Sunday, May 11, 2025

Pm Modi: ప్రధాని మోడీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారు

కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్

మార్చి 16నుంచి ఎన్నికల కోడ్ అమల్లోకి వచ్చిందని, నిబంధనల ప్రకారం మసీదులను, దేవాలయాలను ఎన్నికల ప్రచారానికి ఉపయోగించరాదని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు నిరంజన్ పేర్కొన్నారు. అస్సాం సభలో ప్రధాని మోడీ ఎన్నికల కోడ్ ఉల్లంఘించారని ఆయన ఆరోపించారు. అయోధ్య మందిరంలో జరుగుతున్న ఘట్టం గురించి ఎన్నికల మీటింగ్ లో ప్రధాని మోడీ మాట్లాడారని, మోడీ చేసిన వ్యాఖ్యలపై ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేసినట్టు ఆయన తెలిపారు.

Senior Congress leader Niranjan

ఫిబ్రవరి 15వ తేదీన ఫైనల్ ఓటర్ జాబితాను ఎన్నికల కమిషన్ విడుదల చేసిందని అందులో బుధవారం జిహెచ్‌ఎంసిలో 5లక్షల 41వేల ఓట్లు తొలగించడం అశ్చర్యం కలిగించిందన్నారు. ఓటర్ల జాబితా తప్పుల తడకగా మారిందని, ఓటర్ల జాబితాలో గందరగోళం జరిగితే ఎన్నికల కమిషన్ బాధ్యత వహించాల్సి ఉంటుందని ఆయన తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com