Wednesday, May 22, 2024

తెలంగాణపై భానుడు నిప్పులు సూర్యుడి భగభగలకు అల్లాడుతున్న ప్రజలు

తెలంగాణపై భానుడు నిప్పులు చెరుగుతున్నాడు. సూర్యుడి భగభగలకు ప్రజలు అల్లాడిపోతున్నారు. ఒకవైపు అధిక ఉష్ణోగ్రతలు, మరోవైపు వడగాల్పులతో జనం అల్లాడిపోతున్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లాల్లో గరిష్ఠ స్థాయిలో ఉష్ణోగ్రతలు రికార్డయ్యాయి. జగిత్యాల, నల్గొండ జిల్లాల్లో అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. భానుడి ఉగ్రరూపానికి రాష్ట్రం నిప్పుల కొలిమిని తలపిస్తోంది. 8 జిల్లాల్లో 45.5కు పైగా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రాష్ట్రవ్యాప్తంగా అన్నిచోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు 43.2 డిగ్రీలు దాటాయి. తీవ్రమైన వడగాల్పుల ప్రభావానికి జనం ఉక్కిరిబిక్కిరి అయ్యారు.

రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లోనూ ఎండ వేడిమి తీవ్రంగా ఇబ్బందులు పెట్టింది. ఉదయం 9 గంటల నుంచే భానుడు ఉగ్రరూపాన్ని ప్రదర్శిస్తున్నాడు. ఏప్రిల్లోనే ఎండల తీవ్రత ఇలా ఉంటే, మే నెలలో పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ప్రజలు భయపడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు 48 నుంచి 49 వరకు నమోదయ్యే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. రాష్ట్రంలో ఎండలకు తోడు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుంది. రెండు రోజులుగా తీవ్రమైన వడగాల్పులు వీచాయి. మరో 5 రోజుల పాటు వడగాల్పుల తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది. పలు జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ చేసింది.

నేడు, రేపు పలు జిల్లాలో వడగాల్పులు
బుధ, గురువారాల్లో నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, ములుగు, ఖమ్మం, నల్గొండ, సూర్యపేట, మహబూబ్బాద్, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని తెలిపింది. మే 3వ తేదీన నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, జయశంకర్ భూపాలపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో వడగాల్పులు వీస్తాయని పేర్కొంది.

4వ తేదీన ఆదిలాబాద్, కుమురం భీం
మే 4వ తేదీన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్ధపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో వడగాల్పులు వీచే అవకాశం ఉన్నట్లు తెలిపింది. 5వ తేదీన ఆదిలాబాద్, కుమురం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, జగిత్యాల, రాజన్న సిరిసిల్ల, కరీంనగర్, పెద్దపల్లి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హనుమకొండ, సిద్దిపేట, మెదక్, కామారెడ్డి, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్ జిల్లాల్లో అక్కడక్కడ వీచే అవకాశం ఉన్నట్లు వెల్లడించింది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular