Sunday, May 19, 2024

40లో కూడా తగ్గట్లేదుగా…?

కొత్త నీరు వస్తూ ఉంటుంది పాత నీరు పోతూ ఉంటది అన్న సామెత ఊరికే రాలేదు. అది ఏ ఇండస్ట్రీలోనైనా సరే. ప్రస్తుతం హీరోయిన్స్ కాంపిటేషన్ పెరిగిపోయింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త అందాల భామలు తెరపైకి వస్తున్నారు. అందంతో పాటు డాన్స్ ల పరంగా కూడా సూపర్ టాలెంట్ చూపిస్తూ అవకాశాలు పెంచుకుంటున్నారు. అయితే ఎవరూ కూడా సుదీర్ఘకాలం స్టార్ హీరోయిన్ చైర్ లో కొనసాగే పరిస్థితి ప్రస్తుతం కనిపించడం లేదు. అయితే రెండు దశాబ్దాల నుంచి స్టార్ హీరోయిన్ గా తిరుగులేని ఇమేజ్ తో ఇప్పటికి ఒక బ్యూటీ దూసుకుపోతోంది.

ఆమె మరెవరో కాదు.. అందాల భామ త్రిష కృష్ణన్. ఈ బ్యూటీ 41వ పుట్టినరోజు కంప్లీట్ చేసుకుంది. ఈమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి 22 ఏళ్ళు అయ్యింది. 2002లో తమిళంలో త్రిష హీరోయిన్ గా మొదటి సినిమా చేసింది. 2003లో నీ మనసు నాకు తెలుసు సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. అయితే ప్రభాస్ కి జోడీగా చేసిన వర్షం మూవీ త్రిషకి బ్రేక్ ఇచ్చింది. ఆ సినిమా తర్వాత వెనక్కి తిరిగి చూసుకునే ఛాన్స్ లేకుండా వరుస అవకాశాలతో స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. కెరియర్ ఇప్పటి వరకు త్రిష 65+ సినిమాలు చేసింది. కెరియర్ ముగిసిపోయింది అనుకున్న దశలో మణిరత్నం పొన్నియన్ సెల్వన్ మూవీ త్రిషకి తిరిగి స్టార్ ఇమేజ్ తీసుకొచ్చింది. దీని తర్వాత వెంటనే లియో మూవీలో విజయ్ కి జోడీగా నటించే ఛాన్స్ అందుకుంది. సౌత్ లో అన్ని భాషలలో త్రిష హీరోయిన్ గా నటించింది.

పొన్నియన్ సెల్వన్ తర్వాత త్రిష వరుసగా అవకాశాలు అందుకుంటుంది. ప్రస్తుతం ఆమె చేతిలో నాలుగు సినిమాలు ఉన్నాయి. తెలుగులో మెగాస్టార్ చిరంజీవికి జోడీగా విశ్వంభర చిత్రంలో నటిస్తోంది. 2006లో చివరిగా స్టాలిన్ చిత్రంలో చిరంజీవికి జోడీగా త్రిష నటించింది. మళ్ళీ సుదీర్ఘ కాలం తర్వాత జతకట్టింది. మణిరత్నం దర్శకత్వంలో కమల్ హాసన్ చేస్తోన్న థగ్స్ లైఫ్ మూవీలో కూడా త్రిష ఫీమేల్ లీడ్ రోల్ లో నటిస్తోంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా సిద్ధం అవుతోంది. అలాగే విడామాయర్చి సినిమాలో స్టార్ హీరో అజిత్ తో త్రిష జతకడుతోంది. ఈ సినిమా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గానే సిద్ధం అవుతోంది. మలయాళంలో మోహన్ లాల్ కి జోడీగా ఐడెంటిటీ అనే సినిమాలో నటిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular