Thursday, January 23, 2025

ఏ అధికారంతో ఇక్కడికి వచ్చారు..?

ఢిల్లీ పోలీసులపై ఎంపీ రేణుకా చౌదరీ ఫైర్​

టీఎస్​, న్యూస్​: ఢిల్లీ పోలీసులు ఏ అధికారంతో తెలంగాణకు వచ్చి కాంగ్రెస్​ కార్యకర్తలపై కేసులు పెడుతున్నారని ఆ పార్టీ ఎంపీ రేణుకా చౌదరీ నిలదీశారు. రాష్ట్రానికి వచ్చి అక్రమంగా కేసులు పెట్టిన ఢిల్లీ పోలీసులకు తెలంగాణ తడాఖా ఎంటో చూపిస్తామని హెచ్చరించారు. సోమవారం గాంధీభవన్​ లో మీడియాతో మాట్లాడిన ఆమె బీజేపీ వాళ్ళకి దమ్ముంటే ప్రజ్వల్ రేవణ్ణను పట్టుకోవాలని సవాల్​ విసిరారు. నీరవ్ మోదీ, చాక్సీ పారిపోయినట్టే రేవణ్ణ పారిపోయారని మండిపడ్డారు. ప్రజ్వల్‌ను బలపరిస్తే తనను బలపర్చినట్టే అని మోడీ సిగ్గులేకుండా మాట్లాడుతున్నారని చురకలంటించారు. బీజేపీ నాయకులు ఇంత చేస్తున్నా.. ఎన్నికల అధికారులు మౌనంగా ఉండడాన్ని ఆమె తప్పుబట్టారు.

ఎన్నో అరాచకాలు చేసిన కేంద్ర మంత్రి బ్రిజ్ భూషణ్ కు బీజేపీ మళ్లీ టికెట్ ఇచ్చిందంటూ ధ్వజమెత్తారు. ముస్లిం మైనార్టీలకు వ్యతిరేకంగా వ్యవహరిస్తోన్న మోడీ దేశంలో ఉన్న ముస్లింలకుప్రధాని కారా? అని ప్రశ్నించారు. మన భూభాగంలో అక్రమంగా చొరబడి.. భూమిని ఆక్రమించుకున్నా మోడీ మాట్లాడడం లేదన్నారు. జవాన్లు, రైతులు అనే రెండు పెద్ద సెక్యులర్ ఫోర్సెస్ దేశంలో ఉన్నాయన్నారు. వారే ఈ ఎన్నికల్లో కాంగ్రెస్​ ను గెలిపిస్తారన్నారు. తెలంగాణ రాజకీయాలపై మాట్లాడిన అనంతరం ఆమె ఏపీలోని వైసీపీ ప్రభుత్వంపై వ్యంగ్యాస్త్రాలు విసిరారు. మూడు రాజధానులపై సెటైర్ వేసిన ఆమె.. ఏపీకి జగన్ మూడు రాజధానులు ఏర్పాటు చేశారన్నారు. ఈ మూడింటిలో ఒకటి డ్రగ్స్, రెండు మర్డర్స్, మూడోది నిరుద్యోగం అని ఎద్దేవా చేశారు. గత ఐదేండ్లలో ఏపీలో జగన్ ఏర్పాటు చేసింది ఈ మూడింటినే అన్నారు.

ప్ర‌దాన వార్త‌లు

గోటితో పోయే దాన్ని గోడ్డ‌లి వ‌ర‌కు తెచ్చారు... బ‌న్నీ అరెస్ట్‌ వివాదంపై డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌ వ్యాఖ్యలను మీరు సమర్థిస్తున్నారా...?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com