Saturday, May 18, 2024

బిజెపి ఎందుకు కులగనణ మాట ఎత్తడం లేదు

  • దేశంలో ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదు
  • ఎమ్మెల్సీ, మహేష్ కుమార్ గౌడ్

కులగణన చేస్తామని బహిరంగంగా ప్రకటించిన వ్యక్తి రాహుల్ గాంధీ అని, బిజెపి ఎందుకు కులగనణ మాట ఎత్తడం లేదని ఎమ్మెల్సీ, మహేష్ కుమార్ గౌడ్ ప్రశ్నించారు. శనివారం గాంధీభవన్‌లో జరిగిన రాజ్యాంగ రక్షణ దీక్షలో భాగంగా ఆయన మాట్లాడుతూ కులగణన ఆధారంగా రిజర్వేషన్ అమలు చేస్తామని రాహుల్ గాంధీ చెప్పారన్నారు. దేశంలో ఇంకా అసమానతలు పూర్తిగా తొలగిపోలేదని, అసమానతలు పూర్తిగా తొలగాలంటే ఇంకా రిజర్వేషన్లు అమలు చేయాల్సిన అవసరం ఉందని, దానికి కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉండాలన్నారు. ఈసారి ఎన్నికల్లో బిజెపిని తరిమికొట్టి కాంగ్రెస్‌కు అధికారం అప్పగించాల్సిన బాధ్యత దళితులపై ఉందన్నారు.

దళితులను బిజెపి మోసం చేస్తోంది: మధుయాష్కీ
రోహిత్ దళితుడే కాదని బిజెపి నేతలు దళితులను మోసం చేస్తున్నారని పిసిసి ప్రచార కమిటీ చైర్మన్, మధుయాష్కీ ఆరోపించారు. మనకులాల గురించి మనమే ఆలోచన చేయాలన్నారు. సిరిసిల్లలో ఏమైంది, నేరెళ్ల ఘటనకు కారకులు ఎవరని ఆయన ప్రశ్నించారు. ఎలక్షన్ నోటిఫికేషన్ వచ్చాకే పోలీసులు ఆ కేసును క్లోజ్ చేశారని ఆయన పేర్కొన్నారు. కేంద్ర ఎన్నికల సంఘం చేతుల్లోనే అధికారం ఉందని, రోహిత్ దళితుడు కాదని పోలీసులు కుల సర్టిఫికేషన్ ఎలా ఇస్తారని ఆయన ప్రశ్నించారు. శ్రీకాంతాచారి తల్లిని కూడా కెసిఆర్ అవమానించారన్నారు. దేశంలోని ఎస్సీ, ఎస్టీ, ఓబిసిలు సంఘటితం కావాలన్నారు.

రాజ్యాంగాన్ని బిజెపి ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తోంది: విహెచ్
కాంగ్రెస్ సీనియర్ నాయకులు వి.హనుమంతరావు మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ అప్పట్లో రాజ్యాంగాన్ని రాయాలని సమర్థులైన అంబేద్కర్‌కు బాధ్యత అప్పగించిందన్నారు. అలాంటి రాజ్యాంగాన్ని ఇప్పుడు బిజెపి ప్రభుత్వం పక్కన పెట్టాలని చూస్తోందన్నారు. టిఆర్‌ఎస్ హయాంలో పంజాగుట్ట చౌరస్తాలో రాజశేఖర్ విగ్రహం పక్కన అంబేద్కర్ విగ్రహాన్ని కాంగ్రెస్ పెడితే దానిని తొలగించారన్నారు. మళ్లీ సొంత ఖర్చులతో ఏడు లక్షలు ఖర్చు చేసే అంబేద్కర్ విగ్రహాన్ని తయారు చేయించామన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular