Tuesday, May 21, 2024

ఢిల్లీలో 12 విద్యా సంస్థలకు బాంబు బెదిరింపు

ఢిల్లీ లోని పలు పాఠశాల లకు బాంబు బెదిరింపులు రావడం కలకలం రేపుతోంది. ఇప్పటి వరకు 12 పాఠశాల లకు బాంబు బెదిరింపులు వచ్చినట్లు తెలిసింది.

స్కూళ్లలో బాంబులు పెట్టినట్లు ఈ మెయిల్ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు బెదిరించారు. బాంబు బెదిరింపులు ఎదుర్కొన్న స్కూళ్లలో మయూర్ విహార్‌ లోని మదర్ మేరీ స్కూల్, ద్వారక లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్, చాణిక్య పురి లోని సంస్కృతి స్కూల్, అమిటి సాకేత్ స్కూల్, నోయిడా లోని ఢిల్లీ పబ్లిక్ స్కూల్ ఉన్నాయి.

స్కూళ్లను ఖాళీ చేయించి తనిఖీలు చేసిన బాంబ్ స్క్వార్డ్స్, పోలీసులు విదేశాల నుంచి వీపీఎన్ మోడ్‌లో బాంబు బెదిరింపు మెయిల్స్ వచ్చినట్లు పోలీసులు గుర్తించారు.

వరుసగా బాంబు బెదిరింపులు రావడంతో దీనిపై అప్రమత్తమైన పోలీసులు దర్యా ప్తు చేస్తున్నారు. కాగా, దేశంలో ఎన్నికల వేళ రెండు రోజుల క్రితం భారత్‌ లోని ప్రధాన విమానాశ్రయాలకు బాంబు బెదిరింపులు వచ్చిన విషయం తెలిసిందే..

ఇందుకు సంబంధించిన ఈ-మెయిల్స్ కలకలం రేపాయి. ఇప్పుడు స్కూళ్లకు కూడా అదే రీతిలో బెదిరింపులు రావడం గమనార్హం..

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

ఎన్నికల కోడ్ ముగియగానే జిల్లాల పునర్విభజన సరైనదేనా..?

Most Popular