Friday, May 16, 2025

మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు

  • మే 13, జూన్ 4న వేతనంతో కూడిన సెలవులు
  • రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు

    టీఎస్ న్యూస్ :లోక్ సభ ఎన్నికల దృష్ట్యా మే 13న ప్రభుత్వ ఉద్యోగులకు వేతనంతో కూడిన సెలవును రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. అలాగే ఎన్నికల ఫలితాల తేదీ అయిన జూన్ 4న వేతనంతో కూడిన సెలవును కూడా మంజూరు చేసింది. ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ వేతనంతో కూడిన సెలవులను అమలు చేయాలని జిల్లా కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఆదేశించారు. ఇప్పటికే ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలకు ఎన్నికల అధికారులు సెలవులు ఇచ్చారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు మే 13 న ఒకే దశలో జరుగుతాయి. మొత్తం ఏడు దశల్లోని ఓట్ల లెక్కింపు జూన్ 4న జరుగుతుంది. మల్కాజిగిరి లోక్‌సభ స్థానంలో భాగమైన కంటోన్మెంట్ అసెంబ్లీ నియోజకవర్గంలోని ఓటర్లకు మే 13న రెండుసార్లు పోలింగ్ జరగనుంది. ఇందులో ఒకటి ఎంపీ, రెండోది ఎమ్మెల్యే ఓటు వేయాల్సి ఉంటుంది.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com