Saturday, April 27, 2024

38 మందితో ఎస్​ఐబీ లాగర్​ రూం

  • ఒక ఐజీ.. మాజీ డీఐజీ, ముగ్గురు మాజీ ఎస్పీలు
  • మరో ఐదుగురు అదనపు ఎస్పీలు

ఫోన్​ ట్యాపింగ్​ కేసులో భాగస్వాములైన అధికారుల పాత్రను బయటకు తీస్తున్నారు. కొంతమంది అధికారులు కలిసి ఎస్​ఐబీని బంధీ చేసినట్లుగా సిట్​ పోలీసులు గుర్తించారు. సీఎంఓ నుంచి భరోసా ఉండటంతో.. ఇంటలీజెన్సీ బ్యూరో విచ్చలవిడిగా ప్రవర్తించింది. కేవలం ఒకే వర్గానికి చెందిన పోలీస్​ అధికారులతో ఏర్పాటైన టీం.. రాష్ట్రంలోని లక్షల మంది ఫోన్లను ట్యాప్​ చేశారు. ఎస్​ఐబీని రిటైర్డ్​ ఐజీ ప్రభాకర్​రావుతో పాటు ఒక మాజీ డీఐజీ ముందుండి నడిపించినట్లు తేలింది. వీరితో పాటుగా ముగ్గురు మాజీ ఎస్పీలు, ఐదుగురు అడిషనల్​ ఎస్పీలు కలిసి ఎస్​ఐబీని కంట్రోల్​ చేసినట్లు తేలింది. వీరిని త్వరలో అరెస్ట్​ చేసే అవకాశాలున్నాయి. ఇప్పటికే ప్రణీత్​రావుతో పాటుగా అడిషనల్​ఎస్పీలు భుజంగరావు, తిరుపతన్నను పోలీసులు అదుపులోకి తీసుకుని, విచారించిన విషయం తెలిసిందే.

రిటైరైన తర్వాతే అసలు కథ
ప్రభుత్వంలో కీలకమైన ఇంటలీజెన్సీ విభాగాన్ని పోలీస్​ శాఖలో పదవీ విరమణ పొందిన కొంతమంది అధికారుల చేతుల్లో పెట్టారు. కొంతమందిని.. ఒకే సామాజివర్గానికి చెందిన వారిని ఎంపిక చేసిన అప్పటి ప్రభుత్వ పెద్దలు.. వారికి నిఘా విభాగాన్ని అప్పగించారు. ప్రస్తుతం ఫోన్​ ట్యాపింగ్​పై విచారణ జరుపుగుతున్న సిట్​ బృందం దీనిపై పూర్తిస్థాయి నివేదికను సిద్ధం చేసింది. ఐజీ హోదాలో పదవీ విరమణ పొందిన ప్రభాకర్​రావు చీఫ్​గా వ్యవహరించగా, మరో డీఐజీ కూడా అదేస్థాయిలో పని చేశారు. ఇక, ప్రణీత్​రావు నేతృత్వంలో ముగ్గురు అదనపు ఎస్పీలు, ఐదుగురు డీఎస్పీలు కూడా రిటరైన తర్వాత ఎస్ఐబీలోనే ఉన్నారు. వీరంతా ప్రణీత్​రావు నేతృత్వంలో ఫోన్​ ట్యాపింగ్​ వ్యవహారాలన్నీ నిర్వహించారు. ప్రణీత్​రావుకు మరో ఐదుగురు ఇన్స్​పెక్టర్లను అప్పగించారు. ఇలా మొత్తంగా 38 మందితో ప్రణీత్​ టీం ఎస్ఐబీ లాగర్​ రూంను నడిపించింది. ఈ వ్యవహారంలో సహకరించిన వారందరినీ సిట్​ పోలీసులు విచారించేందుకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటున్నారు.

బ్రెజిల్​కు స్పెషల్​ టీం
కాగా, ఫోన్​ ట్యాంపరింగ్​కోసం కొనుగోలు చేసిన డివైజ్​లపై విచారణ చేసేందుకు పోలీసులు నిర్ణయం తీసుకున్నారు. ఇజ్రాయిల్​ నుంచి కొనుగోలు చేయగా.. దర్యాప్తు చేస్తున్న సిట్​లో ఒక ప్రత్యేక బృందం బ్రెజిల్​కు వెళ్లేందుకు రెడీ అవుతున్నది. అక్కడ పరికరాలు కొనుగోలు, అనుమతి పత్రాలు, ఎలా తీసుకువచ్చారు, అందుకు ఎవరెవరు సహకరించారనే వివరాలపై ప్రత్యేక బృందం కూపీ లాగనున్నది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular