Tuesday, May 21, 2024
Home Blog Page 130

మోడీకి రేవంత్ చేసిన విజ్ఞప్తులు ఇవే

  • రెండు రోజుల తెలంగాణ పర్యటనకు విచ్చేసిన
  • ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి ముఖ్యమంత్రి ఏ.రేవంత్ రెడ్డి అందించిన విజ్ఞప్తులు

1. ఎన్టీపీసీలో 4000 మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి సామర్థ్యం ఉంటే గత ప్రభుత్వం 1600 మెగావాట్లు మాత్రమే సాధించింది. మిగిలిన 2400 మెగావాట్ల ఉత్పత్తికి కేంద్ర ప్రభుత్వం సహకరించాలి. రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని అనుమతులు ఇస్తాం.

2. హైదరాబాద్ మెట్రో విస్తరణ అభివృద్ధికి, మూసీ ప్రక్షాళన రివర్ ఫ్రంట్ అభివృద్ధికి సహకరించండి.

3. తుమ్మిడిహెట్టి ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉంది. భూసేకరణ, నీటి వాటాల విషయంలో మహారాష్ట్ర ప్రభుత్వాన్ని ఒప్పించేంందుకు ప్రధాని జోక్యం చేసుకోవాలి.

4. హైదరాబాద్–శ్రీశైలం జాతీయ రహదారిపై అమ్రాబాద్ ఫారెస్ట్ ఏరియా మీదుగా ఎలివేటేడ్ కారిడార్ నిర్మాణానికి సహకరించాలి. 2022–23లోనే కేంద్ర ప్రభుత్వం డీపీఆర్ తయారీకి రూ,3 కోట్లు మంజూరు చేసింది. రూ.7700 కోట్ల అంచనా ఖర్చయ్యే ఈ ప్రాజెక్టును మంజూరు చేయాలి. ఈ కారిడార్ తో అటు శ్రీశైలం వెళ్లే యాత్రికులతో పాటు హైదరాబాద్ నుంచి ఏపీలోని ప్రకాశం జిల్లా వరకు 45 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. దక్షిణ తెలంగాణ వైపు రవాణ మార్గాలు విస్తరిస్తాయి.

5. రాష్ట్రంలో నూటికి నూరు శాతం ఇంటింటికీ నల్లా నీటిని అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సాయం అందించాలి. దాదాపు పది లక్షల కుటుంబాలకు ఇప్పటికీ నల్లా నీళ్లు అందటం లేదు. సమీపంలోని నీటి వనరుల ద్వారా గ్రామాలకు రక్షిత మంచినీటిని సరఫరా చేసేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జల జీవన్ మిషన్ నిధులు కేటాయించాలని విజ్ఞప్తి చేస్తున్నాం.

6. తెలంగాణలో పెరిగిన జిల్లాల సంఖ్య , పోలీస్ కమిషనరేట్ల సంఖ్యకు అనుగుణంగా ఐపీఎస్ క్యాడర్ రివ్యూ చేయాలి. కేంద్ర హోంశాఖ 2016లో తెలంగాణకు 76 ఐపీఎస్ కేడర్ పోస్టులను మంజూరు చేసింది. జిల్లాల పునర్వ్యవస్థీకరణ, పెరిగిన జనాభాను బట్టి రాష్ట్రంలో పోలీసు అధికారుల అవసరం పెరిగింది. అత్యవసరంగా 29 పోస్టులను అదనంగా కేటాయించాల్సి ఉంది. ఐపీఎస్‌ క్యాడర్‌ రివ్యూను అత్యవసర అంశంగా పరిగణించాలి. వీలైనంత త్వరగా పోస్టులు మంజూరు చేయాలి.

7. హైదరాబాద్– రామగుండం, హైదరాబాద్–నాగ్​పూర్​ రహదారిపై రక్షణ శాఖ భూముల మీదుగా ఎలివేటేడ్ కారిడార్ల నిర్మాణానికి అనుమతి ఇచ్చినందుకు కేంద్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి ధన్యవాదాలు తెలిపారు. వీటితో పాటు కారిడార్ల నిర్మాణానికి కంటోన్మెంట్ ఏరియాలో 178 ఎకరాలు, 10 టీఎంసీల కేశవపురం రిజర్వాయర్ నిర్మాణానికి పొన్నాల గ్రామ సమీపంలోని 1350 ఎకరాల మిలిటరీ డెయిరీ ఫామ్ ల్యాండ్స్ (తోఫెఖానా) రాష్ట్రానికి బదిలీ చేయాలి. లీజు గడువు ముగిసిన శామీర్​ పేటలో ఫీల్డ్ ఫైరింగ్ రేంజ్ (1038 ఎకరాల) భూములను తిరిగి అప్పగించాలి.

8. ఐఐటీ, నల్సార్, సెంట్రల్ యూనివర్సిటీ తో పాటు ఎన్నో పేరొందిన పరిశోధన, ఉన్నత విద్యా సంస్థలు హైదరాబాద్ లో ఉన్నాయి. అత్యున్నత విద్యా సంస్థలు అందరికీ అందుబాటులో ఉండాలని ప్రతి రాష్ట్రంలో ఒక ఐఐఎం నెలకొల్పాలనేది కేంద్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. అందులో భాగంగా హైదరాబాద్లో ఐఐఎం (ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్) నెలకొల్పాలి. అందుకు అవసరమైనంత స్థలాన్ని రాష్ట్ర ప్రభుత్వం కేటాయిస్తుంది.

9. నేషనల్ హెల్త్ మిషన్ కార్యక్రమం రాష్ట్రంలో విజయవంతంగా అమలు చేస్తున్నాం. 5259 ఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలను ప్రభుత్వం నిర్వహిస్త్తోంది. 2023–24 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కేంద్ర వాటాగా రాష్ట్రానికి రావాల్సిన రూ.347.54 కోట్లను వెంటనే విడుదల చేయాలి.

10. భారత్ మాల పరియోజన జాతీయ రహదారుల అభివృద్ధిలో భాగంగా తెలంగాణకు ప్రయోజనంగా ఉండే ఎనిమిది ప్రాజెక్టుల నిర్మాణాన్ని వేగవంతం చేయాలి. కల్వకుర్తి–కొల్లాపూర్, గౌరెల్లి–వలిగొండ, తొర్రూర్–నెహ్రూనగర్, నెహ్రూనగర్–కొత్తగూడెం, జగిత్యాల–కరీంగర్ ఫోర్ లేన్, జడ్చర్ల–మరికల్ ఫోర్ లేన్, మరికల్–డియసాగర్ నిలిచిపోయిన టెండర్ల ప్రక్రియకు వెంటనే అనుమతులు మంజూరు చేయాలి.

11. తెలంగాణలో సెమీ కండక్టర్ల తయారీ పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం సహకారాన్ని కోరుతున్నాం. ఇప్పటికే ఎలక్ట్రానిక్స్ మ్యానుఫ్యాక్చరింగ్ లో ప్రధాన పెట్టుబడుల గమ్యస్థానంగా తెలంగాణను తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా ఎంచుకుంది. సెమీ కండక్లర్లు, డిస్ ప్లే మ్యానుఫ్యాక్షరింగ్ రంగంలో కొత్త శకానికి నాంది పలికేందుకు ఇండియా సెమీ కండకర్ల మిషన్లో భాగంగా కేంద్రం సాయం అందించాలి.

ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు..

0
  • ప్రొఫెసర్ సాయిబాబా నిర్దోషి.. బాంబే హైకోర్టు తీర్పు..
  • జీవిత ఖైదును రద్దు చేసిన న్యాయస్థానం..
  • మావోయిస్టులతో లింకుల కేసులో అరెస్టు..
  • 2017లో సాయిబాబాను దోషిగా తేల్చిన సెషన్స్ కోర్టు..

ఢిల్లీ యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబాను బాంబే హైకోర్టు నిర్దోషిగా తేల్చింది. ఆయనకు విధించిన జీవిత ఖైదును రద్దు చేసింది. ఈ మేరకు మంగళవారం ఉదయం బాంబే హైకోర్టు తీర్పు వెలువరించింది.

మావోయిస్టులతో సంబంధాలున్నాయనే ఆరోపణలతో మహారాష్ట్ర పోలీసులు ప్రొఫెసర్ సాయిబాబాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

ఢిల్లీ లోని ఆయన నివాసంలో మావోయిస్టు సాహిత్యం దొరికిందని ఆరోపించారు. ఆయనను గడ్చిరోలి సెషన్స్ కోర్టులో హాజరు పరిచారు. 2017లో సెషన్స్ కోర్టు ఆయనను దోషిగా తేల్చి జీవిత ఖైదు విధించింది.

అనారోగ్యంతో వీల్ చెయిర్ కే పరిమితమైన ప్రొఫెసర్ సాయిబాబా ప్రస్తుతం నాగ్ పూర్ జైలులో శిక్ష అనుభవిస్తున్నారు.

సెషన్స్ కోర్టు తీర్పుపై ఆయన బాంబే హైకోర్టును ఆశ్రయించగా.. 2022 అక్టోబర్ 14న ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటించింది. సెషన్స్ కోర్టు తీర్పును కొట్టేసింది.

అయితే, ఈ కేసులో మహారాష్ట్ర ప్రభుత్వం సుప్రీం కోర్టులో పిటిషన్ వేయగా.. బాంబే హైకోర్టు తీర్పును అత్యున్నత న్యాయస్థానం పక్కన పెట్టింది. మరోసారి విచారణ జరపాలని బాంబే హైకోర్టుకు సూచించింది.

దీంతో, మళ్లీ విచారించిన బాంబే హైకోర్టు తాజాగా మంగళవారం ప్రొఫెసర్ సాయిబాబాను నిర్దోషిగా ప్రకటిస్తూ తీర్పు వెలువరించింది.

మల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజ్ లో ఉద్రిక్తత..

0

హైదరాబాద్: గండి మైసమ్మ లోని MREC క్యాంపస్ లో విద్యార్థుల ఆందోళన.అన్నంలో, స్వీట్ లో పురుగులు రావడంతో ఆందోళనకు దిగిన విద్యార్థులు.ఇటీవల కూడా మల్లారెడ్డి కాలేజ్ లో పురుగుల అన్నం పెడుతున్నారని విద్యార్థులు, విద్యార్థి సంఘాల ధర్నా..

 

ప్రజా భవన్ కు భారీగా తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు.

0

తమకు ఉద్యోగాలు ఇచ్చి ఆదుకోవాలంటూ ప్రజా భవన్ కు తరలివచ్చిన డీఎస్సీ 2008 బాధితులు.
• రాష్ట్రం నలుమూలల నుండి తరలివచ్చిన సుమారు 300 మంది పైగా అభ్యర్థులు.
• తమకు ఉద్యోగాలు ఇవ్వాలని రాష్ట్ర హైకోర్టు ఉత్తర్వులు జారీ చేసిందని, గతంలో సీఎం రేవంత్ రెడ్డి కూడా తమకు హామీ ఇచ్చారని గుర్తు చేస్తున్న బాధితులు.
• అధికారంలోకి వచ్చిన మూడు నెలలలోపే 30 వేల మందికి ఉద్యోగ నియామక పత్రాలు ఇచ్చి జీవితాల్లో వెలుగు నింపిన కాంగ్రెస్ ప్రభుత్వం.. డీఎస్సీ 2008 కి చెందిన వెయ్యి మంది బాధితుల 15 ఏళ్ల కన్నీళ్లను తుడవాలని కోరుతున్న అభ్యర్థులు.
• సీఎం రేవంత్ రెడ్డి స్పందించాలని కోరుతున్న అభ్యర్థులు.

 

మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు

0

టిఎస్ హైకోర్టు : మాజీమంత్రి శ్రీనివాస్ గౌడ్ కి హైకోర్టులో చుక్కెదురు.తనకు 4 + 4 గన్ మెన్ లను కేటాయించాలని మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ హైకోర్టులో పిటిషన్.తనకు ప్రాణ హాని ఉందని హైకోర్టు లో పిటిషన్ వేసిన శ్రీనివాస్ గౌడ్.శ్రీనివాస్ గౌడ్ వేసిన పిటిషన్ పై హైకోర్టు విచారణ.మాజీ మంత్రి శ్రీనివాస్ గౌడ్ అభ్యర్థునను నిరాకరించిన హైకోర్టు.ప్రతి ఒక్కరికి ఈ విధంగా కేటాయించడం సాధ్యం కాదన్నా హైకోర్టు.శ్రీనివాస్ గౌడ్ కు గన్ మెన్ లు అవసరమో లేదో తెలపాలని డీజీపీకి హైకోర్టు ఆదేశం.కౌంటర్ దాఖలు చేయాలనీ డీజీపీ కి హైకోర్టు ఆదేశం.తదుపరి విచారణ ను మార్చ్ 19 కి వాయిదా వేసిన హైకోర్టు.

టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు

0

టానిక్ లిక్కర్ గ్రూప్స్ పై కమర్షియల్ టాక్స్ అధికారుల సోదాలు.వాటి అనుబంధ సంస్థలు కార్యాలయాల్లో 11 చోట్ల కొనసాగుతున్న సోదాలు.

‘ఆయ్’… జిఎ2 పిక్చర్స్ ప్రొడక్షన్ నెం.9

0

వరుస విజయవంతమైన చిత్రాలను రూపొందిస్తోన్న నిర్మాణ సంస్థ GA 2 పిక్చర్స్ బ్యానర్‌పై ప్రొడక్షన్ నెం.9 చిత్రం ‘ఆయ్’. త్వరలోనే ఈ మూవీ ప్రేక్షకులను మెప్పించటానికి సిద్ధమవుతోంది. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కంచిపల్లి ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సక్సెస్‌ఫుల్ ప్రొడ్యూసర్ బన్నీవాస్‌తో విద్య కొప్పినీడి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

‘ఆయ్’ సినిమా చిత్రీకరణ పూర్తయ్యింది. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు శరవేగంగా జరుగుతున్నాయి. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌ను వేగవంతం చేసింది. అందులో భాగంగా ఈ హిలేరియస్ ఎంటర్‌టైన్‌మెంట్ టైటిల్‌ను అనౌన్స్ చేశారు. నిర్మాత బన్నీవాస్, హీరో నార్నే నితిన్, హీరోయిన్ నయన్ సారిక, డైరెక్టర్ అంజి కంచిపల్లి మధ్య జరిగే సరదా ఫోన్ సంభాషణతో టైటిల్‌ను వినూత్నంగా ప్రకటించటం విశేషం.

ప్రొడ్యూసర్స్ లో ఒకరైన బన్నీవాస్ దర్శకుడు అంజికి ఫోన్ చేస్తారు. టైటిల్ గురించి మాట్లాడే సందర్భంలో డైరెక్టర్ గోదావరి ప్రాంత ప్రజలు మాట్లాడే ‘ఆయ్’ పదంతో విసిగిపోతారు. అదే క్రమంలో హీరో, హీరోయిన్ లకు సైతం కాల్ కనెక్ట్ చేస్తారు. ఈ సందర్భంగా ‘ఆయ్’ని తప్పుగా టీమ్ అర్థం చేసుకోవటంతో వీడియో చూస్తున్నవారికి నవ్వు తెప్పిస్తుంది.

నిర్మాత సరదా సంభాషణ, ఫన్నీ మీమ్స్ రెఫరెన్స్‌లతో టైటిల్ అనౌన్స్‌మెంట్స్ కాన్సెప్ట్ వీడియో అందరినీ ఎంటర్‌టైన్ చేస్తోంది. ఇదే క్రమంలో నిర్మాత బన్నీ వాస్ మాట్లాడుతూ ‘సమ్మర్‌లో కలుద్దాం’ అంటూ సినిమా సమ్మర్ లో విడుదలవుతుందని తెలియజేశారు. అలాగే సినిమా ఫస్ట్ లుక్ మార్చి 7న రిలీజ్ అవుతుందని వీడియో చివరలో రివీల్ చేశారు.

ఏస్ ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో ఈ ప్రతిష్టాత్మకమైన చిత్రం కోసం అత్యుత్తమమైన నటీనటులు, సాంకేతిక నిపుణులు పని చేశారు. అలాగే సినిమాకు కిరణ్ కుమార్ మన్నె ఆర్ట్ డైరెక్టర్‌గా, సమీర్ కళ్యాణి సినిమాటోగ్రాఫర్‌గా, రామ్ మిర్యాల సంగీత దర్శకుడిగా వర్క్ చేశారు. త్వరలోనే మరిన్ని ఎగ్జయిటింగ్ డీటెయిల్స్ ను చిత్ర యూనిట్ ప్రకటించనుంది.

టెన్‌మినిట్స్‌ఉన్నా టెన్‌ ఇయర్స్‌ గుర్తుండే క్యారెక్టర్‌ చేస్తా-నిహిర్‌ కపూర్‌

0

పాన్ ఇండియా మూవీ రికార్డ్ బ్రేక్ మార్చ్ 8న ప్రేక్షకుల ముందుకు వస్తున్న సందర్భంగా హీరో నిహిర్ కపూర్ మీడియాతో ముచ్చటిస్తూ సినిమా గురించి ఎన్నో విషయాలు తెలియజేశారు. ఈ సందర్భంగా మీడియాని ప్రశ్నలకు సమాధానం ఇస్తూ. నేను ముందు గ్యాంగ్ స్టర్ గంగరాజు సినిమా చేశాను. ఆ సినిమా చేస్తున్న సందర్భంలో చదలవాడ శ్రీనివాసరావు గారు చాలా బాగా చేసావు ఒక కథ ఉంది ఆ కథకు నువ్వు యాప్ట్ అవుతావు అని చెప్పారు. కథ వినగానే చాలా ఎక్సైటింగ్ గా అనిపించి చేస్తానని ఒప్పుకున్నాను. హీరోగా అని కాకుండా క్యారెక్టర్రైజేషన్ చాలా బాగుండడంతో ఈ కథ ఒప్పుకున్నాను.

-ఇద్దరు అనాధలు అడవిలో పెరుగుతూ ఉంటాం. మేము ట్విన్స్. అడవి నుంచి కుస్తీ పోటీలు నేర్చుకుని సిటీకి వచ్చి ఇంటర్నేషనల్ లెవెల్ లో డబ్ల్యూ డబ్ల్యూ ఈ దాకా వెళ్లడం ఆ ప్రయాణాన్ని చాలా బాగా చూపించారు. ఇది కూడా కమర్షియల్ సినిమా నే. దంగల్ తో కంపారిజన్ ఉండదు. అందులో కుస్తీ పోటీలు ఇవన్నీ డీటెయిల్ గా ఉంటాయి. ఇందులో కుస్తీ పోటీల గురించి చెబుతూ ఇద్దరు అనాధల జర్నీ ఇంటర్నేషనల్ లెవెల్ దాకా వెళ్ళింది అలాగే సెంటిమెంట్ ఎమోషనల్ అన్ని కలగలిపిన ఒక కమర్షియల్ సినిమాగా ఉంటుంది. మంచి మదర్ సెంటిమెంట్ సాంగ్స్ ఫైట్స్ అన్ని ఎలిమెంట్స్ సినిమాలో ఉంటాయి.

ఇందులో డబ్ల్యూ డబ్ల్యూ పోటీలు చూపిస్తున్నాము. కుస్తీ పోటీల నుంచి డబ్ల్యు డబ్ల్యు ఈ దాకా జరిగే ట్రాన్స్ఫర్మేషన్ ఎలా ఉంటుంది అనేది మీకు సినిమా చూస్తే అర్థమవుతుంది. రాజస్థాన్ హర్యానా లాంటి ప్రాంతాల్లో కుస్తీ పోటీలు ఎక్కువగా జరుగుతాయి ఆ డీటైలింగ్ మీద నార్త్ వాళ్ళు ఎక్కువ సినిమాలు తీస్తారు. కానీ మన సినిమాలో కుస్తీ పోటీలతో పాటు మిగతా ఎలిమెంట్స్ కూడా ఉంటాయి. ఇది తెలుగు సినిమా అయినా ప్రతి భారతీయుడు చూసి గర్వించదగ్గ సినిమా. ఇలాంటి సినిమా తెలుగుతోనే ఆగిపోకూడదు. అందుకే ఎనిమిది భాషల్లో వరల్డ్ వైడ్ గా సినిమా రిలీజ్ చేస్తున్నాం. రీసెంట్ గా కన్నడ చెన్నై వెళ్లి అక్కడ ప్రమోట్ చేయడం జరిగింది. కన్నడలో రెస్పాన్స్ చాలా బాగా వచ్చింది. ముంబైలో కూడా ఇలాంటి కథలు ఎక్కువగా చూస్తారు అక్కడ కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తోంది. ఇంకా మలయాళం ఒడియాలో కూడా నెక్స్ట్ ప్రమోట్ చేస్తున్నాము.

మార్చి 15న థియేటర్స్ లో ‘రవికుల రఘురామ’

0

పాజిటివ్ వైబ్ ప్రొడక్షన్ బ్యానర్ తెరకెక్కుతున్న లవ్ అండ్ రొమాంటిక్ ఎంటర్టైనర్ చిత్రం ‘రవికుల రఘురామ’. సినిమా నిర్మాణం పట్ల ఎంతో నిబద్ధత ఉన్న శ్రీధర్ వర్మ సాగి నిర్మాణంలో, డైరెక్టర్ చంద్రశేఖర్ కానూరి దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందించబడింది.

యువ హీరో గౌతమ్ సాగి, అందాల భామ దీప్శిఖా జంటగా నటిస్తున్నారు. మంచి వినోదాన్ని అందించే చిత్రం కావాలని నిర్మాత, దర్శకుడు ఎంతో కష్టపడుతున్నారు. డైరెక్టర్ చంద్రశేఖర్ తన సృజనాత్మకత మొత్తం జోడించి ఈ కథకి ప్రాణం పోస్తున్నారు. అలాగే హీరో హీరోయిన్లు కూడా మంచి పెర్ఫామెన్స్ అందించారు.

వీరందరితో పాటు ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా పనిచేస్తున్న సుకుమార్ పమ్మి అద్భుతమైన పాటలు అందిస్తున్నారు. తన సంగీతాన్ని ఈ చిత్రానికి ఒక సోల్ గా మార్చేస్తున్నారు. తాజాగా ఈ చిత్రం నుంచి ‘చందమామే’ అనే బ్యూటిఫుల్ మెలోడీ సాంగ్ ను దర్శకుడు పరశురామ్ విడుదల చేశారు.

ఖర్చుకు ఎక్కడా రాజీ పడకుండా నిర్మాత శ్రీధర్ వర్మ ఈ సినిమాను పాజిటీవ్ వైబ్స్ ప్రొడక్షన్స్ లో నిర్మించారు. యూత్ కు కనెక్ట్ అయ్యే అనేక అంశాలు ఈ సినిమాకు ఉన్నాయి. అలాగే ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఎంజాయ్ చేసే విధంగా సినిమాను తెరకెక్కించారు దర్శకుడు చంద్రకాంత్ కానూరి. అన్ని పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం మార్చి 15న ప్రపంచ వ్యాప్తంగా థియేటర్స్ లో విడుదల కానుంది.

‘పారిజాత పర్వం’ నుంచి ‘రంగ్ రంగ్ రంగీలా’ పాట

0

చైతన్య రావు, సునీల్, శ్రద్ధా దాస్, మాళవిక సతీశన్ ప్రధాన పాత్రలలో వనమాలి క్రియేషన్స్ బ్యానర్ పై సంతోష్ కంభంపాటి దర్శకత్వంలో మహీధర్ రెడ్డి, దేవేష్ నిర్మిస్తున్న హిలేరియస్ క్రైమ్ కామెడీ ఎంటర్ టైనర్ ‘పారిజాత పర్వం’. ఇప్పటికే విడుదలైన ఈ చిత్రం కాన్సప్ట్ టీజర్, ఫస్ట్ సింగిల్ ‘నింగి నుంచి జారే’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది

తాజాగా రంగ్ రంగ్ రంగీలా పాటని విడుదల చేశారు మేకర్స్. కంపోజర్ రీ ఈ పాటని ఫ్యాషినేటింగ్ క్యాచి క్లబ్ నెంబర్ గా కంపోజ్ చేశారు. సరస్వతీ పుత్ర రామజోగయ్య శాస్త్రి
అందించిన సాహిత్యం మరింత ఆకర్షణీయంగా వుంది. ఈ పాటలో నటించిన శ్రద్ధా దాస్ స్వయంగా పాటని పాడటం విశేషం. శ్రద్ధా దాస్ వాయిస్, గ్లామరస్ ప్రజెన్స్ ఈ పాటకు ప్రత్యేక ఆకర్షణ తీసుకొచ్చింది.

బాల సరస్వతి కెమెరామెన్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి రీ సంగీతం అందిస్తున్నారు. శశాంక్ వుప్పుటూరి ఎడిటర్ గా ఉపేందర్ రెడ్డి ఆర్ట్ డైరెక్టర్ గా పని చేస్తున్న ఈ చిత్రానికి అనంత సాయి సహా నిర్మాత.