Saturday, May 18, 2024

మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన ప్రశాంత్

  • మృత్యువుతో పోరాడి ప్రాణాలు వదిలిన ప్రశాంత్
  • ఈ నెల 11న హాస్టల్ లో ఆహారం తిని అస్వస్థత

టీఎస్, న్యూస్ :సాంఘిక సంక్షేమ హాస్టల్లో కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై హైదరాబాదులో చికిత్స పొందుతున్న విద్యార్థి ప్రశాంత్ మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. భువనగిరి పట్టణ కేంద్రంలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ప్రశాంత్ ఆరవ తరగతి చదువుతున్నాడు. ఈ నెల 11న ప్రశాంత్ కలుషిత ఆహారం తిని తీవ్ర అస్వస్థతకు గురై ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్య సేవలను నిమిత్తం హైదరాబాదులోని రెయిన్ బో ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ప్రశాంత్ మంగళవారం సాయంత్రం చనిపోయినట్లు మృతుని మేనమామ సురేష్ తెలిపారు. ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న తమ కొడుకు ప్రశాంత్ కు మెరుగైన వైద్య సేవలు అందించేలా హాస్టల్ నిర్వాహకులు పట్టించుకోలేదని మృతుని బంధువులు ఆరోపిస్తున్నారు.

విద్యాభ్యాసం కోసం వచ్చి కలుషితమైన ఆహార పదార్థాలు తిని విద్యార్థి నిండు ప్రాణాలు బలైన సంఘటన సంఘటన జిల్లాలో కలకలం కలిగించింది. నిరుపేద కుటుంబాలకు చెందిన పేద విద్యారులే గురుకుల పాఠశాలలో విద్యాబోధన నిమిత్తం వస్తే హాస్టల్ నిర్వాహకులు అవలంబించిన నిర్లక్ష్య ధోరణితో కలుషిత
ఆహార పదార్థాలు తిని ప్రశాంత్ లాంటి పేద విద్యార్థులు చనిపోవాల్సిన దుస్థితి నెలకొన్న సంబంధిత అధికారులు నిద్రమత్తులో జోగుతున్నారని ఎమ్మార్పీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి దుబ్బ దానయ్య ఆరోపించారు.

విద్యార్థి ప్రశాంత్ కుటుంబానికి ప్రభుత్వం 10లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లించడంతోపాటు కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం కల్పించాలని ఆయన డిమాండ్ చేశారు.ప్రస్తుతం మృతదేహం హైదరాబాదులోని రెయిన్ బో ఆసుపత్రిలో ఉన్నట్లు ప్రశాంత్ కుటుంబ సభ్యులు తెలిపారు.విద్యాబుద్ధులు నేర్చుకొని తమకు అండగా ఉంటాడని కొండంత ఆశతో ఉన్నత చదువుల నిమిత్తం పాఠశాలకు పంపిస్తే హాస్టల్ నిర్వాహకుల నిర్లక్ష్యంతో తమ కొడుకుని కోల్పోల్సి దుస్థితి నెలకొన్నదని ప్రశాంత్ తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా వినిపిస్తున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular