Monday, May 20, 2024

175 కోట్ల నెక్లెస్ తో మెరిసిన మెఘా సుధారెడ్డి

  • 175 కోట్ల నెక్లెస్ తో మెరిసిన మెఘా సుధారెడ్డి
  • మెట్ గాల ఫ్యాషన్ షో లో హై కాస్ట్

టీఎస్ , న్యూస్ :మెట్​గాలా‌‌(Met Gala 2024) ఫ్యాషన్​ షో లో 175 కోట్ల విలువ చేసే వజ్రాల నెక్లస్ మెరుపులు మెరిసింది. ఈ నెక్లెస్ మన తెలంగాణ … అందులోనూ హైదరాబాద్ క్వీన్ వేసుకోవడం మరో స్పెషల్. న్యూయార్క్​ నగరంలోని మెట్రోపాలిటన్​ మ్యూజియం ఆఫ్​ ఆర్ట్​ కోసం నిర్వహించే నిధుల సేకరణ కార్యక్రమం. ఈ ఈవెంట్​ ప్రతీ సంవత్సరం మే నెల మొదటి సోమవారం నాడు న్యూయార్క్​లో నిర్వహించబడుతుంది. ఈసారి మే 6న వెలుగుజిలుగుల మధ్య ఈ ఉత్సవం ఘనంగా జరిగింది. ప్రపంచంలోనే పేరెన్నికగన్న ఫ్యాషన్​ దిగ్గజాలు, సినిమా నాయికలు, ఫ్యాషన్​ సృష్టికర్తలు, ఈ రంగంలో యువ కెరటాలు ఇందులో పాల్గొన్నారు.

క్వీన్ ఆఫ్ హైదరాబాద్

సుధారెడ్డి.. క్వీన్​ బీ ఆఫ్​ హైదరాబాద్​( హైదరాబాద్​ రాణీగ)గా పిలువబడే ఈ అతివ, మేఘా ఇంజనీరింగ్​ అండ్​ ఇన్​ఫ్రాస్ట్రక్చర్​ లిమిటెడ్​(మెయిల్​) Megha Engineering & Infrastructure Ltd అధినేత కృష్ణారెడ్డి సతీమణి. మెయిల్​లో ఈమె డైరెక్టర్​ కూడా.
మేఘా ఇంజనీరింగ్​ కంపెనీ అంటే తెలుసుకదా.. ఎలక్టోరల్​ బాండ్స్​విషయంలో అత్యధికంగా కొనుగోలు చేసిన కంపెనీలలో మేఘా ఇంజనీరింగ్​ రెండవస్థానంలో ఉంది. దాదాపు 966 కోట్ల విలువైన బాండ్లు మేఘా కొనుగోలు చేసింది. 4500 కోట్ల విలువైన జోజిలాపాస్​సొరంగాన్ని మేఘా ఇంజనీరింగ్​ కంపెనీనే నిర్మించింది. తనను తాను కళలు, ఫ్యాషన్​ రంగాలపై అమితాసక్తి గల మేధావిగా అభివర్ణించుకునే సుధ, దానధర్మాలకు కూడా పేరుగాంచింది. తన ఆధ్వర్యంలో ఎన్నో చారిటబుల్​ ట్రస్టులు కూడా నడుస్తున్నాయి. విజయవాడకు చెందిన సుధ 19 ఏళ్లకే పెళ్లిచేసుకుని ఇద్దరు కొడుకులకు తల్లయింది.

175 కోట్ల నెక్లెస్

2024 మెట్​గాలాలో సుధారెడ్డి ధరించిన వజ్రాల నెక్లెస్​అందరి దృష్టనీ ఆకర్షించి, ఆ రాత్రి టాక్​ ఆఫ్​ న్యూయార్క్​​ గా మారిపోయింది. ఆ నగ ఒక్కటే 180 క్యారెట్ల వజ్రాలతో పొదగబడిఉంది. మీరు విన్నది నిజమే. అక్షరాల 180 క్యారెట్ల వజ్రాలు. ఇందులో ఒకటి 25 క్యారెట్ల హృదయాకారపు వజ్రం కాగా, మరో మూడు 20 క్యారెట్ల హృదయాకారపువి. ఈ మూడూ తన భర్త, ఇద్దరు పిల్లలను ప్రతిబింబిస్తాయని అమె తెలిపింది. ఈ నెక్లెస్​ పేరు ‘అమోర్​ ఎటెర్నో’Amore Eterno
(ఇటాలియన్​ లో అంతులేని ప్రేమ). ఇదే కాకుండా 23, 20 క్యారెట్ల వజ్రాలు పొదిగిన రెండు ఉంగరాలు( Solitaire Rings) కూడా తొడిగింది. మొత్తానికి ఈ వజ్రపు ఆభరణాల విలువ 20 మిలియన్​ డాలర్లు( $20 Million)..అంటే రెండు కోట్ల డాలర్లు..అంటే దాదాపు 170 కోట్ల రూపాయలు. అవును.. అక్షరాలా నూటాడెబ్భై కోట్ల రూపాయలు మాత్రమే.

స్పెషల్ గౌన్

2021లో మెట్​గాలాలోకి ఎంట్రీ ఇచ్చిన సుధ, అప్పుడు ప్రముఖ డిజైనర్​ జంట ఫాల్గుణి‌‌–షేన్​ పీకాక్​ డిజైన్​ చేసిన గౌన్​ ధరించింది. ఇది రెండవసారి. ఈసారి ఆమె ధరించిన గౌను సెలిబ్రిటీ ఫ్యాషన్​ డిజైనర్​ తరుణ్​ తహ్లియానీ డిజైన్​ చేసారు. 80 మంది కళాకారులు దాదాపు 4500 గంటలు కష్టపడి చేత్తో తయారుచేసారు. ప్రతీ చిన్న డిజైన్​ను కూడా నిశితంగా పరిశీలించి తయారుచేసారని తెలుస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular