Monday, May 13, 2024

దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు

దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు ఖైరతాబాద్ ఎంఎల్‌ఎ దానం నాగేందర్ సహా పలువురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దానం ఎన్నిక రద్దు చేయాలంటూ ప్రత్యర్థి అయిన కాంగ్రెస్ అభ్యర్థి విజయారెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై జస్టిస్ విజయ్‌సేన్ రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. అసెంబ్లీ ఎన్నికల్లో దానం ఓటర్లను ప్రలోభపెట్టారని.. డబ్బులు పంచడంతో పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని పిటిషనర్ తరఫు న్యాయవాది కోర్టుకు వెల్లడించారు. అలాగే, ఆయన సతీమణి పేరు మీద ఉన్న ఆస్తుల వివరాలను నామినేషన్ పత్రాల్లో వెల్లడించలేదన్నా రు. ఈ వాదనలు విన్న ఉన్నత న్యాయస్థానం వివరణ ఇవ్వాలంటూ దానం నాగేందర్‌కు నోటీసులు జారీ చేసింది.

తదుపరి విచారణను ఏప్రిల్ 18కి వాయిదా వేసింది. ఎన్నికల పిటిషన్లపై వివవరణ ఇవ్వాలంటూ ఐదుగురు ఎంఎల్‌ఎలకు హైకోర్టు నోటీసులు జారీ చేసింది. వివిధ అసెంబ్లీ నియోజకవర్గాల నుంచి గెలుపొందిన అభ్యర్థులను అనర్హులుగా ప్రకటించాలంటూ హైకోర్టులో పిటిషన్లు దాఖలయ్యాయి. ఎన్నికల అఫిడవిట్‌లో తప్పుడు సమాచారం దాఖలు చేశారని కొన్ని, డబ్బులు పంచి ఓటర్లను ప్రలోభ పెట్టారని, చట్టప్రకారం నేరమని పిటిషన్ తరపు లాయర్లు పేర్కొ న్నారు. మహబూబ్‌నగర్ ఎంఎల్‌ఎ యెన్నం శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌ను సవాల్ చేస్తూ శ్రీనివాస్ గౌడ్, దేవరకద్ర ఎంఎల్‌ఎ మధుసూ దన్‌రెడ్డి ఎన్నికల అఫిడవిట్‌పై ఆల వెంకటేశ్వర్ రెడ్డి చేసిన పిటిషన్‌పై కోర్టు విచారణ చేపట్టింది.

యెన్నంశ్రీనివాస్ రెడ్డి, మధుసూదన్‌రెడ్డికి నోటీ సులు జారీచేస్తు విచారణ ఏప్రిల్ 19కి వాయిదా వేశారు. అసిఫాబాద్ ఎంఎల్‌ఎ కోవా లక్ష్మీ ఎన్నికల అఫిడవిట్‌పై అజ్మీరా శ్యాం, జూబీ ్లహిల్స్ ఎంఎల్‌ఎ మాగంటి గోపీనాథ్ అఫిడవిట్‌పై అజారుద్దీన్, నవీన్ యాదవ్, కూనంనేని సాంబశివరావు ఎన్నికల అఫిడవిట్‌పై నందూ లాల్ అగర్వా ల్ దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది. కోవా లక్ష్మీ, మాగంటి గోపీనాథ్, కూనంనేని సాంబశివరావుకి నోటీసులు జారీ చేస్తూ విచారణను వచ్చేనెల 16కి వాయిదా వేశారు. మరికొంత మంది ఎంఎల్‌ఎల ఎన్నికలను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్‌లు దాఖలయ్యా యి. అవి విచారణకు రానున్నాయి. కాగా, ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బిఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నియోజకవర్గం నుంచి గెలుపొందారు. తాజాగా, ఆయన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. 1994, 1999, 2004లో ఆసిఫ్‌నగర్ నుంచి విజయం సాధించిన దానం 2009, 2018లో మాత్రం ఖైరతాబాద్ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్ ప్రభుత్వంలో మంత్రిగా కూడా పని చేశారు. మారిన రాజకీయ పరిణామాలతో బిఆర్‌ఎస్‌లో చేరారు. ఇప్పుడు కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో హస్తం గూటికి చేరారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular