Sunday, April 28, 2024

బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్​

  • బీజేపీలో చేరే తొలి వ్యక్తి రేవంత్​
  • మాజీ మంత్రి కేటీఆర్​ హాట్​ కామెంట్స్​

టీఎస్​, న్యూస్​:
లోక్‌సభ ఎన్నికల తర్వతా బీజేపీలో చేరే మెదటి వ్యక్తి సీఎం రేవంత్‌రెడ్డి అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. రేవంత్ జీవితమంతా కాంగ్రెస్‌లోనే ఉంటానని ఏనాడు చెప్పడం లేదన్నారు. మంగళవారం నాడు తెలంగాణ భవన్‌లో కేటీఆర్ మీడియాతో మాట్లాడుతూ రూ. 2500 కోట్లను ఢిల్లీకి రేవంత్‌రెడ్డి పంపించారని ఆరోపించారు. జేబులో కత్తెర పెట్టుకుని తిరుగుతున్న జేబు దొంగ రేవంత్ అని ఎద్దేవా చేశారు. ఫోన్ ట్యాపింగ్ అయితే సీఎం రేవంత్ విచారణ చేయించాలని అన్నారు. విచారణలో తప్పు జరిగిందని తేలితే నిందితులపై చర్యలు తీసుకోవాలని చెప్పారు. రేవంత్‌కు భయపడే వారు ఎవ్వరూ లేరని అన్నారు. ఆయన తమను ఏం చేయలేరని అన్నారు. రేవంత్ బిల్డర్లను బెదిరిస్తూ డబ్బులు వసూలు చేస్తున్నారన్నారు. మూడు నెలలుగా ఎందుకు బిల్డిం‌గ్‌లకు అనుమతులు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. దొంగ కేసులు పెట్టి బీజేపీ నేతలు తమను బెదిరిస్తున్నారని ధ్వజమెత్తారు. లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు దేశవ్యాప్తంగా 40 ఎంపీ సీట్లు కూడా రావని చెప్పారు. రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి లెక్క మాట్లాడటం లేదని చెప్పారు.

ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక..!
ఎమ్మెల్యే దానం నాగేందర్ బీఆర్ఎస్‌‌ను వదిలిపోవడంతో తమకు ఏం నష్టం లేదన్నారు. మూడు, నాలుగు నెలల్లోనే ఖైరతాబాద్‌లో ఉప ఎన్నిక వస్తుందన్నారు. ఆ ఎన్నిక కోసం బీఆర్ఎ‌స్ క్యాడర్ సిద్ధంగా ఉండాలని.. ద్రోహం చేసిన వారికి బుద్ధి చెప్పాలని హెచ్చరించారు. నాగేందర్ అధికారం కోసం ఆశపడి, గెలిపించిన ప్రజలకు ద్రోహం చేసి కాంగ్రెస్‌లోకి వెళ్లారని అన్నారు. ఖైరతాబాద్ ప్రజలు ఉప ఎన్నికలో బీఆర్ఎస్‌ని గెలిపించి, ఆయన నిర్ణయం తప్పని నిరూపిస్తారనే నమ్మకం ఉందని అన్నారు. నాగేందర్ అవకాశవాద రాజకీయాల కోసం కాంగ్రెస్‌లోకి వెళ్లారని మండిపడ్డారు.
గతంలో ఆసిఫ్‌నగర్ నుంచి పోటీ చేసి ఓడిపోయిన పరిస్థితి మళ్లీ రిపీట్ అవుతుందన్నారు. రెండు పడవల ప్రయాణం ఎప్పుడు కూడా మంచిది కాదన్నారు. దానం నాగేందర్‌పై ఇచ్చిన ఫిర్యాదుపై అసెంబ్లీ స్పీకర్ వెంటనే నిర్ణయం తీసుకోవాలని కోరారు. నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. అవసరం అయితే సుప్రీంకోర్టు దాకా వెళ్లి మరి అనర్హుడిగా ప్రకటించేలా చేస్తామన్నారు. రాజకీయాల్లో హత్యలుండవు, అత్మహత్యలే ఉంటాయని చెప్పారు. అధికారం లో ఉన్నప్పుడు పార్టీలోకి రావటం, ఉండటం మంచి పద్ధతి కాదన్నారు. కష్ట కాలంలో పార్టీలో నిలబడినప్పుడే నిజమైన నాయకులు అవుతారని చెప్పారు. దానం నాగేందర్ పార్టీ మారి తప్పు చేశారని మండిపడ్డారు. ఓటు వేసిన కార్యకర్తలను మోసం చేసి వెన్నుపోటు పొడిచారని కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular