Sunday, May 19, 2024

యూరప్‌ ట్రిప్‌లో సమంత

ఫోటోషాప్‌, మార్ఫింగ్ ప‌ర్య‌వ‌సానం న‌టీమ‌ణుల‌ను తీవ్ర‌ ఇబ్బందుల్లోకి నెడుతున్న సంగ‌తి తెలిసిందే. టెక్నాల‌జీ వృద్ధితో ఇది మ‌రింత స‌మ‌స్యాత్మ‌కంగా మారింది. నేడు పాపుల‌ర్ స్టార్ ల‌కు సంబంధించిన అశ్లీల ఫోటోలు, వీడియోలు అంత‌ర్జాలంలో వైర‌ల్ అవుతుంటే అది అభిమానుల్లో ఆగ్ర‌హానికి కార‌ణ‌మ‌వుతోంది. ఏఐ టెక్నాల‌జీ రాక‌తో ఇది మ‌రింత ప‌రాకాష్ట‌కు చేరుకుంద‌న్న ఆందోళ‌న వ్య‌క్త‌మ‌వుతోంది. ఇప్పుడు అందాల స‌మంత రూత్ ప్ర‌భు మార్ఫింగ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని వీక్షించిన అభిమానులు త‌మ కోపాన్ని వ్య‌క్తం చేస్తున్నారు. ఇటీవ‌ల మ‌యోసైటిస్ నుంచి కోలుకున్న స‌మంత త‌న‌కు జ‌రిగిన చికిత్స గురించి ప్ర‌జ‌ల‌ను ఎడ్యుకేట్ చేస్తున్నారు. ఫార్ ఇన్‌ఫ్రారెడ్ సౌనా అనే వైద్య విధానం, అధునాత‌న‌ సాంకేతిక‌త‌తో ఆరోగ్యాన్ని తిరిగి బూస్ట‌ప్ చేయ‌డం ఎలానో సామ్ ఇన్ స్టా మాధ్య‌మంలో వెల్ల‌డించారు.

కండ‌రాల ప‌నితీరు మెరుగ‌వ్వ‌డానికి అవ‌స‌ర‌మైన మెరుగైన చికిత్స ఇది. శ‌రీరంలో కొవ్వును త‌గ్గించి, అన‌వ‌స‌ర కండ‌పుష్టిని క‌రిగించి శ‌రీరాన్ని పున‌రుజ్జీవింపజేసే ప్ర‌క్రియ ఇది. అద‌న‌పు చెమ‌ట‌లు, కీళ్లు, కండ‌రాల నొప్పుల‌ను త‌గ్గిస్తుంది. అయితే ఈ చికిత్సా విధానం గురించి వెల్ల‌డించిన స‌మంత బాత్ ట‌వ‌ల్‌తో ఉన్న ఫోటోను పోస్ట్ చేయ‌గా, దీనికి మార్ఫింగ్ వెర్ష‌న్ ఫోటో అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారింది. ఈ ఫోటోని వీక్షించిన అభిమానులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. సాంకేతిక‌త‌తో త‌లెత్తిన ముప్పు గురించి ఆందోళ‌న వ్య‌క్తం చేస్తున్నారు. దీనిపై ఇంకా స‌మంత‌ స్పందించాల్సి ఉంది. పుట్టిన‌రోజు సంద‌ర్భంగా యూర‌ప్ వెకేషన్ లో ఉన్న స‌మంత త‌దుప‌రి ఇండియాకి తిరిగి రాగానే వ‌రుస షెడ్యూళ్ల‌తో బిజీ కానుంది. సిటాడెల్ ఇండియా వెర్ష‌న్ హనీ బ‌న్నీ ప్ర‌చారంతో పాటు, బంగారం షెడ్యూల్స్ తోను బిజీ అవుతారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular