Wednesday, May 1, 2024

అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తాం

  • జర్నలిస్టుల కోసం అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తాం
  • రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి హామీ

జర్నలిస్టుల కోసం అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తామని రోడ్లు, భవనాల, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. సోమవారం సోమాజీగూడ ప్రెస్ క్లబ్‌లో జరిగిన ఇఫ్తార్ విందులో మంత్రి కోమటిరెడ్డి పాల్గొని ముస్లిం సోదరులకు ముందస్తు రంజాన్ శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం జర్నలిస్ట్‌లతో కలిసి మంత్రి క్లబ్‌ను పరిశీలించారు. దశాబ్ద కాలంగా ప్రెస్ క్లబ్ లో పెండింగ్ లో ఉన్న ప్రెస్ క్లబ్ భవన్ నిర్మాణం గురించి జర్నలిస్ట్‌లు మంత్రి దృష్టికి తీసుకురాగా మంత్రి కోమటిరెడ్డి వెంటనే స్పందించారు. క్లబ్ కార్యవర్గంతో చర్చించి ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ముఖ్యమంత్రితో సమావేశం నిర్వహించి జీ +4 గా ప్రెస్ క్లబ్ భవన నిర్మాణానికి కావాల్సిన బడ్జెట్ ను మంజూరు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

ఆనాడు కాంగ్రెస్ ప్రభుత్వంలోనే ప్రెస్ క్లబ్ ఏర్పాటు చేశామని, మళ్లీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే అద్భుతమైన ప్రెస్ క్లబ్ భవనాన్ని నిర్మిస్తామన్నారు. మహిళా జర్నలిస్ట్‌ల కోసం ప్రెస్‌క్లబ్ ఆవరణలో నిర్మిస్తున్న భవనానికి కొన్ని సౌకర్యాలు కల్పించాలని మహిళా జర్నలిస్టులు కోరగా తన ప్రతీక్ ఫౌండేషన్ నుంచి రూ. 5 లక్షలను ఇస్తున్నట్టు మంత్రి కోమటిరెడ్డి ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వేణుగోపాల్ నాయుడు, రవి కాంత్ రెడ్డి, మాజీ అధ్యక్షుడు విజయ్ కుమార్ రెడ్డి, ట్రెజరర్ రాజేష్, జాయింట్ సెక్రటరీ హరి ప్రసాద్, ఈసీ మెంబర్లు వనజ, శ్రీను, సీనియర్ పాత్రికేయులు యూసుఫ్ బాబా, ఆజం ఖాన్ తదితరులు హాజరయ్యారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular