Saturday, April 27, 2024

తిరుమల అలిపిరి నడక మార్గంలో మరోసారి చిరుత కలకలం

  • ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచారం
  • ట్రాప్ కెమెరాల్లో రికార్డయిన దృశ్యాలు
  • భక్తులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించిన అధికారులు

టిఎస్‌న్యూస్‌ః కలియుగ దైవం శ్రీవేంకటేశ్వర స్వామివారు వెలిసిన తిరుమల శేషాచలం అడవుల్లో చిరుతలు, ఇతర వణ్య ప్రాణుల సంఖ్య భారీగా పెరిగింది. ఈ ఏడాది ఆగస్టులో చిరుతల సంచారం శ్రీవారి భక్తులను భయాందోళనలకు గురి చేసింది. 48 గంటల వ్యవధిలో అలిపిరి పరిసర ప్రాంతాల్లో చిరుతలు కనిపించాయి. టీటీడీ అటవీ శాఖ అధికారులు సీసీటీవీ కెమెరాల ద్వారా వాటి సంచారాన్ని గుర్తించారు. అలిపిరి నుంచి గాలిగోపురం, శ్రీలక్ష్మీ నరసింహస్వామి ఆలయం, 38వ మలుపు ప్రాంతాలతో పాటు మొత్తం అయిదు చోట్ల చిరుతల సంచారాన్ని గుర్తించారు. వాటి కదలికలను పసిగట్టడానికి అలిపిరి మార్గంలో గాలి గోపురం నుంచి లక్ష్మీ నరసింహస్వామి ఆలయం వరకు సుమారు 500 సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు.

గతంలోనూ చిరుతల సంచారం..
తిరుమల నడక మార్గంలో ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు వెళుతుంటారు. తిరుమలలో ఇటీవల కాలంలో తరచూ చిరుతలు యాత్రికులను భయపెడుతున్నాయి. గతంలో ఓ బాలుడిపై దాడి చేయడం, ఆతర్వాత మరో చిన్నారిని చంపేయడంతో భక్తులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు. టీటీడీ, ఫారెస్ట్‌ అధికారులు ఉమ్మడిగా ఆపరేషన్‌ చేపట్టారు. ఇప్పటికి నాలుగైదు చిరుతల్ని కూడా పట్టి వేశారు. దారిపొడవునా బోన్లను కూడా ఏర్పాటు చేశారు. మళ్లీ ఇప్పుడు నడక మార్గంలో మళ్లీ చిరుత సంచారం కలకలం రేపింది.

మరోసారి కలకలం..
తాజాగా మరోసారి తిరుమల నడక మార్గంలో చిరుత కలకలం చెలరేగింది. అలిపిరి నడక మార్గంలో చిరుత సంచరిస్తున్న దృశ్యాలు ట్రాప్ కెమెరాల్లో రికార్డయ్యాయి. ఈ నెల 25, 26 తేదీల్లో చిరుత సంచరించింది. నడక మార్గానికి 150 మీటర్ల దూరంలో చిరుత సంచరించినట్టు అధికారులు గుర్తించారు. మరోవైపు రాత్రి సమయంలో భక్తులను గుంపులు గుంపులుగా మాత్రమే అధికారులు అనుమతిస్తున్నారు. కర్రలు, సెక్యూరిటీ సిబ్బంది రక్షణలో భక్తులను పంపుతున్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 వరకు మాత్రమే అలిపిరి మార్గంలో భక్తులను అనుమతిస్తున్నట్టు టీటీడీ అధికారులు తెలిపారు. రాత్రి వేళల్లో భక్తులు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరించారు.

మెట్ల మార్గంలో…
మెట్ల మార్గంలో మరోసారి చిరుత సంచారం కలకలం రేపింది. అలిపిరి మెట్ల మార్గం మీదుగా కాలి నడకన తిరుమలకు బయలుదేరి వెళ్లిన భక్తులకు నరసింహ స్వామి ఆలయ పరిసరాల్లో చిరుత కనిపించింది. దీనితో ఒక్కసారిగా వారు భయాందోళనలకు గురయ్యారు. టీటీడీకి సమాచారం ఇచ్చారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular