Sunday, May 19, 2024

మళ్లీ మన సర్కారే

  • మళ్లీ మన సర్కారే
  • ఎన్నికలు ఎప్పుడు వచ్చినా మాదే అధికారం
  • మాజీ సీఎం కేసీఆర్​

రాష్ట్రంలో కాంగ్రెస్ పాలన చివరి దాకా ఉండేలా లేదని, మధ్యలోనే ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్​అన్నారు. కరీంనగర్‌లో ఆదివారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. జిల్లాలో ఏర్పాటు చేసిన కార్నర్ మీటింగ్‌లో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై కేసీఆర్ తీవ్ర విమర్శలు గుప్పించారు. ఎన్నికలు ఎప్పుడొచ్చినా మళ్లీ మన సర్కారే వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నీళ్లిచ్చినం, కరెంట్ ఇచ్చినం, రైతు బంధు ఇచ్చినం, పంట కొన్నామని తెలిపారు. తెలంగాణలో హుజురాబాద్ దళితులు ఆత్మ గౌరవంతో ఉన్నారని ఉద్ఘాటించారు. మొన్నటి అసెంబ్లీ ఎన్నికల్లో రేవంత్‌రెడ్డి మాయ మాటలు నమ్మారని అన్నారు. రాజకీయాల్లో గెలుపు, ఓటములు సమస్య కాదని అన్నారు. కాంగ్రెస్ పాలనలో రూ. వెయ్యి కోట్ల కంపెనీ మద్రాస్ పోయిందని మండిపడ్డారు. నాలుగైదు నెలల్లోనే రేవంత్ ప్రభుత్వంపై ప్రజా వ్యతిరేకత వచ్చిందని అన్నారు. తమ హయాంలో పోని కరెంట్.. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎందుకు ఉండట్లేదో ఆలోచించాలని చెప్పారు. గోదావరి నీళ్లు పోతే… తెలంగాణకు బతుకే లేదని కేసీఆర్ అన్నారు. ప్రధాని మోదీ నీళ్లను పక్క రాష్ట్రాలకు తీసుకెళ్తానంటే.. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఎందుకు ప్రశ్నించట్లేదని అన్నారు. కరీంనగర్‌ను బండి సంజయ్ ఏం అభివృద్ధి చేశారని ప్రశ్నించారు. ఆయన ఎంపీ అయ్యాక జిల్లాకు ఏం ఓరగలేదని విరుచుకుపడ్డారు. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ అభ్యర్థులకు బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని కేసీఆర్ కోరారు.

రైతుబంధు ఎప్పుడిస్తారు

రైతుబంధు సాయం విషయంలో సీఎం రేవంత్‌పై కేసీఆర్​మరోసారి ప్రశ్నలు సంధించారు. రైతులు నాట్లు వేసే సమయంలో రైతుబంధు ఇస్తారా..? పంట చేతికి వచ్చి ధాన్యం తూకం వేసే సమయంలో ఇస్తారా? అంటూ ధ్వజమెత్తారు. తెలంగాణ మళ్లీ మర్లవడ్డదని తెలిసిపోయిందని, రైతుబంధు 9వ తారీఖు వరకు వేస్తా అని సీఎం అంటున్నాడని, పంటలు చేతికి వచ్చి జోకుతున్నరని, నాటేటప్పుడు ఇస్తరా ? జోకేటప్పుడు ఇస్తరా? అని విమర్శించారు.

పరిశ్రమలో పోతున్నయ్‌..

జాతీయ స్థాయిలో, అంతర్జాతీయ స్థాయిలో కష్టపడి రాష్ట్రం గౌరవం పెంచామని, ఐటీ, పరిశ్రమల రంగంలో బ్రహ్మాండంగా తెలంగాణకు పెట్టుబడులు వస్తుండేనని మాజీ సీఎం కేసీఆర్​ అన్నారు. నరేంద్ర మోదీ కూడా అసూయపడేంత పెట్టుబడులు వచ్చాయని, కానీ, ఇవాళ రూ.1000కోట్ల పెట్టుబడి పెట్టే కంపెనీ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లిపోయిందని, అల్యూమినియం, ప్లాస్టిక్‌ ఇండస్ట్రీకి ప్రభుత్వం కరెంటు కోతలు పెడుతున్నదని మండిపడ్డారు. తెలంగాణలో లాభంలో లేదు వెళ్లిపోవాలనుకుంటున్నారని పరిశ్రమల యాజమాన్యాలు అనుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular