కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్ మోహన్ రావు, జితేందర్ రెడ్డిలకు సైతం ప్రాధాన్యం
లోక్‌సభ ఎన్నికల్లో మెజార్టీ సీట్లు గెలుపే లక్ష్యంగా దూసుకుపోతున్న కాంగ్రెస్ మరో కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోని 17 ఎంపీ సీట్లు గెలిచి తీరాల్సిందేనని ఇప్పటికే అన్ని పార్లమెంట్ స్థానాలకు మంత్రులు, ఇతర కీలక నేతలను ఇన్‌చార్జులుగా నియమించిన కాంగ్రెస్ పార్టీ తాజాగా ఐదు లోక్‌సభ నియోజకవర్గాలకు కో -ఇన్‌చార్జీలను నియమించింది.
మహబూబ్ నగర్-కు జితేందర్ రెడ్డి, జహీరాబాద్‌కు -మధన్ మోహన్ రావు, మెదక్-కు జగ్గారెడ్డి, వరంగల్-కు శ్రీధర్ బాబు, చేవెళ్ల-కు రామ్మోహన్‌రెడ్డిలను కో- ఇన్‌చార్జీలుగా ఏఐసిసి నియమించింది. ఈ మేరకు ఏఐసిసి జనరల్ సెక్రటరీ కెసి వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. కాగా, ఇటీవల కాంగ్రెస్ పార్టీలో చేరిన మదన్ మోహన్ రావు, జితేందర్ రెడ్డిలకు పార్లమెంట్ ఎన్నికల్లో హస్తం పార్టీ కీలక బాధ్యతలు అప్పగించడం గమనార్హం విశేషం.