Saturday, May 18, 2024

కాంగ్రెస్ కే మా మద్ధతు

  • రేవంత్​కు ఐదేండ్లు ఢోకా లేదు
  • ఎంఐఎం అధినేత అసదుద్దీన్​

టీఎస్​, న్యూస్​: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సర్కార్ కు ఐదేళ్ళ పాటు ఎలాంటి ఢోకా లేదని ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అభ్యర్ధి అసదుద్దీన్ ఒవైసీ అన్నారు. తాను ప్రజల మధ్యనే ఈ విషయం రేవంత్ రెడ్డికి చెప్పానని అన్నారు. అభివృద్ధి. ముతపర శాంతి కోసం రేవంత్ ప్రభుత్వానికి మద్దతుగా ఉంటామని స్పష్టం చేశారు. రేవంత్ సర్కారుని పడగొడతామన్నవారే పడిపోతారని ఓవైసీ అన్నారు. బీజేపీ అభ్యర్థి మాధవీలత రెచ్చగొట్టేలా వ్యవహరిస్తున్నారని, రాష్ట్రంలో అశాంతి సృష్టించాలని బీజేపీ ప్రయత్నిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు.

మతవర గొడవలు సృష్టించాలన్నదే మాధవీలత అజెండా అని అరోపించారు. రిజర్వేషన్లను తొలగించానేది బీజేపీ లక్ష్యమని, రాజ్యాంగాన్ని రద్దు చేసేందుతో 400 సీట్లు సాధించాలనుకుంటోందని చెప్పారు. హైదరాబాద్ లోక్ సభ నియోజక వర్గంలో పతంగి ఎగురుతుందని, బీజేపీ ఖతం అవుతుందన్నారు. తమ పార్టీ కోసం నల్గొండ గద్దర్ మంచి పాట ఇచ్చారని చెప్పారు. పని తీరును చూసి, గద్దర్ ముచి లిరిక్స్ ఇచ్చాడని తెలిపారు. తెలంగాణ, ఏపీలో పార్టీ ప్రచారం కోసం ఈ పాట ఎంతో ఉపయోగపడుతుందని చెప్పారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular