Thursday, May 9, 2024

పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదు..

  • పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదు..
  • సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదు
  • రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బిఆర్‌ఎస్ ప్రభుత్వం
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం పదేళ్లు అధికారంలోకి ఉన్నా బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలేనని ఆయన ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనేని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కెటిఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసి ఉంటే వారికి ఈ పరిస్థితి రాదని మంత్రి ప్రశ్నించారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. 2004 సంవత్సరం నుంచి -2014ల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా తన నియోజకవర్గంలోని సిరిసిల్ల నేతన్నలకు అనేక కార్యక్రమాలు చేపట్టానని ఆయన తెలిపారు.

ఆనాడు మహిళలకు, చేనేత కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 35 కిలోల బియ్యం ఇచ్చే 12 వేల అంత్యోదయ కార్డులను అందచేశామన్నారు. 2014లో తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశిస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 35 కిలోల బియ్యం ఇచ్చే ఆ కార్డులను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు చనిపోవడానికి కారణం నాలుగు నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమా లేక గత ప్రభుత్వమా అన్నది నేతన్నలకు తెలుసనీ ఆయన డిమాండ్ చేశారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular