Tuesday, May 13, 2025

మరిన్ని ప్రత్యేక రైళ్లను ప్రకటించిన దక్షిణ మధ్య రైల్వే

కాచిగూడ -టు కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ -టు కాచిగూడ, నాందేడ్ టు- కాకినాడ టౌన్, కాకినాడ టౌన్ – టు నాందేడ్, హైదరాబాద్ – టు నర్సాపూర్, నర్సాపూర్ – టు హైదరాబాద్, సికింద్రాబాద్ – టు కాకినాడ టౌన్, – కాకినాడ టౌన్ టు సికింద్రాబాద్‌ల ప్రత్యేక రైళ్లను నడిపించనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. కాచిగూడ – టు కాకినాడ టౌన్ (07205) రైలు మే 9న రాత్రి 8.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుందని దక్షిణ మధ్య రైల్వే పేర్కొంది. కాకినాడ టౌన్ -టు కాచిగూడ (07206) రైలు మే 10న సాయంత్రం 5.10 గంటలకు బయలుదేరి మరుసటి రోజు వేకువ జామున 4.50 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.

నాందేడ్ -టు కాకినాడ టౌన్ (07487) రైలు మే 13వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. ఈ రైలు మధ్యాహ్నం 2.25 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.10 గంటలకు కాకినాడ చేరుతుంది. కాకినాడ టౌన్ -టు నాందేడ్ (07488) రైలు సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 3.10 గంటలకు నాందేడ్‌కు చేరుకుంటుంది. హైదరాబాద్ -టు నర్సాపూర్ (07175) మే 11న రాత్రి 11 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.35 గంటలకు నర్సాపూర్‌కు చేరుకుంటుంది. నర్సాపూర్ – టు హైదరాబాద్ (07176) రైలు 13వ తేదీన సాయంత్రం 6 గంటలకు బయలుదేరి ఉదయం 5 గంటలకు గమ్యస్థానం చేరుతుంది.

సికింద్రాబాద్ -టు కాకినాడ టౌన్ (07271) రైలు మే 10న రాత్రి 9.20 గంటలకు బయలుదేరి మరుసటి రోజు 8 ఉదయం గంటలకు గమ్యస్థానంలో ఉంటుంది. కాకినాడ టౌన్ -టు సికింద్రాబాద్ (07272) రైలు 10వ తేదీన ప్రయాణికులకు అందుబాటులో ఉంటుందని, రాత్రి 9 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8.30 గంటలకు సికింద్రాబాద్‌కు చేరుతుందని దక్షిణ మధ్య రైల్వే అధికారులు తెలిపారు.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com