Sunday, May 19, 2024

ఎన్నికల ప్రచారంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బిజీ

  • కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలు
  • ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించిన పిసిసి

అధికార కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మెజార్టీ పార్లమెంట్ స్థానాల్లో గెలుపే లక్ష్యంగా, ఎన్నికల ప్రచారంపై మరింత దృష్టిసారించింది. రాష్ట్రంలో ఎన్నికల పోలింగ్ సమయం దగ్గరపడుతుండటంతో కాంగ్రెస్ కీలక నేతలందరూ ఓటర్లను ఆకర్షించే పనిలో పడ్డారు. ఈ నేపథ్యంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. ఈ మేరకు ఆయన షెడ్యూలను పిసిసి ప్రకటించింది. ఈనెల 10వ తేదీ వరకు కాంగ్రెస్ అభ్యర్థులకు మద్ధతుగా సభలు, రోడ్ షోలలో ఆయన పాల్గొంటారు. ఇప్పటికే రాహుల్‌గాంధీ రాష్ట్రంలో పర్యటిస్తుండగా త్వరలోనే ప్రియాంకతో పాటు మల్లికార్జున ఖర్గేలు రాష్ట్రంలో పర్యటించనుండగా వారితో పాటు సిఎం రేవంత్ రెడ్డి కూడా సభల్లో పాల్గొననున్నారు.

నేడు సాయంత్రం ఇబ్రహీంపట్నం రోడ్ షో
ఈ నెల 6వ తేదీన సాయంత్రం 6 గంటలకు ఇబ్రహీంపట్నం రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ రెడ్డి పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం రాత్రి 7.30 గంటలకు ఉప్పల్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొంటారు. రాత్రి 9 గంటలకు సికింద్రాబాద్ కంటోన్మెంట్ కార్నర్ సమావేశంలో పాల్గొని ప్రచారం చేస్తారు. ఈ నెల 7వ తేదీన ఉదయం 11 గంటలకు నర్సాపూర్ జనజాతర సభలో సిఎం పాల్గొని నీలం మధుకు మద్దతుగా ప్రచారం చేస్తారు. సాయంత్రం 6.30 గంటలకు వరంగల్ ఈస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్ లలో పాల్గొని కడియం కావ్యకు మద్దతుగా ప్రచారం చేస్తారు. వెంటనే రాత్రి 7.45 గంటలకు వరంగల్ వెస్ట్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో సిఎం రేవంత్ పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ నెల 8వ తేదీన సాయంత్రం 5 గంటలకు ఆర్మూర్ కార్నర్ మీటింగ్‌లో సిఎం పాల్గొంటారు. ఆ తర్వాత రాత్రి 7 గంటలకు నిజామాబాద్ రోడ్ షో, కార్నర్ మీటింగ్‌లో పాల్గొని జీవన్ రెడ్డికి మద్ధతుగా ప్రచారం చేస్తారు. ఈ నెల 9వ తేదీన రాహుల్ గాంధీ, 10వ తేదీన ప్రియాంక గాంధీలు రాష్ట్రంలో పర్యటించనుండగా వారితో పాటు సిఎం రేవంత్ కూడా పాల్గొననున్నారు. ఈ నెల 9వ తేదీన ఉదయం 11 గంటలకు కరీంనగర్ జనజాతర సభ, సాయంత్రం 6 గంటలకు ఎల్బీనగర్, సరూర్ నగర్ స్టేడియంలో జన జాతర సభల్లో రాహుల్ గాంధీ పాల్గొని ప్రసంగిస్తారు. ఈ నెల 10వ తేదీన మధ్యాహ్నం 12 గంటలకు కామారెడ్డి జన జాతర సభ, సాయంత్రం 4 గంటలకు తాండూరు జన జాతర సభలలో ప్రియాంక గాంధీ పాల్గొని ప్రచారం చేస్తారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular