Saturday, April 27, 2024

రాజయ్య యూ టర్న్

  • రాజయ్య యూ టర్న్
  • మళ్లీ గూలాబీ గూటికి చేరాలని నిర్ణయం
  • వరంగల్ బీఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేసే అవకాశం

టీఎస్​, న్యూస్​:రాష్ట్ర రాజకీయాల్లో సంచలన పరిణమాలు చోటుచేసుకుంటున్నాయి. పార్టీ నేతల జంపింగ్ లు చూస్తుంటే ప్రస్తుతం ఐపీఎల్ తరహాలో క్షణక్షణం ఆసక్తిని కలిగిస్తున్నాయి. ఒకరు ఇటువైపు జంప్ చేస్తో….మరొకరు మరో పార్టీలోకి జంప్ చేస్తున్నారు. దీంతో పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్ల ఘట్టం ప్రారంభమయ్యే సమయానికి ఎవరు…ఏ పార్టీలో ఉంటారో తెలియని ఆమోమయ పరిస్థితులు కనిపిస్తున్నాయి. వరంగల్ బీఆర్ఎస్ ఎంపీగా బరిలోకి దిగిన కడియం కావ్య ఎవరూ ఊహించని విధంగా గురువారం రాత్రి బరిలోకి తప్పుకుంటున్నట్లు ప్రకటన చేశారు. తన తండ్రి అయిన మాజీ మంత్రి కడియం శ్రీహరితో కలిసి ఆమె కాంగ్రెస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. ఆ పార్టీ అభ్యర్ధిగా వరంగల్ లోక్ సభ స్థానం నుంచి కడియం కావ్య బరిలోకి దిగనున్నారు. దీంతో కడియం శ్రీహరికి రాజకీయాల్లో స్థానికంగా బద్ధశతృవైన తాటికొండ రాజయ్య తిరిగి బీఆర్ఎస్ గూటికి చేరనున్నారని తెలుస్తోంది. అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీఆర్ఎస్ నుంచి తాను ప్రాతినిథ్యం వహిస్తున్న స్టేషన్ ఘన్ పూర్ నుంచి పోటీ చేయాలని చివరి నిమిషం వరకు యత్నించారు. కానీ కేసీఆర్ కడియం శ్రీహరికి అవకాశం కల్పించారు.

దీంతో తీవ్ర అసంతృప్తికి లోనయిన రాజయ్య బీఆర్ఎస్ కు గుడ్ బై చెప్పారు. అయితే కడియం శ్రీహరి కాంగ్రెస్ లోకి వస్తుండడంతో రాజయ్య గూలాబీ గూటికి చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారని తెలుస్తోంది. గులాబీ పార్టీ కూడా ప్రస్తుతం వరంగల్ అభ్యర్ధి వేటలో పడింది. ఈ నేపథ్యంలో మాజీ మంత్రి, మాజీ డిప్యూటీ మంత్రిగా పనిచేసిన రాజయ్యను బరిలోకి దింపాలని గులాబీ బాస్ కేసీఆర్ కూడా భావిస్తున్నారని తెలుస్తోంది. ఇందులో భాగంగానే కేసీఆర్ నుంచి ఆయనకు పిలుపు కూడా వెళ్లినట్లుగా తెలుస్తోంది. ఒకటి, రెండు రోజుల్లోనే రాజయ్య కేసీఆర్ ను కలిసి వరంగల్ స్థానం నుంచి పోటీ చేయనున్నారని తెలుస్తోంది. ఈ మేరకు బీఆర్ఎస్ పార్టీకి చేసిన రాజీనామాను ఉపసంహరించుకోబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే రాజయ్యతో హైదరాబాద్ నుంచి బీఆర్ఎస్ నేతలు ఆయనతో మంతనాలు జరుపున్నట్లుగా సమాచారం.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular