Saturday, February 15, 2025

గతేడాదితో పోలిస్తే హైదరాబాద్‌లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం

  • ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు విద్యుత్ శాఖ సిద్ధం
  • డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క ట్వీట్

గత సంవత్సరంతో పోలిస్తే ఈ ఏడాది హైదరాబాద్‌లో రికార్డు స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని, ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు మా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందంటూ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క అన్నారు. విద్యుత్ వినియోగంపై ట్విట్టర్ వేదికగా స్పందించిన ఆయన వినియోగానికి సంబందించి లెక్కలతో సహ వివరించారు.

గ్రేటర్ హైదరాబాద్ లో రికార్డ్ స్థాయి విద్యుత్ వినియోగం జరిగిందని, ఒక్క శనివారం రోజే విద్యుత్ వినియోగం తొంబై మిలియన్ యూనిట్లు దాటిందన్నారు. గతేడాది ఇదే రోజున 59.98 యూనిట్లు మాత్రమే వాడకం జరిగిందని, దాంతో పోలిస్తే ఈ ఏడాది దాదాపు 51 శాతం అధికంగా విద్యుత్ వినియోగం జరిగిందని డిప్యూటీ సిఎం సూచించారు. అంతేగాక ఈ వేసవిలో ఎంత డిమాండైనా తట్టుకునేందుకు మా విద్యుత్ శాఖ సిద్ధంగా ఉందని ఆయన స్పష్టం చేశారు. లోక్ సభ ఎన్నికల వేళ డిప్యూటీ సిఎం భట్టి విక్రమార్క విద్యుత్ వినియోగంపై లెక్కలతో సహా ట్వీట్ చేయడం ఆసక్తికరంగా ఉంది.

ప్ర‌దాన వార్త‌లు

తెలంగాణపై బీజేపీకి చిత్తశుద్ధి లేదని తేలిపోయిందన్న కవిత వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com