తెలుస్తోంది. ఇక మీదట 50 కోట్ల మీటర్ కే ఎస్ చెప్తానంటున్నాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో ఎన్టీఆర్ హీరోగా ప్రశాంత్ నీల్ తెరకెక్కించబోయే సినిమాకు 50 కోట్ల అగ్రిమెంట్ చేసుకున్నట్టు టాక్. ఈమధ్యే దానికి సంబంధించిన అడ్వాన్స్ ప్రశాంత్ నీల్ అందుకున్నాడు. తారక్ సినిమా తర్వాత డివివి దానయ్య బ్యానర్ లో చేసే సినిమాకు ఇదే రేంజ్ లో వసూలు చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోగా చరణ్ నటించే ఛాన్స్ ఉంది. నిజానికి, ప్రశాంత్ నీల్ కన్నా ముందే దర్శకధీర రాజమౌళి రెమ్యునరేషన్ తో చుక్కలు చూపించాడు. తాను తీసే ప్రతి సినిమా పర్ఫెక్ట్ గా రావడానికి లాంగ్ టైమ్ తీసుకుని కష్టపడటం జక్కన్నకు అలవాటు. ఆ కష్టానికి తగినట్లే.. రెమ్యునరేషన్‌ కూడా భారీగానే తీసుకుంటాడు రాజమౌళి. ఆర్‌ఆర్‌ఆర్‌ కోసం డీవీవీ ఎంటర్ టైన్ మెంట్స్ దాదాపు 80 కోట్లకు పైగానే రాజమౌళికి పారితోషికం అందించిందని సమాచారం. ఇండియాలో ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ తీసుకుంటున్న ఏకైక డైరెక్టర్ రాజమౌళి.

మరోవైపు ఆర్‌ఆర్‌ఆర్‌ లాభాల్లో 30 శాతం వాటా కూడా అడిగినట్లు ఆమధ్య మాటలు వినిపించాయి. అయితే పెట్టిన పెట్టుబడికి తగినంత.. ముఖ్యంగా జక్కన్న ఎక్స్పెక్ట్ చేసినట్టు ట్రిపుల్ ఆర్ 2వేల మార్క్ చేరుకోలేదు కాబట్టి ఈ డైరెక్టర్ కాస్త తగ్గే ఛాన్స్ ఉంది. ఇక, పుష్ప పార్ట్ 1 వరకు 20 నుంచి 25 కోట్ల వరకు పారితోషికం తీసుకున్న సుకుమార్.. పుష్ప2 తో తగ్గేదేలే అంటున్నాడు. అవును పుష్ప పార్ట్ 2ను అంతకు మించి అన్నట్టు చూపించాలనుకున్నాడు. దానికి తగ్గట్టే 50 కోట్ల రెమ్యునరేషన్ డిమాండ్ చేసి, తీసుకున్నట్లు కూడా తెలుస్తుంది. పుష్ప ది రైజ్ తో ఊహించని సక్సెస్ ఇచ్చిన సుక్కూకు అడిగినంత ఇచ్చేయడానికి మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు కూడా రెడీ అయ్యారు. భారీ బడ్జెట్, హై ఎండ్ టెక్నికల్ వ్యాల్యూస్ తో సినిమాలు చేసే రిచ్ దర్శకుడిగా పేరుది శంకర్ కి. గతంలోనే హైయ్యెస్ట్ రెమ్యునరేషన్ తీసుకుంటాడనే పేరుంది ఈయనకి. ఇప్పుడు ఫ్లాప్స్ ఎదురొచ్చినా సరే.. రామ్ చరణ్ తో తీస్తోన్నసినిమాకు భారీగానే అందుకుంటున్నాడు. దాదాపు 40 కోట్ల రూపాయలను శంకర్ కు దిల్ రాజు ముట్ట జెప్తున్నట్టు ఫిల్మ్ నగర్ సమాచారం.

మాట్లాడుతుంది సక్సెస్సే

సినిమా ఇండస్ట్రీలో సక్సెసే మాట్లాడుతుంది. ఒక డైరెక్టర్ కి వరసగా రెండు సక్సెస్ లు వచ్చాయంటే రేంజ్ మారిపోతుంది. అదే ఫ్లాప్ ఫేస్ చేస్తే.. పలకరించే దిక్కు కూడా ఉండదు. అప్పటి వరకూ ఎన్ని వందల కోట్ల కలెక్షన్లు రాబట్టినా, ఎంత మంది హీరోలకు కెరీర్ హిట్స్ ఇచ్చినా.. అవన్నీ పట్టించుకోకుండా డైరెక్టర్లనే బలిపశువుల్ని చేస్తోంది ఇండస్ట్రీ. సినిమా హిట్ అయితే హీరో వల్ల హిట్ అయ్యిదంటారు. అదే కాస్త అటూ ఇటైతే ఫ్లాప్ భారం మొత్తం డైరెక్టర్ నెత్తిన వేస్తున్నారు. సక్సెస్ లు ఇచ్చినన్నాళ్లూ ఆహా ఓహో అన్న జనాలు ఒక్క ఫ్లాప్ పడిందంటే అంతా మీవల్లే అంటూ డైరెక్టర్లని నిందిస్తున్నారు. ఇన్నేళ్ల సక్సెస్ ని, ఇన్నాళ్ల లెగసీని పట్టించుకోకుండా కనికరం లేకుండా డైరెక్టర్లనే ఫ్లాప్ లకు బాధ్యుల్నిచేస్తున్నారు. కొరటాల శివ అన్ స్టాపబుల్ హిట్స్ తో ఆడియన్స్ ని ఎంటర్ టైన్ చేశారు. 2013లో కెరీర్ స్టార్ట్ చేసిన తర్వాత షార్ట్ స్పాన్ లోనే ఎంతో మంది హీరోలకు కెరీర్ బిగ్గెస్ట్ సక్సెస్ లు ఇచ్చి స్టార్ హీరోల్ని చేశారు. మిర్చి ముందు వరకూ జస్ట్ హీరోగా ఉన్న ప్రభాస్ ని కమర్షియల్ స్టార్ హీరోని చేసింది కొరటాల. ఇక ఆ తర్వాత ఎన్టీఆర్ తో జనతా గ్యారేజ్, మహేష్ తో శ్రీమంతుడు, భరత్ అను నేను లాంటి సినిమాలతో ఇండస్ట్రీ హిట్స్ ఇవ్వడమే కాదు హీరోల కెరీర్ కి మైలేజ్ ఇచ్చి టాప్ డైరెక్టర్ అయ్యారు. కొరటాల శివ ఇన్నేళ్ల కెరీర్ లో చేసింది 5 సినిమాలే. కానీ ప్రతి సినిమా హీరో కెరీర్ లో ది బెస్ట్ సక్సెస్ ఇచ్చిన సినిమాలే. చిరంజీవి, చరణ్ కాంబినేషన్లో కొరటాల డైరెక్ట్ చేసి.. 200కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఆచార్య మూవీ అనుకున్నంత రెస్పాన్స్ సంపాదించుకోలేకపోయింది. ఓన్లీ హీరోల ఎలివేషన్ మీద తప్పించి కథ మీద శ్రద్ద పెట్టలేదని, అసలు దీన్ని సినిమా అంటారా..? అసలు కొరటాల డైరెక్షన్లే సినిమా దొబ్బింది అంటూ ఆడిపోసుకుంటున్నారు.

గొడవలతో విడిపోతున్నారు

ఒకప్పుడు “లవర్‌ బాయ్‌”గా పేరుతెచ్చుకున్న తరుణ్‌, ఇప్పుడు హిట్‌ సినిమాలు లేకుండా కష్టాలు పడుతున్నాడు. ఇటీవలే పబ్‌ను నెలకొల్పి సినిమాలు లేనప్పుడు ఆ వ్యాపారాన్ని కూడా చూసుకుంటున్నాడు. తాజాగా సుప్రీం ఆడియో కంపెనీ అధినేత రాజు హిర్యాణి తరుణ్‌తో ఓ కొత్త చిత్రాన్ని ప్రారంభించారు. ప్రారంభంలోనే ఈ చిత్రానికి ఆదిత్య దర్శకుడు. ఆదిత్య ఉన్నట్టుండి ఆత్మహత్యకు పాల్పడటంతో.. కాస్త గ్యాప్ ఇచ్చి వి.ఎన్. ఆదిత్యను ఎంపికచేశారు. కొద్దిరోజులు బ్యాంకాక్‌‌లో షూటింగ్ జరిపారు. అక్కడ దర్శకుడికి, నిర్మాతలకు మధ్య గొడవ జరగడంతో ఫైన్ కట్టి వెనుదిరిగి వచ్చారు. నిర్మాత, ఎగ్జిక్యూటివ్ నిర్మాతలిద్దరూ అక్కడి డ్యాన్సర్లతో ఎంజాయ్ చేయడం, షూటింగ్‌కు అంతరాయం కలగడంతో దర్శకుడు అవాక్కయ్యాడు. దాంతో దర్శకత్వం సరిగ్గా చేయడం లేదని ఆయనచేత నిర్మాతల మండలికి స్వచ్ఛంధంగా తప్పుకుంటున్నట్లు లెటర్ రాయించారు. తర్వాత ఇదే చిత్రానికి కన్మణిని మూడో దర్శకుడిగా పెట్టుకున్నారు. మొత్తానికి ముగ్గురు దర్శకులు కలిస్తేగాని తరుణ్ సినిమా ఇంకా పూర్తికావడం లేదు.

కొత్తేమీ కాదు కదా..?

నటీనటులు, నిర్మాతల మధ్య గొడవలు కొత్తేమీ కాదు. ఇది ఇప్పుడు ఉంది, గతంలో కూడా ఉంది. ఆ రోజుల్లో తెలుగు సినిమాకి సంబంధించిన ఏ సమస్య వచ్చినా పరిష్కరించేవారు నిర్మాత-, నటుడు దివంగత దాసరి నారాయణరావు. రెండు పార్టీలు చివరికి సామరస్యంగా ఒక పరిష్కారానికి వస్తాయి. కానీ ఇప్పుడు, తమ ప్రొడక్షన్ హౌస్ ప్రతిష్టను పణంగా పెట్టి ఇలాంటి వెర్రి గొడవలు పబ్లిక్ డొమైన్‌లకు వ్యాపించాయి. మరియు చిత్ర పరిశ్రమలో అసోసియేషన్ సంస్థలు పేరు కోసం అభివృద్ధి చెందుతూనే ఉన్నాయి. సూపర్ స్టార్ దివంగత నటుడు కృష్ణ, రజనీకాంత్ లాంటి అలనాటి స్టార్లు కూడా ఇలాంటి చేదు పరిస్థితులను ఎదుర్కొన్నారు. నటులు మరియు పెట్టుబడిదారులు (నిర్మాతలు) ఒకరినొకరు రక్షించుకుంటారు. ఒక నిర్మాత నష్టపోతే, నటుడు అతనికి సినిమా చేస్తానని హామీ ఇచ్చాడు మరియు అవసరమైతే తన రెమ్యునరేషన్ వదులుకుంటాడు. నిర్మాతలను రక్షించేందుకు దివంగత నటుడు కృష్ణ ఉదారంగా ముందుకు వస్తారనే టాక్​ఉంది. 1965లో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత తన సినిమాలను తానే స్వయంగా నిర్మించుకునే పరిస్థితి వచ్చింది. అతని నలభై శాతం సినిమాలు ఆయనే నిర్మించారు. కాబట్టి, అతను నిర్మాత యొక్క బాధను తెలుసు మరియు ఎవరినీ నిరాశపరచలేదు. రజనీకాంత్ కూడా 1975లో సినిమాల్లోకి వచ్చిన తర్వాత నిర్మాతగా మారారు.

నరసింహ (2001) మరియు బాబా (2002) వంటి సినిమాలు స్వయంగా నిర్మించారు. విజయ్ దేవరకొండ నిర్మాత అయినప్పటికీ టెక్నికల్ గా గ్రిప్ దొరకలేదు. స్టార్స్‌తో పోలిస్తే, సినిమా రెమ్యునరేషన్‌ని వదులుకునేంత ఆర్థికంగా అతను వెనుకబడ్డాడు. ఇలా సౌత్‌లో ఇతర సూపర్‌స్టార్లు ఉన్నారు. మమ్ముట్టి మరియు మోహన్‌లాల్ వంటి సౌత్ సూపర్ స్టార్‌లు తమ సినిమాలు బాక్సాఫీస్ వద్ద బాంబులు పడినప్పుడు డబ్బును కోల్పోయిన కొంతమంది నిర్మాతలకు సహాయం చేసినట్లు బయటకు వచ్చింది. అయితే, వీరంతా ఈ విషయాన్ని ఎక్కడా వెల్లడించలేదు. 2017లో పృథ్వీరాజ్‌ సుకుమారన్‌ నటించిన విమానం చిత్రాన్ని నిర్మించిన నిర్మాత లిస్టిన్‌ స్టీఫెన్‌, అది థియేటర్లలో పెద్దగా ఆడకపోవడంతో భారీ నష్టాన్ని చవిచూశారు. ఓ ఇంటర్వ్యూలో లిస్టిన్ మాట్లాడుతూ.. తాను పృథ్వీరాజ్‌ని సంప్రదించానని, తన తదుపరి సినిమాలో నటించాలా అని అడిగానని చెప్పాడు. ఆ తర్వాత, 2019లో బ్రదర్స్ డే చేశారు. తర్వాత వీరిద్దరూ కలిసి మరిన్ని సినిమాలు చేశారు. జన గణ మన (2022) మరియు డ్రైవింగ్ లైసెన్స్ (2019) సినిమాలను నిర్మించడంలో కలిసి పని చేశారు.

ధర పెంచుతున్న సంగీత దర్శకులు.. అలుగుతున్న నిర్మాతలు

ఇండ‌స్ట్రీలో అంద‌రి రెమ్యున‌రేష‌న్‌ల గురించి లీక్ అవుతూనే ఉంటాయి. కానీ, ఎప్పుడూ మ్యూజిక్ డైరెక్ట‌ర్ల రెమ్యున‌రేష‌న్ గురించి మాత్రం చ‌ర్చకు రాలేదు. అయితే, ఇప్పుడు వాళ్లు కోట్ చేసే రెమ్యున‌రేషన్ గురించి చర్చ జ‌రుగుతోంది. సినిమా ఇండ‌స్ట్రీలో ఒక్కో మ్యూజిక్ డైరెక్టర్ వాళ్ల వాళ్ల రెమ్యున‌రేష‌న్లు పెంచేశార‌ట‌. కార‌ణం.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ వల్లేనట. అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ విష‌యంలో త‌గ్గడ‌ని, చాలా కాస్ట్‌లీ అని అంటున్నారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న ప్రభావం మిగ‌తా వాళ్లపై కూడా ప‌డుతున్నట్లు తేలింది.

ప్రస్తుతం సినీ ఇండ‌స్ట్రీలోని టాప్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక‌రు అనిరుధ్. ఆయ‌న చేసిన ప్రతి సినిమాలోని మ్యూజిక్ సూప‌ర్ హిట్. ఈ మ‌ధ్యే అనిరుధ్ చేసిన ‘జ‌వాన్’ సినిమా పాట‌లు అంద‌రినీ తెగ ఆక‌ట్టుకున్నాయి. ఇక ప్రస్తుతం ఎన్టీఆర్ ‘దేవ‌ర’ సినిమాకి మ్యూజిక్ అందిస్తున్నాడు అనిరుధ్. అయితే, ఆయ‌న రెమ్యున‌రేష‌న్ తెగ పెంచేశాడ‌ట‌. సినిమా రేంజ్, దాంట్లో ఉన్న స్టార్స్ ని బ‌ట్టి.. అనిరుధ్ రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నట్లు సినిమా వ‌ర్గాల్లో గ‌ట్టిగా వినిపిస్తున్న మాట‌. దాదాపు ఒక్కో సినిమాకి రూ.12 కోట్లు తీసుకుంటాడ‌ని చెప్తున్నారు. సినిమా రేంజ్‌ను బ‌ట్టి రూ.10 కోట్లకు త‌గ్గించుకుంటాడ‌ట అనిరుధ్. ఏదేమైనా రూ.8 కోట్ల కంటే త‌క్కువ‌గా మాత్రం రెమ్యున‌రేష‌న్ ఉండ‌దట అనిరుధ్‌కు.

ఏ ఆర్ రెహ్మాన్ ఎంతంటే?

ఈ మ‌ధ్యకాలంలో వ‌చ్చిన అనిరుధ్.. మినిమ‌మ్ రూ.8 కోట్లు వ‌సూలు చేస్తుంటే.. ఎప్పటి నుంచో ఇండ‌స్ట్రీలో పాతుకుపోయిన మ్యూజిక్ డైరెక్టర్లు ఇప్పుడు తగ్డడం లేదు. వాళ్లు కూడా బాగానే కోట్ చేస్తున్నార‌ట‌. ఫేమ‌స్ మ్యూజిక్ డైరెక్టర్ ఆస్కార్ అవార్డు విన్నర్ ఏ ఆర్ రెహ్మాన్.. ఒక్కో సినిమాకి రూ.10 కోట్లు వ‌సూలు చేస్తున్నారు. బుచ్చిబాబు డైరెక్షన్ లో రామ్ చ‌ర‌ణ్ చేస్తున్న ‘ఆర్సీ 16’ సినిమాకి రెహ్మాన్ రూ.10 కోట్లు రెమ్యున‌రేష‌న్ తీసుకుంటున్నట్లు స‌మాచారం.

‘పుష్ప’ త‌ర్వాత పెంచేసిన దేవీ..

తెలుగులో సూప‌ర్ హిట్ మ్యూజిక్ డైరెక్టర్ల‌లో ఒక‌రు దేవీ శ్రీ ప్రసాద్. కెరీర్ మొద‌ట్లో సూప‌ర్ డూప‌ర్ హిట్లు ఇచ్చిన దేవి ఆ త‌ర్వాత మ‌ధ్యలో కొన్ని రోజులు గ్యాప్ ఇచ్చారు. ఇక ఇప్పుడు పుష్ప తో ఆయ‌న రేంజ్ పెరిగిపోయింది. ‘పుష్ప’ సూప‌ర్ హిట్ తో దేవీ కూడా రెమ్యున‌రేష‌న్ పెంచేశాడ‌ట‌. ఇప్పుడు ఆయ‌న కూడా మినిమ‌మ్.. రూ.8 కోట్లు లేనిదే ప్రాజెక్ట్ ఒప్పుకోవ‌డం లేద‌ని అంటున్నాయి సినీ వ‌ర్గాలు.

ఎంఎం కీర‌వాణి కూడా..

ఎన్నో మెలోడియ‌స్, హిట్ పాట‌లు అందించిన సీనియ‌ర్ మ్యూజిక్ డైరెక్టర్లలో ఒక‌రు ఎం ఎం కీర‌వాణి. ఆయ‌న కూడా త‌న రెమ్యున‌రేష‌న్‌ను అమాంతంగా పెంచేశార‌ట‌. ఇక ఈ మ‌ధ్య కాలంలో ఆస్కార్ కూడా రావ‌డంతో కీర‌వాణి రేంజ్ పెరిగింద‌నే చెప్పాలి. సినిమా స‌క్సెస్ అవ్వాలంటే ప్రతి ఎలిమెంట్ ఇంపార్టెంట్. ఈ నేప‌థ్యంలో మ్యూజిక్ కూడా చాలా కీల‌క పాత్ర పోషిస్తుంది. అందుకే, మ్యూజిక్ డైరెక్టర్లకు అంత ప్రిఫ‌రెన్స్ ఉంటుంది. అలా సినిమా హిట్ అయితే.. హీరో, హీరోలు రెమ్యున‌రేష‌న్ పెంచితే.. మ్యూజిక్ డైరెక్టర్లు కూడా అదే బాట ప‌డుతున్నారు.

త్రివిక్రమ్​ అందుకే దూరమా..?

మహేష్ బాబుతో సినిమాలను తెరకెక్కించిన డైరెక్టర్లు నిర్వహించిన ఓ ఈవెంట్ కు త్రివిక్రమ్ హాజరు కాకపోవడానికి మైత్రీ మూవీ మేకర్స్ తో ఉన్న గ్యాప్ కారణమని తెలుస్తోంది. గతంలో త్రివిక్రమ్ మైత్రీ మూవీ మేకర్స్ దగ్గర అడ్వాన్స్ తీసుకుని కొన్ని కారణాల వల్ల ఆ అడ్వాన్స్ ను వెనక్కు ఇచ్చేశారు. అయితే త్రివిక్రమ్ అడ్వాన్స్ వెనక్కు ఇచ్చేసినా త్రివిక్రమ్ కు, మైత్రీ నిర్మాతలకు మధ్య గ్యాప్ ఏర్పడింది. సర్కారు వారి పాట ఈవెంట్ కు మైత్రీ మూవీ మేకర్స్ నుంచి త్రివిక్రమ్ కు పిలుపు రాలేదని మహేష్ తో గతంలో పని చేసిన డైరెక్టర్లకు పిలుపులు అందినా మహేష్ తో త్రివిక్రమ్ సినిమా ఉందని తెలిసి కూడా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలు ఈ విధంగా చేశారని ఇండస్ట్రీలో వినిపిస్తోంది. కొన్నిరోజుల క్రితం త్రివిక్రమ్ వల్లే పవన్ మైత్రీ నిర్మాతల కాంబినేషన్ లో తెరకెక్కాల్సిన భవదీయుడు భగత్ సింగ్ షూట్ వాయిదా పడిందని వార్తలు ప్రచారంలోకి వచ్చాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ డైరెక్టర్ కాగా మైత్రీ మూవీ మేకర్స్ టాలీవుడ్ లో టాప్ నిర్మాణ సంస్థ కావడం గమనార్హం.

దర్శకులే నిర్మాతలు

దర్శకులు దర్శకత్వం మాత్రమే చేయాలి.. నిర్మాతలు ప్రొడక్షన్ మాత్రమే చేయాలనే బంధాల నుంచి బయటకు వస్తున్నారు. కొంతమంది నిర్మాతలతో వేగలేక సొంతంగా చిత్రాలను నిర్మిస్తున్నారు. దర్శకులైతే ఓ వైపు మెగాఫోన్ పట్టి బిజీగా ఉంటూనే.. మరోవైపు ప్రొడక్షన్ మొదలుపెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు. తాజాగా మరో అగ్ర దర్శకుడు ఇదే చేస్తున్నారు. దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు.. టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉన్న ట్రెండ్ ఇది. అగ్ర దర్శకులంతా ఇదే ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులైతే.. నిర్మాతలుగా చాలా బిజీ అయిపోయారు. సుకుమార్ రైటింగ్స్, త్రివిక్రమ్ ప్రొడక్షన్‌లో దాదాపు మూడు నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయిప్పుడు.

దర్శకులే నిర్మాతలు.. నిర్మాతలే దర్శకులు.. టాలీవుడ్‌లో ఎప్పట్నుంచో ఉన్న ట్రెండ్ ఇది. అగ్ర దర్శకులంతా ఇదే ఫాలో అవుతున్నారు. త్రివిక్రమ్, సుకుమార్ లాంటి దర్శకులైతే.. నిర్మాతలుగా చాలా బిజీ అయిపోయారు. సుకుమార్ రైటింగ్స్, త్రివిక్రమ్ ప్రొడక్షన్‌లో దాదాపు మూడు నాలుగు సినిమాలు సెట్స్‌పై ఉన్నాయిప్పుడు. ఫార్చున్ ఫోర్ సంస్థలో త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతగా వరస సినిమాలు వస్తున్నాయి. సితార ఎంటర్‌టైన్మెంట్స్‌తో కలిసి ఎన్​బీకే 109, లక్కీ భాస్కర్, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలు నిర్మిస్తున్నారు. ఈ మధ్యే టిల్లు స్క్వేర్ సైతం ఇదే సంస్థలో వచ్చింది. ఇక సుకుమార్ రైటింగ్స్ నుంచి పుష్ప 2, ఆర్​సీ16 రాబోతున్నాయి. అలాగే దర్శకుడు పూరీ జగన్నాథ్ ఎప్పట్నుంచో నిర్మాతగా బిజీగా ఉన్నారు. తాజాగా రామ్ పోతినేని హీరోగా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ ఈయన నిర్మాణంలోనే వస్తుంది. కొరటాల శివ సైతం ఇప్పుడు నిర్మాతగా మారుతున్నారు. ఈయన సమర్పణలో కృష్ణమ్మ అనే సినిమా వస్తుంది. సత్యదేవ్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి గోపాలకృష్ణ దర్శకుడు. మే 3న విడుదల కానుంది కృష్ణమ్మ. హరీష్ శంకర్ సైతం ప్రొడక్షన్‌లోకి వచ్చారు. వెబ్ సిరీస్‌లతో పాటు సినిమాలకు సమర్పకుడిగా వ్యవహరిస్తున్నారు హరీష్. అనిల్ రావిపూడి ఆ మధ్య గాలి సంపత్ నిర్మాణంలో భాగం అయ్యారు. బ్రహ్మస్త్ర తెలుగు వర్షన్‌కు సమర్పకుడిగా ఉన్నారు రాజమౌళి.

ఇక అర్జున్ రెడ్డి, యానిమల్ సినిమాలకు సందీప్ వంగా దర్శకుడే కాదు నిర్మాత కూడా. మొత్తానికి డైరెక్టర్స్ అంతా నిర్మాతలుగానూ బిజీగా ఉన్నారిప్పుడు. సెన్సేషనల్ డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ కొన్నేండ్ల నుంచే సొంతంగా సినిమాలు నిర్మిస్తున్నారు. వర్మ క్రియేషన్స్, RGV ఫిలిం కంపెనీ, RGV డెన్ ప్రొడక్ట్స్ వంటి బ్యానర్స్ మీద ఆర్జీవీ సినిమాలు రూపొందిస్తుంటారు. కొన్ని చిత్రాలకు సమర్పకులుగానూ వ్యవహరిస్తుంటారు. వర్మ శిష్యుడు పూరీ జగన్నాథ్ కూడా ఆయన బాటలోనే నడిచారు. మొదట్లో ‘వైష్ణో అకాడమీ’ పేరు మీద సినిమాలు తీసిన పూరీ.. ఆ తర్వాత ‘పూరీ జగన్నాథ్ టూరింగ్ టాకీస్’ సంస్థలో కొన్ని చిత్రాలు నిర్మించారు. డైరెక్టర్ దశరథ్ ఆ మధ్య ‘లవ్ యూ రామ్’ అనే చిత్రాన్ని సమర్పించారు. అలానే బంగార్రాజు దర్శకుడు కల్యాణ్ కృష్ణ కురసాల ఇటీవల ‘లంబసింగి’ అనే చిత్రంతో నిర్మాతగా మారారు. దర్శక ధీరుడు ఎస్.ఎస్ రాజమౌళి గతంలో ‘విశ్వామిత్ర క్రియేషన్స్’ అనే బ్యానర్ స్థాపించి తన భార్య రమ సమర్పణలో ‘యమదొంగ’ సినిమా చేసారు. ఆ తర్వాత ‘అందాల రాక్షసి’ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించారు. ‘బ్రహ్మాస్త్రం’ అనే హిందీ సినిమాని తెలుగులో సమర్పించిన జక్కన్న.. ఇప్పుడు ‘ఆక్సిజన్‌’, ‘డోంట్‌ ట్రబుల్‌ ది ట్రబుల్‌’ వంటి రెండు చిత్రాలకు ప్రెజెంటర్ గా వ్యవహరిస్తున్నారు.

ధమాకా దర్శకుడు త్రినాథరావు నక్కిన తాజాగా ‘నక్కిన నేరేటివ్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ ఏర్పాటు చేసి నిర్మాతగా అదృష్టాన్ని పరీక్షించుకోడానికి రెడీ అయ్యారు. యంగ్ డైరెక్టర్ సందీప్ రెడ్డి వంగ ‘భద్రకాళి పిక్చర్స్’ అనే నిర్మాణ సంస్థను ఏర్పాటు చేసి తన సోదరుడు ప్రణయ్ వంగాతో కలిసి సినిమాలు నిర్మిస్తున్నారు. తన డెబ్యూ మూవీ ‘అర్జున్ రెడ్డి’ ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన సందీప్.. ‘యానిమల్’ వంటి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ నిర్మాణంలోనూ భాగస్వాములుగా ఉన్నారు. రాబోయే ‘స్పిరిట్’ మూవీలోనూ తన ప్రొడక్షన్ హౌస్ ను భాగం చేయనున్నారు. స్టైలిష్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి ‘సరెండర్ 2 సినిమా’ అనే బ్యానర్ పెట్టి, తాను డైరెక్ట్ చేసే సినిమాల నిర్మాణంలో పెట్టుబడులు పెడుతున్నారు. సెన్సిబుల్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల మొదటి నుంచీ తన ‘అమిగోస్ క్రియేషన్స్’ సంస్థలో సినిమాలు రూపొందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం ఆయన దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ‘కుబేర’ మూవీ ప్రొడక్షన్ కూడా చూసుకుంటున్నారు.

మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ ‘స్వప్న సినిమాస్’ బ్యానర్ మీద ‘జాతిరత్నాలు’ సినిమా నిర్మించి మంచి హిట్టు కొట్టాడు. క్రియేటివ్ డైరెక్టర్ తేజ ‘చిత్రం మూవీస్’ అనే పేరు మీద సినిమాలు నిర్మిస్తే.. దర్శక నటుడు రవిబాబు ‘ఫ్లయింగ్ ఫాగ్స్’ ప్రొడక్షన్ లో సినిమాలు రూపొందిస్తుంటారు. గతంలో ‘గుడ్ ఫ్రెండ్స్ గ్రూప్’ తో కలిసి సినిమాలు తీసిన ‘రాజా సాబ్’ డైరెక్టర్ మారుతి.. ఆ తర్వాత మారుతి టాకీస్, మారుతి మీడియా హౌస్ ప్రొడక్షన్ పేర్లతో చిత్రాలు నిర్మించడం ప్రారంభించారు. దర్శకుడు క్రిష్ జాగర్లమూడి తన సినిమాలన్నీ ‘ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్’ బ్యానర్ లో చేస్తుంటారు. ప్రస్తుతం అనుష్కతో ‘ఘాటి’ అనే మూవీ తెరకెక్కిస్తున్నారు. రచ్చ దర్శకుడు సంపత్ నంది ‘సంపత్ నంది టీమ్ వర్క్స్’ అనే బ్యానర్ లో తీస్తున్నారు. ఇటీవలే తమన్నా భాటియాతో ‘ఓదెల 2’ చిత్రాన్ని సెట్స్ మీదకు తీసుకెళ్లారు. ‘జానీ’ సినిమాతో దర్శకుడిగా మారిన హీరో పవన్ కల్యాణ్.. అప్పట్లో ‘పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్’ పేరుతో నిర్మాణ సంస్థ ఏర్పాటు చేసారు. త్రివిక్రమ్ తో కలిసి ‘చల్ మోహన రంగా’ నిర్మాణంలో భాగం పంచుకున్నారు. ‘ఫలక్ నుమా దాస్’ చిత్రంతో డైరెక్టర్ గా మారిన హీరో విశ్వక్ సేన్.. ‘విశ్వక్ సేన్ సినిమాస్’ బ్యానర్ లో సొంతంగా సినిమాలు చేసుకుంటున్నారు. గతేడాది తన స్వీయ దర్శక నిర్మాణంలో ‘దాస్ కా ధమ్కీ’ మూవీని తెరకెక్కించారు.

‘జోష్’ డైరెక్టర్ వాసు వర్మ సైతం సినీ నిర్మాణంలోకి వచ్చారు. Rx 100 డైరెక్టర్ అజయ్ భూపతి ‘ఎ క్రియేటివ్ వర్క్స్’ అనే ప్రొడక్షన్ హౌస్ స్థాపించి, ‘మంగళవారం’ సినిమా రూపొందించారు. ఓ బేబీ దర్శకుడు సాయి రాజేశ్ ‘అమృత ప్రొడక్షన్స్’ బ్యానర్ లో ‘కలర్ ఫోటో’ సినిమా తీసి జాతీయ స్థాయిలో ప్రశంసలు అందుకున్నారు. గుణ శేఖర్ ‘గుణ టీమ్ వర్క్స్’ లో రుద్రమదేవి, శాకుంతలం వంటి భారీ బడ్జెట్ హిస్టారికల్ మూవీస్ తెరకెక్కించారు. అలానే వైవిఎస్ చౌదరి ‘బొమ్మరిల్లు’ అనే బ్యానర్ స్థాపించి గతంలో సినిమాలు నిర్మించారు. ఇలా అనేకమంది దర్శకులు నిర్మాతలుగా మారి రెండు పడవల మీద ప్రయాణం సాగించారు. వారిలో కొందరు రెండు క్రాఫ్ట్స్ లోనూ సక్సెస్ అయితే, మరికొందరు మాత్రం నిర్మాతలుగా సినిమాలు తీసి దివాలు తీశారు. అదే సమయంలో కొందరు ప్రొడ్యూసర్స్ కూడా డైరెక్టర్లుగా అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. సీనియర్ నిర్మాత ఎమ్మెస్ రాజు ఈ మధ్య కాలంలో ‘డర్టీ హరి’ ‘7 డేస్ 6 నైట్స్’ ‘మళ్ళీ పెళ్లి’ లాంటి సినిమాలను డైరెక్ట్ చేసారు. నిర్మాత అభిషేక్ నామా ‘డెవిల్’ మూవీ కోసం మెగా ఫోన్ పట్టుకున్న సంగతి తెలిసిందే.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular