Friday, May 23, 2025

విజయ్‌దేవరకొండ, రాహుల్‌సంకృత్యన్‌ కాంబోలో ఎనౌన్స్‌మెంట్‌

హీరో విజయ్ దేవరకొండ, డైరెక్టర్ రాహుల్ సంకృత్యన్, ప్రెస్టీజియస్ బ్యానర్ మైత్రీ మూవీ మేకర్స్ కాంబోలో క్రేజీ ప్రాజెక్ట్ వీడీ 14 అనౌన్స్ అయ్యింది. ఇవాళ విజయ్ దేవరకొండ పుట్టినరోజు సందర్భంగా ఈ ప్రాజెక్ట్ ను ప్రకటించారు. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కనుంది. నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు. వీడీ 14 అనౌన్స్ మెంట్ సందర్భంగా విడుదల చేసిన కాన్సెప్ట్ పోస్టర్ ఆసక్తి కలిగిస్తోంది.
బీటలు వారిన పంట పొలాల్లో రాతిపై చెక్కిన వీరుడి విగ్రహం ఉంది. దాని మీద ది లెజెండ్ ఆఫ్ ది కర్స్డ్ ల్యాండ్ అని రాసి ఉంది. ఆయన జీవిత కాలం 1854 నుంచి 1878గా పేర్కొన్నారు. 19వ సెంచరీ నేపథ్యంతో 1854 నుంచి 1978 మధ్య కాలంలో జరిగిన యదార్థ చారిత్రక సంఘటనల ఆధారంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ గా ఈ సినిమాను రూపొందిస్తున్నారు. ‘డియర్ కామ్రేడ్’, ‘ఖుషి’ వంటి సక్సెస్ ఫుల్ సినిమాల తర్వాత మైత్రీ మూవీ మేకర్స్, విజయ్ కలిసి చేస్తున్న మూడో చిత్రమిది. ‘టాక్సీవాలా’ లాంటి సూపర్ హిట్ తర్వాత విజయ్ దేవరకొండ, రాహుల్ సంకృత్యన్ ఈ సినిమాతో మరోసారి కలిసి పనిచేస్తున్నారు.

ప్ర‌దాన వార్త‌లు

కాంగ్రెస్ ప్రభుత్వ విధానాలపై బీఆర్ఎస్ నేత హరీశ్ రావు తీవ్ర వ్యాఖ్యలను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com