Monday, May 20, 2024

భర్త కాళ్లు, చేతులు కట్టేసి..ఒంటిపై సిగరెట్లతో వాత‌లు

“నా భార్య మత్తు పదార్థాలు తీసుకుని నన్ను హింసిస్తోంది. సిగరెట్లతో రోజూ వాతలు పెడుతోంది. నా భార్య నుంచి నన్ను రక్షించండి మహాప్రభో!” అంటూ ఓ వ్యక్తి తన భార్యపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఏదో చిన్న కేసే అనుకొని పోలీసులు లైట్గా తీసుకున్నారు. ఓ రోజు వీడియో ఆధారాలతో పోలీస్ స్టేషన్కు వచ్చాడు ఆ బాధితుడు. తీరా ఆ వీడియోల్లో ఆమె టార్చర్ చూశాక.. పోలీసులే ముక్కున వేలేసుకున్నారు. భర్త ఫిర్యాదు మేరకు ఆమెను అదుపులోకి తీసుకున్నారు.

ఉత్తరప్రదేశ్లోని బిజ్నోర్ జిల్లాకు చెందిన మనన్ జైదీకి.. మెహర్ జహాన్తో వివాహమైంది. మత్తు పదార్థాలకు బానిససైన మెహర్.. భర్తను నిత్యం హింసిస్తుండేది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడంతో… భార్య దారుణాలను తెలియజెప్పేందుకు ఆ భర్త ఇంట్లోనే ఆమెకు తెలియకుండా సీసీ కెమెరాలు అమర్చాడు. అనుకున్నట్లుగానే మత్తు పదార్థాలు తీసుకున్న ఆమె.. రోజూలానే అర్ధరాత్రి అతడి కాళ్లూ, చేతు కట్టేసింది. సిగరెట్ తాగుతూ ఒంటిపై వాతలు పెట్టింది . మర్మాంగం పైనా చురకలు పెట్టింది.

ఉదయాన్నే వీడియో ఆధారాలతో పోలీస్ స్టేషన్కు వెళ్లాడు. ఇలానే రోజూ తనపై దాడి చేస్తోందంటూ జరుగుతున్న దారుణాలను వివరించాడు. దీంతో భర్త ఫిర్యాదు మేరకు మెహర్ను పోలీసులు అరెస్ట్ చేశారు. ఐపీసీలోని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తదుపరి చర్యలు తీసుకుంటామని బిజ్నోర్ జిల్లా అదనపు ఎస్పీ మీడియాకు వెల్లడించారు. సంబంధిత వీడియోలు ప్రస్తుతం సోషల్మీడియాలో వైరల్ గా మారాయి.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular