తెలుగు, త‌మిళంలో సందీప్ కిష‌న్  `తెనాలి రామ‌కృష్ణ బి.ఎ

Sandeep Kishan New Movie Tenali Ramakrishna
బి.ఎల్… మే 7న ఫ‌స్ట్ లుక్‌
సందీప్ కిష‌న్ న‌టిస్తున్న చిత్రం `తెనాలి రామ‌కృష్ణ బీఏ బీఎల్‌`. తెలుగు, త‌మిళంలో ఏక కాలంలో రూపొందుతోంది. ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ మే 7న విడుద‌ల కానుంది. తెలుగు, త‌మిళంలో ఫ‌స్ట్ లుక్‌ను విడుద‌ల చేయ‌నున్నారు. జి.నాగేశ్వ‌ర‌రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌కత్వం వ‌హిస్తున్నారు. హ‌న్సిక నాయిక‌గా న‌టిస్తున్నారు.
పూర్తిస్థాయి వినోదాత్మ‌క చిత్రంగా రూపొందుతోంది.
60 శాతం చిత్రీక‌ర‌ణ పూర్త‌యింది. త‌మిళ న‌టి వ‌ర‌ల‌క్ష్మీ శ‌ర‌త్‌కుమార్ ఈ సినిమాతో తెలుగులోకి ప‌రిచ‌య‌మ‌వుతున్నారు. ముర‌ళీ శ‌ర్మ‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్ త‌దితరులు ఇత‌ర కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.
`తెనాలి రామ‌కృష్ణ బీఏబీఎల్‌`కు సాయికార్తిక్ సంగీతాన్ని అందిస్తున్నారు. సాయి శ్రీరామ్ ఈ చిత్రానికి కెమెరామేన్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్ ప‌తాకంపై ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. తెలుగు, త‌మిళ భాష‌ల్లో ఏక స‌మ‌యంలో ఈ సినిమాను రూపొందిస్తున్నారు.
న‌టీన‌టులు:
సందీప్ కిష‌న్‌, హ‌న్సిక‌, ముర‌ళీ శ‌ర్మ‌, వ‌ర‌ల‌క్ష్మి శ‌ర‌త్ కుమార్‌, బ్ర‌హ్మానందం, వెన్నెల కిశోర్‌, ప్ర‌భాస్ శ్రీను, పృథ్వి, ర‌ఘు బాబు, స‌ప్త‌గిరి, ర‌జిత‌, కిన్నెర, అన్న‌పూర్ణ‌మ్మ‌, వై.విజ‌య‌, స‌త్య‌కృష్ణ త‌దిత‌రులు
సాంకేతిక నిపుణులు
ద‌ర్శ‌క‌త్వం:  జి. నాగేశ్వ‌ర రెడ్డి
నిర్మాత‌లు:  అగ్ర‌హారం నాగిరెడ్డి, సంజీవ్ రెడ్డి, రూపా జ‌గ‌దీశ్‌
సంస్థ‌:  శ్రీ నీల‌కంఠేశ్వ‌ర స్వామి క్రియేష‌న్స్
స‌మ‌ర్ప‌ణ‌:  ఇందుమ‌తి శ్రీనివాసులు
క‌థ‌:  టి. రాజ‌సింహ‌
సంగీతం:  సాయికార్తీక్‌
కెమెరా:  సాయి శ్రీరామ్‌
ఎడిట‌ర్:  చోటా కె ప్ర‌సాద్‌
మాట‌లు:  నివాస్‌,  భ‌వానీ ప్ర‌సాద్‌
స్క్రీన్‌ప్లే:  రాజు, గోపాల కృష్ణ‌
ఆర్ట్:  కిర‌ణ్‌
యాక్ష‌న్‌:  వెంక‌ట్‌
పీఆర్వో:  వంశీ శేఖ‌ర్
- Advertisement -spot_img
- Advertisement -spot_img

Latest article