Saturday, April 27, 2024

టిల్లు స్క్వేర్ క్రేమ్‌ ఫన్‌ రిలీఫ్‌

కోట్లాదిమంది యంగ్ స్టర్స్ ఎంతో ఈగర్ గా.. ఆశగా వెయిట్ చేసిన టిల్లు స్క్వేర్ సినిమా కొద్దిసేపటికి క్రితమే థియేటర్స్ లో రిలీజ్ అయింది.మొదటి నుంచి అనుకున్నట్టే ఈ సినిమాపై జనాలు ఏ రేంజ్ లో ఎక్స్‌పెక్టేషన్స్‌ పెట్టుకున్నారో అందరికీ తెలిసిందే.అంతకు డబుల్ రేంజ్ లో నాటినెస్ రొమాన్స్ సినిమాలో ఉండేలా చేశాడు డైరెక్టర్ రామ్.అంతేకాదు ఈ సినిమాకి హైలెట్ పెర్ఫార్మెన్స్ అనుపమది అనే చెప్పాలి .. రాధిక క్యారెక్టర్ లో నటించడం కాదు జీవించేసింది.

డీజే టిల్లు సినిమాలో నేహా శెట్టి నటించిన రాధిక కంటే ఈ రాధిక టూ హాట్ గా టు సెక్సీగా కూడా ఉంది అంటూ కుర్రాళ్ళు నాటి కామెంట్స్ చేస్తున్నారు.ఇప్పటివరకు అనుపమ తన కెరీర్ లో చేసిన పాత్రలన్నీ ఒక ఎత్తు .. ఈ సినిమాలో చేసిన పాత్ర మాత్రమే మరొక ఎత్తు అని చెప్పడంలో ఆశ్చర్యం లేదు . ఆ బోల్డ్ రొమాన్స్ లిప్ లాక్స్.. వామ్మో చూస్తే అనుపమ ఫ్యాన్స్ కు కడుపు రగిలి పోవాల్సిందే .

సిద్దు జొన్నలగడ్డ కూడా తన నటనను ఏమాత్రం తగ్గనీకుండా డీజె టిల్లు సినిమాలో ఎలా నటించాడో.. అంతకు డబల్ రేంజ్ లో ఈ సినిమాలో నటించాడు.కేవలం ఆయన ఇచ్చిన పాత్రకు ఆయన న్యాయం చేయడానికి ఇలా నటించాడు అని స్క్రీన్ పై ఆయన పెర్ఫార్మన్స్ చూస్తున్న ప్రతి ఒక్కరు అర్థం చేసుకోవచ్చు.. భారీ ఎక్స్‌పెక్టేషన్స్ తో నాగవంశీ నిర్మించిన టిల్లు స్క్వేర్ సినిమా పాజిటివ్ టాక్ దక్కించుకుంది అని చెప్పవచ్చు. ఇక డైలాగ్స్‌ విషయానికి వస్తే….టిల్లు నోటి నుంచి వచ్చే ఒక్కో డైలాగ్‌ థయేటర్‌లో ఒక్కో బాంబులా పేలాయి. పంచ్‌ డైలాగులకు నవ్వని ప్రేక్షకుడు లేడు. థియేటర్‌లో టిల్లు మ్యానరిజమ్స్‌ అండ్‌ డైలాగ్స్‌కి ప్రతి ఒక్కరూ ఫ్యాన్స్‌ అయిపోయారని చెప్పవచ్చు.ఒక్క ముక్కలో చెప్పాలంటే టిల్లు స్క్వేర్ ఫుల్‌ డబుల్‌ ఎంటర్‌టైన్మెంట్‌లా ఉంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular