Sunday, May 5, 2024

మైట్రో రైలు, ఆర్టీసి బస్సుల టైమింగ్స్‌ను మార్చిన అధికారులు

హైదరాబాద్ మెట్రో రైల్, రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలు ఉప్పల్ మ్యాచ్ నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రయాణికుల సౌకర్యార్థం మెట్రో రైలు టైమింగ్స్, బస్సులు నడిపే సమయాన్ని పెంచారు. ఐపిఎల్ సీజన్ 17లో భాగంగా గురువారం ఉప్పల్ క్రికెట్ స్టేడియంలో హైదరాబాద్ సన్ రైజర్స్, బెంగళూరు రాయల్ ఛాలెంజర్స్ టీమ్స్ మధ్య మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్‌కు వచ్చే ప్రేక్షకులను దృష్టిలో పెట్టుకొని మెట్రో, ఆర్టీసి సేవలు నడిపే సమయాన్ని పొడిగించాయి. సాధారణంగా రాత్రి 11 గంటలకు చివరి మెట్రో ఉంటుంది.

మారిన సమయం ప్రకారం మెట్రో రైళ్లు గురువారం అర్థరాత్రి 1.10 గంటల వరకు నడువనున్నాయి. అయితే, చివరగా రైళ్లు 12.15 గంటలకు బయలుదేరనుండగా 1.10 గంటలకు అవి గమ్య స్థానాలకు చేరుకుంటాయి. ఇక ఆర్టీసి సైతం ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. జీహెచ్‌ఎంసీ పరిధిలోని వివిధ ప్రాంతాల నుంచి ఉప్పల్ స్టేడియం వరకు ప్రత్యేక బస్సులను నడుపనున్నట్లు ఆర్టీసి అధికారులు ప్రకటించారు. ప్రయాణికులు ఈ సర్వీసును ఉపయోగించుకొని తమ గమ్య స్థానాలకు సురక్షితంగా చేరుకోవాలని ఆర్టీసి ఎండి సజ్జనార్ సూచించారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular