Sunday, May 12, 2024
Home Blog Page 70

బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు భారీ షాక్

0

కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సిఎం రేవంత్

చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పరిధిలోని బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలకు భారీ షాక్ తగిలింది. స్థానిక ఎంపి, కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి డాక్టర్ జి. రంజిత్ రెడ్డి నేతృత్వంలో ఆ పార్టీలకు చెందిన 100 నుంచి 200ల మంది ముఖ్య కార్యకర్తలు కాంగ్రెస్‌లో పెద్ద ఎత్తున చేరారు. గురువారం హైదరాబాద్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసంలో వారికి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. చేవెళ్ల ప్రాంత అభివృద్ధే లక్ష్యంగా ఎంపి రంజిత్ రెడ్డితో కలసి పని చేసేందుకు పార్టీలో చేరినట్టు వారంతా స్పష్టం చేశారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డిని భారీ మెజారిటీతో గెలిపించుకుంటామని వారు వెల్లడించారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన వారిలో మహేశ్వరం నియోజకవర్గం సరూర్‌నగర్ మాజీ జడ్పీటిసి జిల్లెల నరేందర్ రెడ్డి, కందుకూరు జడ్పీటిసి బొక్క జంగారెడ్డి, బిజెపి సీనియర్ నాయకులు సిద్దాల దశరథ, రంగారెడ్డి జిల్లా బిజెపి కార్యవర్గ సభ్యులు బచ్చనబోయిన నరసింహ యాదవ్, కార్పొరేటర్ బచ్చన బోయిన పద్మ,

రంగారెడ్డి జిల్లా బీజేపీ ప్రధాన కార్యదర్శి, అనిత నాయక్, తుక్కుగూడ మున్సిపాలిటీ వైస్ చైర్మన్ భవానీ వెంకట్ రెడ్డి, జల్పల్లి మున్సిపాలిటీ బిఆర్‌ఎస్ పార్టీ ప్రెసిడెంట్ ఇక్బాల్ బిన్ ఖలీఫా, జల్‌పల్లి మున్సిపాలిటీ వైస్ చైర్మన్ యూసుఫ్ పటేల్, కౌన్సిలర్ తేజిస్వీని శ్రీకాంత్, కొండల్ యాదవ్, కౌన్సిలర్ అవల్గీ, మీర్‌పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని మాజీ జడ్పీటిసి జిల్లెల్ల నరేందర్ రెడ్డి, జిల్లాలగూడ మాజీ సర్పంచ్ జిల్లెల్ల వనిత నరేందర్ రెడ్డి, మాజీ ఎంపిటిసిలు చల్వది రాజేష్, దేరంగులు యాదయ్య, బొబ్బిలి కిరణ్ గౌడ్, బిఆర్‌ఎస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బిలి విజయ్ గౌడ్, భీమ్ రాజ్ శంకర్, శ్రీ కాంత్, బద్దం అనిల్ గౌడ్, గ్యార అనిల్ కుమార్, తదితరులు కండువా కప్పుకున్నారు.

ఆగని ఫ్రీలాంచ్‌ల దందాకు చెక్…

0
  • రెరా నోటీసులు ఇచ్చినా ఆగని వైనం
  • ‘బిల్డాక్స్’ బిల్డప్‌కు భారీగా జరిమానా
  • రూ.3 కోట్ల పైచిలుకు జరిమానా విధించిన రెరా అధికారులు
  • అందమైన బ్రోచర్‌లతో మోసం చేస్తున్న ‘బిల్డాక్స్’ రియల్‌సంస్థ…
  • వెంటనే సోషల్‌మీడియాలో లైవ్ ప్రకటనలు ఆపివేయాలని రెరా ఆదేశం

ఐటీ ఉద్యోగులే టార్గెట్‌గా ముంచేసిన ‘బిల్డాక్స్’ రియల్ సంస్థకు రెరా భారీగా జరిమానా విధించింది. ఇప్పటికే ఆ సంస్థపై ఫిర్యాదు చేసిన వినియోగదారుల దగ్గరి నుంచి రెరా స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసింది. గతంలో ఒకసారి రెరా అధికారులు హియరింగ్‌కు పిలిచినప్పుడు ‘బిల్డాక్స్’ సంస్థ తరపున హాజరైనఆ సంస్థ ప్రతినిధులు తాము ఎలాంటి ఫ్రీలాంచ్‌లకు పాల్పడడం లేదని రెరా ఎదుట తమ వాదనలు వినిపించారు. ఈ నేపథ్యంలోనే వినియోగదారుల నుంచి వచ్చిన ఫిర్యాదులను వారి ఎదుట ఉంచి ఈ కేసును రెరా విచారించింది. తమ పేరుపై ఎవరో కావాలని తప్పుడు ప్రచారం చేస్తున్నారని ‘బిల్డాక్స్’ తరపున హాజరైన ప్రతినిధులు రెరాకు తప్పుడు పత్రాలను సమర్పించారు. అయితే తమ సంస్థ తరపున హఫీజ్ పేటలోని సర్వేనెం. 80లో ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, తమపై వచ్చిన వార్తలు నిరాధారమని, ఆ భూమి తమది కాదనీ, బిల్డాక్స్ ప్రతినిధులు రెరా అధికారులతో పేర్కొని రెరాను తప్పుదోవ పట్టించారు. తమ సంస్థకు కేవలం భువని/వాసవి భురిడాక్స్ అనే ప్రాజెక్టు పేరుతో గుండ్లపోచంపల్లి (సర్వే నెం. 509/pard) నందు పిఓ 2200007044 నెంబర్‌తో బిల్డాక్స్ కంపెనీ ‘రెరా’ రిజిస్ట్రేషన్ కలిగి ఉన్నట్లు ఈ సంస్థ ప్రతినిధులు రెరాతో తెలిపారు.

సోషల్‌మీడియా ద్వారా ప్లాట్ల దందా…
ఈ నేపథ్యంలోనే మరోసారి బిల్డాక్స్ కేసుకు సంబంధించిన హియరింగ్‌ను గురువారం రెరా అధికారులు చేపట్టారు. ఈ నేపథ్యంలో గతనెల 08వ తేదీ నుంచి ఇప్పటివరకు బిల్డాక్స్ సంస్థ సోషల్‌మీడియాలో చేస్తున్న ఫ్రీలాంచ్ దందాపై రెరా అధికారులు దృష్టి సారించారు. గతనెల నుంచి ఇప్పటివరకు ‘బిల్డాక్స్’ సంస్థ ఫ్రీలాంచ్ దందాను ఆపలేదన్న విషయాన్ని రెరా నిర్ధారించుకుంది. ఈ నేపథ్యంలోనే ఆ సంస్థకు భారీగా జరిమానా విధిస్తూ గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. సోషల్‌మీడియా ద్వారా ప్రస్తుతం ‘బిల్డాక్స్’ సంస్థ హఫీజ్ పేటలోని సర్వేనెం. 80లో ప్లాట్లను విక్రయిస్తుందని, దీనికి సంబంధించి సోషల్‌మీడియాలో ఉన్న బ్రోచర్, ఫొన్ నెంబర్‌ల ఆధారంగా ఈ సంస్థకు రెరా జరిమానా విధించింది.

BILDOX project బిల్డాక్స్ విజ్ఞప్తిని తోసిపుచ్చిన ‘రెరా’ అధికారులు
బిల్డాక్స్ ప్రాజెక్టు విషయంలో ‘రెరా ’ ట్రిబ్యునల్ గురువారం హియరింగ్ (విచారణ) జరిపిన ఆధారంగా బిల్డాక్స్ ప్రాజెక్టుకు రూ.3 కోట్ల 96 లక్షల 39 వేల 600లు అపరాధ రుసుంగా విధించింది. బిల్డాక్స్ జారీ చేసిన ప్రకటన ఫేస్‌బుక్ లో ఇంకా (లైవ్) లో కొనసాగుతుండడంతో ఈ కారణంగా ప్రజలకు తప్పుడు సమాచారం చేరవేస్తూ సంబంధిత వ్యక్తుల నుంచి నగదు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రహించి ‘రెరా’ చట్టంలోని సెక్షన్ 59, 60 రెడ్విత్ 38 ప్రకారం రూ.3 కోట్ల 96 లక్షల 39 వేల 600లు జరిమానాగా విధిస్తున్నట్టు ‘రెరా అథారిటీ తెలిసింది. బిల్డాక్స్ తరఫు న్యాయవాదులు కౌంటర్ దాఖలు చేయడానికి మూడు వారాల సమయం కావాలని కోరినప్పటికీ, ఫేస్‌బుక్ ‘బిల్డాక్స్’ ప్రాజెక్టు ప్రకటన ఇంకా కొనసాగడాన్ని పరిగణలోకి తీసుకొని కొనుగోలు దారులు మోసాలకు గురికాకుండా వారిని అప్రమత్తం చేయడానికి ఆ సంస్థకు అపరాధ రుసుము విధిస్తున్నట్టు రెరా తెలిపింది. ఇదే ప్రాజెక్ట్ విషయంలో రానున్న రోజుల్లో ఎలాంటి ప్రకటనలు, మార్కెటింగ్, విక్రయాలు కొనసాగించరాదని రెరా అథారిటీ బిల్డాక్స్‌కు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఫేస్‌బుక్ ప్రకటనలు వెంటనే తొలగించాలని రెరా ట్రిబ్యునల్ బిల్డాక్స్‌ను ఆదేశించింది.

Also Read: ఎల్ అండ్ టి బంపర్ ఆఫర్…

రెరా అనుమతులు లేని ప్రాజెక్టుల్లో పెట్టుబడులు వద్దు
‘రెరా’ అనుమతులు లేని రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులలో పెట్టుబడి పెట్టి, కొనుగోలు చేసి మోసపోరాదని కొనుగోలుదారులకు ‘రెరా’ అథారిటీ సూచించింది. కొనుగోలుదారులకు భరోసా కల్పిస్తూ వారి రక్షణ కోసం రెరా అథారిటీ అన్ని చర్యలు తీసుకుంటుందని అథారిటీ తెలిపింది. ‘రెరా’ రిజిస్ట్రేషన్ పొందకుండా వ్యాపార ప్రకటనలు జారీ చేయడం, మార్కెటింగ్ కార్యకలాపాలు నిర్వహించడం ‘రెరా’ నిబంధనలు ఉల్లంఘించినట్లుగా భావించి తగిన చర్యలు తీసుకుంటామని అథారిటీ స్పష్టం చేసింది. అదేవిధంగా ఫ్రీ-లాంచ్ పేరుతో అమ్మకాలు చేపట్టడం ‘రెరా’ చట్టం ప్రకారం శిక్షర్హులుగా పరిగణించి తగిన చర్యలు తీసుకుంటామని రెరా హెచ్చరించింది.

RERA act రెరా చట్టం నిబంధనల మేరకు డెవలపర్లు, ప్రమోటర్లు సంబంధిత సంస్థల నుంచి అన్ని అనుమతులు పొందిన వెంటనే వాటిని రెరా అధికారిక వెబ్‌సైట్‌లో పెట్టి, ఆ ప్రాజెక్ట్ పూర్తి వివరాలు నమోదు చేసి రెరా రిజిస్ట్రేషన్ పొందాలని అథారిటీ పేర్కొంది. కొనుగోలుదారుల నమ్మకానికి పూర్తిస్థాయి భరోసా ఇవ్వడానికి రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులు క్రమం తప్పకుండా త్రైమాసిక, వార్షిక నివేదికలను విధిగా ‘రెరా’ వెబ్‌సైట్ లో ప్రాజెక్టు అభివృద్ది వివరాలను పొందుపరచాలని రెరా’ అథారిటీ ఆదేశించింది.

తుక్కుగూడ సభలో భారీగా చేరికలు

0

ఎమ్మెల్యేలు, మాజీలు, వారి అనుచరగణం చేరే అవకాశం
ఇప్పటికే సిఎం రేవంత్‌తో టచ్‌లోకి వెళ్లిన పలువురు ఎమ్మెల్యేలు…

పార్లమెంట్ ఎన్నికల వేళ కాంగ్రెస్ పార్టీ దూకుడు పెంచింది. అందులో భాగంగా ఈ నెల 6వ తేదీన తుక్కుగూడలో జనజాతర సభ ద్వారా ఎన్నికల శంఖారావాన్ని పూరించబోతుంది. ఈ నేపథ్యంలోనే ఆపరేషన్ ఆకర్శ్‌ను కూడా విజయవంతంగా కొనసాగిస్తోంది. అందులో భాగంగా తుక్కుగూడ సభలోగా వివిధ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను, మాజీలను, వారి అనుచరగణాన్ని కూడా కాంగ్రెస్‌లో చేర్చుకోవాలని ఆ పార్టీ వ్యూహాలను పన్నుతోంది. ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలతో పాటు మాజీలతో కాంగ్రెస్ పార్టీ టచ్‌లోకి వెళ్లినట్టుగా తెలిసింది. ఈ నేపథ్యంలోనే వారు పార్టీలో కి వస్తే వారికి సరైన గుర్తింపు ఇవ్వడంతో పాటు హోదాను కల్పిస్తామని భరోసా కల్పిస్తున్నట్టుగా సమాచారం. దీంతో ఎమ్మెల్యేలు చాలామంది తుక్కుగూడ సభలోగా కాంగ్రెస్ పార్టీలో చేరడానికి సిద్ధమయినట్టుగా తెలిసింది. ఇప్పటికే బిఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు దానం నాగేందర్, కడియం శ్రీహరి కాంగ్రెలో చేరగా మరికొందరు వివిధ పార్టీలకు చెందిన వారు కాంగ్రెస్‌లో చేరేందుకు సుముఖత వ్యక్తం చేసినట్టుగా కాంగ్రెస్ వర్గాలు పేర్కొంటున్నాయి.

ఏఐసిసి పెద్దల సమక్షంలో చేరికలు…
తుక్కుగూడ సభ ద్వారా భారీగా జనాన్ని సమీకరించి తమ సత్తా చాటాలని నిర్ణయించిన కాంగ్రెస్ పార్టీ ఈ సభకోసం 10 లక్షల మంది సేకరించాలని నిర్ణయించింది. ఆ దిశగా ఇప్పటికే సీనియర్ నాయకులకు ఈ బాధ్యతలను అప్పగించినట్టుగా తెలిసింది. దీంతోపాటు కాంగ్రెస్ జాతీయ మేనిఫెస్టోను కూడా ఇక్కడే విడుదల చేస్తుండడంతో జనసమీకరణ భారీగా ఉండాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయించినట్టుగా సమాచారం. వీలును బట్టి ఏఐసిసి పెద్దల సమక్షంలో లేదా సీఎం రేవంత్‌రెడ్డి సమక్షంలో పార్టీలో చేరబోతున్నట్టుగా తెలుస్తోంది.

ఇప్పటికే పలువురు ఎమ్మెల్యేలు సిఎం రేవంత్‌రెడ్డితో భేటీ అయినట్టుగా తెలిసింది. అయితే వారు పైకి తాము పార్టీ మారడం లేదని ప్రకటనలు ఇస్తున్నా, సాధ్యసాధ్యాలను బట్టి ఈ రెండు రోజుల్లో కండువా మార్చడం ఖాయమని తెలుస్తోంది. పార్టీ మారాలన్న ఆలోచన ఉన్న ఎమ్మెల్యేలు సైతం తాము కండువా మార్చేందుకు ఇదే సరైన సమయం అని భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. పార్టీ మారుతున్న సమయంలో తమతో పాటు తమ అనుచరగణాన్ని వెంట తీసుకువెళ్లడానికి సమాయత్తం కావడం విశేషం.

ఎల్ అండ్ టి బంపర్ ఆఫర్…

0
  • మెట్రో స్టేషన్‌లలోనూ ఆఫీసుల ఏర్పాటుకు ‘ఆఫీస్ బబుల్స్’
  • పట్టణ రవాణా రంగంలో వినూత్న ప్రయోగం చేసిన మెట్రో అధికారులు

ఆఫీస్ స్పేస్ కోసం వెతుకుతున్నారా ఎల్ అండ్ టి సంస్థ బంపర్ ఆఫర్ ఇస్తోంది. నగరంలో మూడు ప్రధాన మెట్రో స్టేషన్లలో సురక్షితమైన రిమోట్ కో వర్కింగ్ స్పేస్ కోసం ఆఫీస్ బబుల్స్‌ను ప్రారంభించింది. ఫ్లెక్సిబుల్ వర్క్ స్పేస్‌ల కోసం పెరుగుతున్న డిమాండ్‌ను గుర్తించిన ఆఫీస్ బబుల్స్ ను ఓపెన్ చేసినట్లు ఎల్ అండ్ టి పేర్కొంది. ఇది పట్టణ రవాణా రంగంలో మొట్ట మొదటి వినూత్న ప్రయోగంగా మెట్రో తెలిపింది. ఈ ఆఫీస్ బబుల్స్ ద్వారా ఎల్ అండ్ టి సంస్థ హైదరాబాద్ లోని మెట్రో స్టేషనలలో కావాల్సిన స్పేస్‌ను ఏర్పాటు చేస్తుంది. ఈ స్థలంలో ఎటువంటి ఆఫీసులైన పెట్టుకోవచ్చు. ముఖ్యంగా ఐటీ ఆఫీసుల వంటి కమర్షియల్ ఆఫీసులను సైతం ఏర్పాటు చేసుకోవచ్చు.

మొదటగా ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ చేసిన ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ A ‘trendy work space’ by an office space operator
ప్రస్తుతం హైటెక్ సిటీ, దుర్గం చెరువు, మాదాపూర్ వంటి మెట్రో ప్రధాన స్టేషన్‌లలో ఈ ఆఫీస్ బబుల్స్ ను మెట్రో అధికారులు ఏర్పాటు చేశారు. 10వేల చదరపు అడుగుల స్థలాన్ని ఎల్ అండ్ టి సంస్థ లీజుకు ఇస్తోంది. ఎల్ అండ్ టి సంస్థ అందుబాటులోకి తెచ్చిన ఈ కొత్త విధానం రిమోట్ ఆఫీసులను ఏర్పాటు చేసుకునేందుకు మంచి అవకాశాన్ని అందిస్తుంది. నిరంతరాయమైన కనెక్టివిటీ కోసం హైదరాబాద్ మెట్రోనెట్ వర్క్ ను ఉపయోగించుకోవచ్చు. అయితే ఈ ఆఫర్‌ను ఉపయోగించుకున్న మొదటి కమర్షియల్ ఆఫీస్ స్పేస్ ఆపరేటర్ ‘ట్రెండ్జ్ వర్క్ స్పేస్ ’ అని సంస్థ ప్రకటించింది.

బిజినెస్ పరంగా అనుకూలమైన Modern Efficient Work Environment మోడర్న్ ఎఫిషియెంట్ వర్క్ ఎన్వీరాన్ మెంట్ ను కోరుకునే స్థలంకోసం నిరంతరాయమైన కనెక్టివిటీని ఈ ఆఫీస్ బబుల్స్ ఆఫర్ చేస్తోందని ఎల్ అండ్ టి సంస్థ తెలిపింది. రెండు యూనిట్లు ఏర్పాటు చేసుకునేలా ఆఫీస్ బబుల్స్ క్లెయింట్స్ కోరుకున్న విధంగా అనేక రకాల సైజుల్లో, రెండు యూనిట్లను ఏర్పాటు చేసుకునేలా 1,750 చదరపు అడుగుల స్థలాన్ని పొందవచ్చని మెట్రో అధికారులు తెలిపారు. ఇది హైదరాబాద్ లోని మొత్తం 49 టిపికల్ మెట్రో స్టేషన్‌లలో అందుబాటులో ఉంది. అంతేకాదు పెద్ద స్థలాలు కూడా లీజుకు తీసుకోవచ్చు. 8 నాన్ టిపికల్ మెట్రో స్టేషన్లలో 5వేల చదరపు అడుగుల నుంచి 30 వేల చదరపు అడుగుల వరకు లీజుకు తీసుకోవచ్చు. ఎక్కువ రద్దీ ఉంటే మెట్రోస్టేషన్‌లలోనూ ఈ ఆఫీస్ బబుల్స్ ను ఏర్పాటు చేసుకోవచ్చని మెట్రో తెలిపింది.

తీర్పు రిజర్వు జైలుకే కవిత

0

టీఎస్​, న్యూస్​:ఢిల్లీ లిక్కర్ స్కామ్‌‌లో అరెస్ట్ అయి జైలులో ఉన్న బీఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కవిత బెయిల్‌ పిటిషన్‌పై ఢిల్లీ రౌజ్ అవెన్యూ కోర్టు కోర్టులో గురువారం విచారణ జరిగింది. ఈడీ దాఖలు చేసిన కౌంటర్‌పై కవిత తరపు న్యాయవాదులు రిజాయిన్డెర్లు ఫైల్ చేశారు. కుమారుడి పరీక్షల నేపథ్యంలో మధ్యంతర బెయిల్ ఇవ్వాలని ఒక పిటిషన్, ఈడీ కస్టడీ ముగియడంతో రెగ్యులర్ బెయిల్ ఇవ్వాలని దాఖలైన పిటిషన్లపై వాదనలు జరిగాయి. కవిత తరపున సీనియర్ కౌన్సిల్ అభిషేక్ మను సింఘ్వీ వాదనలు వినిపించారు.

కొడుకు కోసం బెయిల్​ ఇవ్వండి

ఈ సందర్భంగా ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ జడ్జిమెంట్‌ను అభిషేక్ మను సింఘ్వీ కోర్టులో లేవనెత్తారు. కుమారుడికి పరీక్షలు ఉన్నాయని.. అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామన్నారు. పరీక్షల సమయంలో తల్లి మోరల్ సపోర్ట్ ఉండాలన్నారు. ప్రధాని మోదీ చాలా సందర్భాలలో పిల్లల పరీక్షల సన్నద్ధతపై లెక్చర్ ఇచ్చారని కోర్టుకు తెలిపారు. పరీక్షల సమయంలో పిలల్లకు తల్లి మద్దతు ఉండాలని.. తల్లి అరెస్ట్, పరీక్షల నిర్వహణ పిల్లోడిపై ప్రభావం ఉంటుందన్నారు. తండ్రి ఉన్నాడు కానీ న్యాయ పోరాటంలో ఉన్నారని లాయర్ సంఘ్వీ కోర్టుకు తెలియజేశారు. కవితకు మహిళగా, లేజిస్లేచర్‌‌గా బెయిల్ పొందొచ్చని, తన కుమారుడికి తల్లి సపోర్ట్ కావాలన్నారు. కవిత కొడుకు భయంలో ఉన్నాడన్నారు. తల్లితో ఉన్న ఆత్మీయత, అనుంబందాన్ని ఎవరూ తీర్చలేరన్నారు. మన కుటుంబాలకు ఓ విధానం ఉందని.. తల్లి పాత్ర చాలా కీలకమని చెప్పుకొచ్చారు. కొడుకు హైదరాబాద్‌లో ఉన్నాడని.. తల్లి జైల్లో ఉందని.. తండ్రి కోర్టు కేసుల కోసం ఢిల్లీలో ఉన్నారని కవిత తరపు న్యాయవాది మను సంఘ్వీ న్యాయస్థానానికి తెలిపారు.

కాగా, ఈడీ తరపున న్యాయవాది జోయబ్ హోస్సేన్ వాదనలు వినిపించారు. కవిత కుమారుడికి పరీక్షలు ఉన్నాయని, అందుకే బెయిల్ మంజూరు చేయాలని కోరుతున్నామని కవిత వేసిన పిటిషన్​ను ఈడీ పూర్తిగా వ్యతిరేకించింది. అవినీతి కార్యకలాపాల్లో ఉన్న మహిళకు బెయిల్ ఇవ్వకూడదని, బెయిల్ ఇస్తే ఆధారాలు, సాక్షాలను ప్రభావితం చేస్తారని కోర్టుకు లాయర్ తెలిపారు.

ఆమె కొడుకు ఒంటరిగా లేడు

ఈ సందర్భంగా ఈడీ న్యాయవాది జోయబ్​ వాదిస్తే.. ‘‘కవిత చిన్నకొడుకు ఒంటరిగా ఏం లేడు. 22 ఏళ్ల సోదరుడు, ఇతర కుటుంబ సభ్యులు తోడుగా ఉన్నాడు. కవితను ఆమె ముగ్గురు సిస్టర్స్ ములాఖత్ అయ్యారు. అబ్బాయి చూసుకోవాడానికి కుటుంబ సభ్యులు ఉన్నారు. పరీక్షలు ఉన్నాయని మధ్యంతర బెయిల్ అడుగుతున్నారు, కానీ పరీక్షల్లో కొన్ని ఇప్పటికే అయిపోయాయి. కవిత కుమారుడికి ఎగ్జామ్ యాంగ్జైటీ ఉందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు ఇవ్వలేదు’’ అని కోర్టుకు వెల్లడించారు.
‘‘కవితకు వ్యతిరేకంగా ఆధారాలు ఉన్నాయి. లిక్కర్ కేసు ప్లాన్ చేసింది కవిత. కవిత మొబైల్ ఫోన్లను మార్చారు. ఆధారాలు ధ్వంసం చేశారు. ఫోన్లలో సమాచారాన్ని డిలీట్ చేశారు. 9 ఫోన్లలో డేటా డిలీట్ చేశారు. మొత్తం 10 ఫోన్లను ఫోరెన్సిక్ లాబ్‌కు పంపాం. 9 ఫోన్లను ఫార్మాట్ చేశారు. లిక్కర్ కేసులో కవిత పాత్రపై దర్యాప్తు కొనసాగుతుంది. కవిత బ్యాంకు ఖాతాలు, ఐటీఆర్ వివరాలు,కుటుంబ వ్యాపార వివరాలు ఇవ్వలేదు. ఫోరెన్సిక్ లాబ్ డేటా ప్రకారం 4 ఫోన్లు ఫార్మాట్ చేయబడ్డాయి. ఈ కేసులో వందల కొద్దీ డిజిటల్ పరికరాల్లో డేటా డిలీట్ చేయబడింది. కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది.. ఈ సమయంలో కవితకు బెయిల్ ఇవ్వడం కేసు దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది. లిక్కర్ వ్యాపారంలో కవిత వాటా 33 శాతం. మాగుంట రాఘవరెడ్డి వాటా 33 శాతం. దినేష్ అరోరా అప్రూవర్ మారాకా అన్ని విషయాలు చెప్పాడు. వంద కోట్ల రూపాయలు కవిత ఆలోచన మేరకే ఆమ్ ఆద్మీ పార్టీకి ముడుపుల రూపంలో ఇచ్చారు. బుచ్చిబాబు ఫోన్ నుంచి డేటా రికవరీ చేశాము. ఆ డేటా ఆధారంగా కవితను విచరించాము. అరుణ్ పిళ్ళైతో కవితను విచారించాము. అప్రూవల్‌గా మారిన వ్యక్తిని తనకు వ్యతిరేకంగా సాక్ష్యం చెప్పవద్దంటూ కవిత బెదిరించారు’’ అని న్యాయవాది జోయబ్ హోస్సేన్ వెల్లడించారు. కవితకు వ్యతిరేకంగా సేకరించిన ఆధారాలను జడ్జికి సమర్పించారు. అలాగే కవితకు బెయిల్ ఇవ్వాలన్న వాదనను తిరస్కరించాలని కోర్టును ఈడీ తరపు న్యాయవాది జోయబ్ హోస్సేన్ కోరారు.

తీర్పు రిజర్వు

ఇరువర్గాల వాదనలు విన్న రౌజ్​ అవెన్యూ కోర్టు తీర్పును రిజర్వే చేసింది. దీనిపై సోమవారం తీర్పును వెలువరించనున్నట్లు న్యాయమూర్తి వెల్లడించారు. అయితే, రెగ్యులర్​ బెయిల్​ పిటిషన్​పై ఈ నెల 20న వాదనలు వింటామని వాయిదా వేశారు.

ఫోన్​ ట్యాపింగ్​లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్​

0
  • ఫోన్​ ట్యాపింగ్​లో ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్​
  • కేసీఆర్​ కనుసన్నల్లో ఫాంహౌస్​ కేసు

టీఎస్​, న్యూస్​:తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లేకొద్దీ.. సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫాంహౌస్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. ఈ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్‌కుమార్ సంచలన విషయాలను వెలుగులోకి తీసుకొచ్చారు. గురువారం నాడు ఆయన మీడియాకు పలు విషయాలను వెల్లడించారు. మాజీ డీసీపీ రాధ కిషన్ రావు పోలీస్ కస్టడీపై కోర్టు అనుమతితో ఆయనను తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. ఈ నెల 10 తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధా కిషన్ రావు‌ను విచారిస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని, ఎస్ఐబీలో హార్డ్ డిస్క్‌ల ధ్వంసం కేసులో కుట్రధారుడిగా రాధా కిషన్ రావు ఉన్నారని చెప్పారు.

ఈ కేసులో కొంతమంది ప్రముఖుల ప్రొఫైళ్లను అనధికారకంగా తయారుచేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురి ప్రొఫైళ్లని రాధా కిషన్ రావు తయారు చేశాడని వెస్ట్‌జోన్ డీసీపీ వెల్లడించారు. ఆయన బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడని, కాంగ్రెస్‌కి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేయించాడన్నారు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్‌లను ధ్వంసం చేసిన ఎస్‌ఐబీ మాజీ చీఫ్‌ ప్రభాకర్‌రావుకి రాధాకృష్ణ సహకరించాడని, పలువురి ప్రొఫైల్స్‌కు సంబంధించిన వ్యవహారాలను బయటకు రాకుండా ఉండటానికి ఆధారాలను ధ్వంసం చేశారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు.

ఫోన్ ట్యాపింగ్‌ వల్లే ఫాంహౌస్​ కేసు

కాగా.. ఎమ్మెల్యేల కొనుగోలు కేసులోమాజీ డీసీపీ రాధ కిషన్ రావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఫాంహౌస్ ఎపిసోడ్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్‌ వల్లే జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫాంహౌస్‌లో ఆపరేషన్ కంటే ముందు రాధ కిషన్ రావు 74 డివైసులను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ నడిచినట్లు తెలుస్తోంది.

ఈ వ్యవహారం రాధ కిషన్ రావు పరిధిలో లేకపోయినా గత కేసీఆర్ ప్రభుత్వం ఆయన కనుసన్నుల్లోనే నడిపించినట్లు తెలుస్తోంది. నంద కుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫాంహౌస్ ఎపిసోడ్‌కు రాధ కిషన్ రావు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కేసులో భాగంగానే సీసీటీవీ కెమెరాలను ఐటీ ఇన్‌స్పెక్టర్‌ జూపల్లి రమేష్ రావు మానిటరింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాధ కిషన్ రావుని కస్టడీకి అనుమతిస్తే మొదట ఫాంహౌస్ కేసుపై హైదరాబాద్ పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైస్‌ను రాధ కిషన్ రావు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.

క్లీన్ యు సర్టిఫికెట్ పొందిన “ఫ్యామిలీ స్టార్”

0

స్టార్ హీరో విజయ్ దేవరకొండ నటించిన “ఫ్యామిలీ స్టార్” సినిమా మరికొద్ది గంటల్లో వరల్డ్ వైడ్ గా ప్రేక్షకుల ముందుకు గ్రాండ్ థియేట్రికల్ రిలీజ్ కు రాబోతోంది. ఈ సినిమాకు సెన్సార్ నుంచి క్లీన్ యు సర్టిఫికెట్ దక్కింది. 2 గంటల 30 నిమిషాల నిడివితో సకుటుంబంగా ప్రేక్షకులంతా కలిసి చూసేలా ఫ్యామిలీ స్టార్ సినిమా ఉండబోతోంది. ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందనే పాజిటివ్ వైబ్స్ అంతటా కనిపిస్తున్నాయి. ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం అన్ని వర్గాల ప్రేక్షకులు ఎదురుచూస్తున్నారు.

“ఫ్యామిలీ స్టార్” సినిమాను ప్రతిష్టాత్మక నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ లో స్టార్ ప్రొడ్యూసర్స్ దిల్ రాజు, శిరీష్ నిర్మించారు. హోల్ సమ్ ఎంటర్ టైనర్ గా సక్సెస్ ఫుల్ డైరెక్టర్ పరశురామ్ పెట్ల రూపొందించారు. విజయ్ సరసన మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. ఈ చిత్రానికి క్రియేటివ్ ప్రొడ్యూసర్ గా వాసు వర్మ వ్యవహరిస్తున్నారు. ఫ్యామిలీ స్టార్ సినిమా రేపు ఘనంగా తెలుగు, తమిళ భాషల్లో విడుదలవుతోంది.

ఓటీటీలో క్రైమ్ కామెడీ థ్రిల్లర్ “కిస్మత్” కి అధ్భుత స్పందన

0

థియేటర్లలో ప్రేక్షకుల నుంచి మంచి ఆదరణ పొందిన కామెడీ థ్రిల్లర్ “కిస్మత్” … ఇప్పుడు ఓటీటీలోనూ అధ్భుత ఆదరణ పొందుతోంది. ఈ సినిమాలో న‌రేష్ అగ‌స్త్య‌, అభిన‌వ్ గోమ‌టం, విశ్వ‌దేవ్ హీరోలుగా న‌టించారు. కామ్రేడ్ ఫిల్మ్ ఫ్యాక్టరీ పతాకం పై కిస్మత్ మూవీ నీ రాజు, భాను ప్రసాద్ రెడ్డి లు నిర్మించారు.ఇటీవల ఆహా, అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో రిలీజైంది. క్రైమ్ కామెడీ థ్రిల్ల‌ర్‌గా తెర‌కెక్కిన ఈ సినిమాతో శ్రీనాథ్ బాదినేని ద‌ర్శ‌కుడిగా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు.

ఇందులో అవ‌స‌రాల శ్రీనివాస్ కీల‌క పాత్ర‌ను పోషించాడు. ఈ వేసవిలో ఓటీటీలో విడుదలయిన మంచి కామెడీ థ్రిల్లర్ గా ప్రేక్షకుల నుంచి ఆదరణ పొందుతోంది. ఈ ఏడాది ఫిబ్ర‌వ‌రి 2న థియేట‌ర్ల‌లో రిలీజైన ఈ మూవీ తెలుగు ప్రేక్ష‌కుల్ని ఆకట్టుకుంది. అభిన‌వ్ గోమ‌టం, న‌రేష్ అగ‌స్త్య కామెడీనీ బాగా ఎంజాయ్ చేశారు. కిస్మ‌త్ రిలీజైన రోజు టాలీవుడ్ బాక్సాఫీస్ వ‌ద్ద ఎనిమిది సినిమాలు రిలీజ్ అయినా… కిస్మత్ మంచి ఆదరణ పొందింది. ఇప్పుడు అమెజాన్లో ఇండియా వైడ్ గా నెంబర్ 4గా ట్రెండ్ అవుతుంది. అలాగే అహా ఓ టి టి లో కూడా ప్రేక్షకుల్ని థ్రిల్ చేస్తోంది.

ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

0

7న చెన్నైలో ఘనంగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ సిల్వర్ జూబ్లీ ఉగాది పురస్కారాలు

ఏటా ఉగాది పురస్కారాలు అందిస్తూ చెన్నైలో తెలుగు వారి కీర్తిని చాటుతున్న శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఈ ఏడాది సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాలు అందించబోతోంది. ఈ సంస్థ స్థాపించి పాతికేళ్ల అవుతుంది. ఈ నెల 7వ తేదీన చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమం జరగనుంది. ఈ కార్యక్రమ వివరాలు హైదరాబాద్ లో జరిగిన కార్యక్రమంలో కమిటీ మెంబర్స్ వివరించారు.

శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ అధ్యక్షులు బేతిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ.. చెన్నై మహానగరంలో తెలుగు వారి ఘన కీర్తిని చాటుతూ పాతిక సంవత్సరాలుగా శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ ఉగాది పురస్కారాలు అందిస్తున్నాం. 1998, నవంబర్ 21వ తేదీన ఈ అవార్డ్స్ ప్రారంభించాం. శ్రీ కళా సుధ తెలుగు అసోసియేషన్ స్థాపించి ఇరవై ఐదేళ్లు పూర్తయింది. ఉగాదికి రెండు రోజుల ముందే ఈ నెల 7వ తేదీన సాయంత్రం 5 గంటల నుంచి చెన్నై మ్యూజిక్ అకాడెమీలో ఈ కార్యక్రమం నిర్వహిస్తాం. ఈ సందర్భంగా సావనీర్ రిలీజ్ చేయబోతున్నాం. క్రోధి నామ సంవత్సరం ఉగాది రోజున మహిళా రత్న పురస్కారం, ఒక నటి, దర్శకుడికి బాపు రమణ పేరు మీద బాపుబొమ్మ అవార్డ్ ఇస్తున్నాం. అలాగే నిర్మాత ఆదిత్య రామ్ గారికి విశిష్ట ఉగాది పురస్కారం, రవి ప్రసాద్ యూనిట్ అధినేత చంగయ్య గారికి లైఫ్ టైమ్ అఛీవ్ మెంట్ అవార్డ్ ఇవ్వబోతున్నాం. జనవరి నుంచి డిసెంబర్ వరకు రిలీజైన తెలుగు సినిమాల్లో మన తెలుగుదనం ఉట్టిపడేలా ఉన్న చిత్రాలకు పురస్కారాలు ఇస్తాం. ఈ కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు అతిథిగా పాల్గొంటారు. సభాధ్యక్షుడిగా మండలి బుద్ధ ప్రసాద్ గారు వ్యవహరిస్తారు. అన్నారు.

కమిటీ మెంబర్ పర్వతనేని రాంబాబు మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ లో నేను కమిటీ మెంబర్ గా పదేళ్లుగా కొనసాగుతున్నాను. ప్రతి ఏడాది ఉగాదికి ముందు వచ్చే ఆదివారం రోజు ఈ కార్యక్రమం నిర్వహిస్తుంటాం. ఇలా పాతికేళ్లుగా ఈ ఉగాది పురస్కారాలు ఇస్తున్న శ్రీనివాస్ గారు, ఇతర కమిటీ మెంబర్స్ కు అభినందనలు. చెన్నైలోని మ్యూజిక్ అకాడెమీలో ఈ పురస్కారాల కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఆ వేదిక మీద అవార్డ్ అందుకోవడం గొప్ప గౌరవంగా భావిస్తుంటారు. శ్రీనివాస్ గారు ఏడాది అంతా చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్స్ లో తెలుగు సినిమాలను అక్కడ ఉన్న తెలుగు వారికీ చూపిస్తూ వాటిలో బాగున్న వాటిని అవార్డ్స్ కోసం సెలెక్ట్ చేస్తుంటారు. ఈ సారి ఇరవై ఐదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా వచ్చిన ప్రతి కుటుంబానికి సిల్వర్ కాయిన్ రిటన్ గిఫ్టుగా ఇస్తున్నారు. ప్రసన్నకుమార్ గారు ఈ కార్యక్రమంలో భాగమవడం సంతోషంగా ఉంది. మీరంతా కళాసుధ అవార్డ్స్ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుకుంటున్నా అన్నారు.

కమిటీ మెంబర్ సౌజన్య మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ చెన్నై సిల్వర్ జుబ్లీ ఉగాది పురస్కారాల కార్యక్రమానికి తెలంగాణ నుంచి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు, మండలి బుద్ధ ప్రసాద్ గారు, గానకోకిల సుశీల గారు, ఎస్ బీఐ చెన్నై సర్కిల్ జీఎం ఎంవీఆర్ మురళీకృష్ణ గారు, తానా ఫౌండేషన్ ఛైర్మన్ శశికాంత్ గారు, తెలుగు ఫిలిం ప్రొడ్యూసర్ కౌన్సిల్ సెక్రటరీ ప్రసన్న కుమార్ గారు, సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ హాజరవుతారు అన్నారు.

కమిటీ మెంబర్ హేమంత్ మాట్లాడుతూ.. శ్రీ కళాసుధ తెలుగు అసోసియేషన్ వారు ఇరవై ఐదేళ్లుగా ఉగాది పురస్కారాలు అందించడం గొప్ప విషయం. శ్రీనివాస్ గారి పట్టుదల వల్లే ఇంతమంచి కార్యక్రమం కొనసాగుతోంది. మాకు సపోర్ట్ చేస్తున్న ప్రసన్నకుమార్ గారికి, పర్వతనేని రాంబాబు, కేశవ గార్లకు థ్యాంక్స్. ఇటీవల చెన్నైలో తెలుగు వారి కార్యక్రమాలు తగ్గిపోయాయి. కళాసుధ వారు మాత్రం క్రమం తప్పకుండా ఉగాది పురస్కారాలు అందిస్తూ వస్తున్నారు. మీరంతా ఈ కార్యక్రమంలో పాల్గొంటారని ఆశిస్తున్నాం అన్నారు.

నిర్మాత ప్రసన్న కుమార్ మాట్లాడుతూ.. ఒకప్పుడు మద్రాసు రాష్ట్రంలోనే మన తెలుగు వాళ్లంతా కలిసి ఉండేవాళ్ళం. పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష తర్వాత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా విడిపోయింది. అయినా మనకు సాంస్కృతిక రాజధాని మద్రాస్ అనే అనుకోవాలి. కలకత్తాలో సినిమా పుట్టినా అక్కడి నుంచి ముంబై, షోలాపూర్ నుంచి మద్రాసు చేరింది. మద్రాసులో తమిళంతో పాటు తెలుగు, కన్నడ, మలయాళ, ఒరియా సినిమాలు కూడా రూపొందేవి. అలాంటి మద్రాసు నగరంలోని మ్యూజిక్ అకాడెమీలో పాతికేళ్లుగా కళాసుధ అవార్డ్స్ నిర్వహించడం గొప్ప విషయం. ఈ సంస్థ మన సినిమాలకు ఉగాది పురస్కారాలు ఇస్తూ ఎంతో ప్రోత్సాహం అందిస్తోంది. ఉత్తమ నిర్మతా మైత్రీ మూవీ మేకర్స్, ఉత్తమ సంచలనాత్మక సినిమా భగవంత్ కేసరి, ఉత్తమ జ్యూరీ అవార్డ్ రుద్రంగి, ఉత్తమ నటుడు ధనుష్ (సార్ సినిమాకు), భగవంత్ కేసరికి ఉత్తమ నటిగా శ్రీలీల, భగవంత్ కేసరికి ఉత్తమ దర్శకుడిగా అనిల్ రావిపూడికి ఉగాది పురస్కారాలు ఇవ్వబోతున్నారు. పాతికేళ్లుగా ఇంత మంచి కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు కళాసుధ వారికి అభినందనలు. వందేళ్లు ఇలాగే ఉగాది పురస్కారాలు ఇవ్వాలని కోరుకుంటున్నా అన్నారు.