Monday, May 13, 2024

14 రోజుల జ్యూడీషియల్‌ కస్టడీలో… కవిత

  • కవితకు బిగ్‌ షాక్‌
  • 14 రోజుల పాటు రిమాండ్‌
  • ఏప్రిల్-01న మధ్యంతర బెయిల్ పిటిషన్‌పై వాదనలు
  • తీహార్‌ జైలుకి తరలింపు
  • కస్టడీ పెంచాలని న్యాయస్థానాన్ని కోరిన ఈడీ

కల్వకుంట్ల కవిత బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ కుమార్తె ఎమ్మెల్సీ కవితకి బిగ్‌ షాక్‌ తగిలింది. లిక్కర్‌ స్కామ్‌లో అరెస్టయిన విషయం తెలిసిందే. దీని కోసం మధ్యంతర బెయిల్‌ ఇవ్వాలని కవిత.. కస్టడీకి ఇవ్వాలని ఈడీ రౌస్ అవెన్యూ కోర్టులో వాదోపవాదాలు జరిగాయి. ఫైనల్‌గా 14 రోజులపాటు కస్టడీకి కోర్టు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీంతో ఏప్రిల్-09 వరకు కవిత ఈడీ కస్టడీలోనే ఉండనున్నారు. ఈడీ కస్టడీ ముగిసిన అనంతరం ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం. ఈ మేరకు ఆమె ఊహించని విధంగా కోర్టులో తీర్పు వచ్చింది. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలించి.. అక్కడే విచారణ జరుపుతారని అధికార వర్గాలు చెబుతున్నారు.

బెయిల్‌ పిటీషన్‌…
ఈడీ కస్టడీముగిసిన నేపథ్యంలో ఆమెకు 14 రోజుల జ్యూడీషియల్ కస్టడీ విధించింది ధర్మాసనం. ఈ మేరకు తీర్పు వెలువరించింది కోర్టు. ఏప్రిల్ 9వ తేదీ వరకు కవిత జ్యూడీషియల్ కస్టడీలో ఉండనున్నారు. ఏప్రిల్ 9 న ఉదయం 11 గంటలకు కోర్టులో హాజరుపరచాలని న్యాయస్థానం స్పష్టం చేసింది. అయితే, కవితను కస్టడీకి ఇవ్వడం ఇది మూడోసారి. మొదట 7 రోజులు, ఆ తరువాత 3 రోజులు, ఇప్పుడు 14 రోజులు జ్యూడీషియల్ కస్టడీకి ఇచ్చింది న్యాయస్థానం. కవితను తీహార్ జైలుకు తరలించి.. అక్కడే విచారణ జరుపుతాతరని అధికార వర్గాలు చెబుతున్నారు.

విచారణకు కొరకు ఈడీ న్యాయవాదులు…
కవిత విచారణకు సహకరించడం లేదని, మరింత సమాచారం రాబట్టాల్సి ఉందని ఈడీ తరఫు న్యాయవాదులు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. కేజ్రీవాల్, కవితను కలిపి విచారించాల్సిన అవసరం ఉందని, అందుకే మరో వారం రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఈడీ కోరింది. ఈ నేపథ్యంలో కోర్టు ఎమ్మెల్సీ కవితకు 14 రోజుల జ్యూడీషియల్ రిమాండ్ విధించింది.

కవిత సంచలన వ్యాఖ్యలు…
కోర్టుకు వచ్చే ముందు ఎమ్మెల్సీ కవిత సంచలన కామెంట్స్ చేశారు. ఈ కేసులో తాను కడిగిన ముత్యంలా బయటకు వస్తానని అన్నారు. ఇది మనీలాండరింగ్ కేసు కాదని, పొలిటికల్ లాండరింగ్ కేసు అని విమర్శించారు. తాను ఏ తప్పు చేయలేదని, అప్రూవర్‌గా మారానని అన్నారు. ఈ కేసులో ఒక నిందితుడు బీజేపీలోకి చేరితే.. 2వ నిందితుడికి బీజేపీ టిక్కెట్ ఇచ్చిందని కవిత వ్యాఖ్యానించారు. అంతేకాక గతంలో కేసీఆర్‌ కూడా ఎవరు వస్తారో చూస్తాను ఈడీనా.. బోడీనా… అని ఓ పొలిటికల్‌ వేదిక మీద కామెంట్లు చేశారు. దాన్ని ప్రస్తుతం సోషల్‌ మీడియాలో ఆ కామెంట్లన్నీ కూడా తెగ వైరల్‌ అవుతున్నాయి. చివరికి ఏ కేసు ఏమవుతుందో చూడాలి మరి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular