Sunday, May 5, 2024

Phone Tapping Case: వసూలు చేసి ఎవరికిచ్చారు.. ఫోన్​ ట్యాపింగ్​ కేసులో వసూళ్ల దందా

టీఎస్​, న్యూస్: ఫోన్​ ట్యాపింగ్​నిందుతులు.. పలువురు వ్యాపారులు, కొంతమంది హవాలా, రియల్టర్ల నుంచి వసూలు చేసిన సొమ్ము ఎక్కడకు వెళ్లింది, ఎవరు తీసుకెళ్లారు, ఎవరెవరికి ఇచ్చారనే కోణంలో సిట్​ బృందం వివరాలు సేకరిస్తున్నది. స్పెషల్ ఇంటెలిజెన్స్ బ్రాంచి (ఎస్ఐబీ)లో ఆధారాల ధ్వంసం ఘటనతో మొదలై ఫోన్ ట్యాపింగ్ ఉదంతాన్ని వెలుగులోకి తెచ్చిన కేసు ఇప్పటికీ మలుపులు తిరుగుతూనే ఉంది.

ఈ కేసులో ఇప్పటికే నలుగురు పోలీసు అధికారులు Judicial Custody జ్యుడిషియల్ కస్టడీలో ఉండగా.. తాజాగా రిటైర్డ్​ఎస్పీ దివ్యచరణ్ రావును పోలీసులు విచారించడం ప్రాధాన్యం సంతరించుకొంది. దర్యాప్తు క్రమంలో టాస్క్ ఫోర్స్ వాహనాల్లో దొంగచాటుగా సొమ్ము తరలింపు అంశం తెరపైకి వచ్చిన సంగతి తెలిసిందే. ఆ వ్యవహారాలకు సంబంధించి ఆయన్ను విచారించారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడు, టాస్క్ ఫోర్స్ మాజీ ఓఎస్టీ రాధాకిషన్రావు సూచనలతో టాస్క్ ఫోర్స్ ఎస్సై ఒకరు రెండుసార్లు రూ.కోటి చొప్పున తీసుకొచ్చి సికింద్రాబాద్, మలక్​పేటల్లోని ప్రముఖ ఆసుపత్రుల్లో దివ్యచరణావుకు అప్పగించినట్లు దర్యాప్తులో వెల్లడైంది.

సదరు ఎస్సై సాక్షిగా ఇచ్చిన వాంగ్మూలాన్ని ఆధారంగా చేసుకొని తాజాగా దివ్యచరణవును విచారించారు. మూడుసార్లు ఆయన్ను పిలిచి వివరాలు రాబట్టినట్లు తెలిసింది. ఎస్సైని రాణిగంజ్, అఫ్జల్​గంజ్​కు పంపి ఎవరి వద్ద నుంచి డబ్బులు తెప్పించుకున్నారు..? ఆ తెచ్చిన సొమ్మును మళ్లీ ఎక్కడికి పంపించారు..? అందుకు ఆదేశాలిచ్చింది ఎవరు..? అనే కోణంలో ఆరా తీస్తున్నారు. అయితే, ఈ వ్యవహారమంతా గతేడాది అక్టోబరులో జరిగినందున శాసనసభ ఎన్నికల్లో ఎవరైనా అభ్యర్థులకు సమకూర్చారా..?

అని ప్రశ్నిస్తున్నట్లు సమాచారం. అసలు రాధాకిషన్​రావు.. ఈ వసూళ్ల పర్వంలో దివ్యచరణ్​ రావును ఎందుకు ఎంచుకున్నారనే కోణంలోనూ ఆరా తీసినట్లు తెలిసింది. అయితే, దివ్య చరణ్​రావు నుంచి సమాధానాలు రాలేదని తెలిసింది. దీంతో ఆయన్ను మళ్లీ విచారణకు రావాలని సూచించినట్లు సమాచారం. కాగా, ఈ ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారంలో హవాలా కోణంలో ప్రత్యేకంగా కేసు నమోదు చేసే అవకాశం ఉన్నట్లు చెబుతున్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular