Thursday, April 3, 2025

బీజేపీ అభ్యర్ధిని హగ్ చేసుకున్న ఏఎస్ఐ సస్పెన్షన్​ వేటు వేసిన సీపీ

టీఎస్​, న్యూస్​: ఎన్నికల కోడ్ అమల్లో ఉందనే విషయాన్ని విస్మరించి హైదరాబాద్ బీజేపీ అభ్యర్ధిని మాధవీలతను ఆలింగనం (హగ్) చేసుకున్న సైదాబాద్ ఏఎస్ఐ ఉమాదేవిపై సస్పెన్షన్ వేటు పడింది.

బీజేపీ అభ్యర్ధి మాధవీలత ఎన్నికల ప్రచారం చేస్తున్న సమయంలో ఏఎస్ఐ ఉమాదేవి ఆమెను ఆలింగనం చేసుకున్నారు. దీంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై విచారణకు నగర సీపీ కొత్తకోట శ్రీనివాస్ రెడ్డి ఆదేశించారు. విచారణలో ఎన్నికల కోడ్ ను ఏఎస్ఐ ఉమాదేవి ఉల్లంఘించారని నిర్ధారణ కావడంతో ఆమెను సస్పెండ్ చేస్తూ సీపీ ఉత్తర్వులను జారీ చేశారు.

ప్ర‌దాన వార్త‌లు

కేటీఆర్‌కు రాజకీయ ఓనమాలు తెలియవు.. అన్న కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి వ్యాఖ్య లను మీరు సమర్థిస్తారా..?
- Advertisment -

Most Popular

WP Tumblr Auto Publish Powered By : XYZScripts.com