Sunday, May 19, 2024

ఎండ వేడికి చిరుత మృతి

నారాయణపేట జిల్లా మద్దూరు మండలం జాదవరావుపల్లిలో చిరుతపులి మృతి చెందిన ఘటన వెలుగుచూసింది. అటవీశాఖ అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. మద్దూరులోని కాలిపోయిన వరి పొలాల్లో చిరుతపులి చనిపోయి కనిపించింది. వృక్ష సంపద అంతరిస్తుండటంతో వన్యప్రాణులు తలదాచకునేందుకు నిలువు నీడ లేకుండా పోతున్నదని వెల్లడించారు. దీంతో జంతువుల మనుగడ పెను సవాలుగా మారిందని నారాయణపేట డీఎఫ్‌వో వీణా వాణి ఆవేదన వ్యక్తం చేశారు. మద్దూరు రెవెన్యూ భూమిలో కనీసం నాలుగు చిరుతలు ఉంటాయని, ఇవి నివసించే గుట్టల్లో చెట్లు లేకపోవడంతో వేడిగాలులతో విపరీతంగా ఇబ్బందులు పడుతున్నాయని తెలిపారు. ఈ క్రమంలోనే వేడి తట్టుకోలేక చిరుతపులి మృతి చెందిందని డీఎఫ్‌వో తెలిపారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular