Tuesday, May 7, 2024

స్పీకర్ ఫార్మాట్ లో సిద్దమా 

హరీష్ రావుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కౌంటర్

టీఎస్, న్యూస్ : మాజీ మంత్రి హరీష్ రావు సవాల్ కు సీఎం రేవంత్ రెడ్డి స్పందించారు. మోసం చేయాలనుకునే ప్రతీ సారి హరీష్ కు అమరవీరుల స్థూపం గుర్తొస్తదని అన్నారు . హారీష్ మోసానికి ముసుగు అమరవీరుల స్థూపం అని, ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని ప్రశ్నించారు. చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామా లేఖ అంటున్నాడని, రాజీనామా లేఖ అలా ఉండదని అన్నారు.

హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని, స్పీకర్ ఫార్మాట్ లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు అని సూచించారు. హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని, హరీష్ తెలివి మోకాళ్లలో  కాదు.. అరికాళ్లలోకి జారినట్టుందని, ఇప్పటికీ చెబుతున్నాని, సవాల్ ను ఖచ్చితంగా స్వీకరిస్తున్నామన్నారు. పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, రాజీనామా రెడీగా పెట్టుకోవాలని ప్రతిసవాల్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular