Tuesday, May 13, 2025

సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు

సికింద్రాబాద్ నుంచి బర్హంపూర్‌కు దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లను ప్రకటించింది. సికింద్రాబాద్- టు బర్హంపూర్‌ల మధ్య ప్రత్యేక రైళ్లు ఈ నెల 11, 14వ తేదీల్లో నడుపనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే తెలిపింది. బర్హంపూర్ -టు సికింద్రాబాద్ మధ్య 12, 15 తేదీల్లో ఈ రైళ్లే పరుగులు తీస్తాయని దక్షిణ మధ్య రైల్వే వివరించింది. సికింద్రాబాద్ -టు బర్హంపూర్ రైలు ఆయా రోజుల్లో రాత్రి 8.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు మధ్యాహ్నం 2.45 గంటలకు గమ్యస్థానం చేరుకుంటుంది.

తిరుగు ప్రయాణంలో బర్హంపూర్ నుంచి సాయంత్రం 4.45 గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. ఈ రైళ్లు నల్గొండ, మిర్యాలగూడ, సత్తెనపల్లి, గుంటూరు జంక్షన్, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అన్నవరం, ఎలమంచి, అనకాపల్లి, దువ్వాడ, పెందుర్తి, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి, శ్రీకాకుళం రోడ్డు, నౌపాడ జంక్షన్, పలాస, సోంపేట, ఇచ్చాపురం మీదుగా రాకపోకలు సాగిస్తుందని దక్షిణ మధ్య రైల్వే వివరించింది.

ప్ర‌దాన వార్త‌లు

రాహుల్ గాంధీని విమర్శించే నైతిక అర్హత కేసీఆర్‌కు లేదన్న జగ్గారెడ్డి వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com