Saturday, April 27, 2024
Home Blog Page 2

‘సి.డి’ ట్రైలర్‌తో భయపెడుతున్న అదా శర్మ

0

అదా శర్మ ప్రస్తుతం పాన్ ఇండియన్ నటిగా ఫుల్ ఫేమస్ అయ్యారు. వరుస బ్లాక్ బస్టర్ హిట్లతో అదా శర్మ నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్‌లతో ఆడియెన్స్‌ ముందుకు వచ్చి అందరినీ మెప్పిస్తున్నారు. హారర్, యాక్షన్, ఎమోషన్ ఇలా అన్ని రకాల కాన్సెప్ట్‌లతో అదా శర్మ ప్రయోగాలు చేస్తున్నారు. ఇక చాలా గ్యాప్ తరువాత అదా శర్మ తెలుగులో ఓ స్ట్రెయిట్ సినిమాను చేస్తున్నారు. ప్రస్తుతం తెలుగు ప్రేక్షకుల ముందుకు అదా శర్మ ‘సి.డి. క్రిమినల్ ఆర్ డెవిల్’ అనే సినిమాతో రాబోతున్నారు.

ది కేర‌ళ స్టోరీ మూవీతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న అదా శర్మ ఈ సినిమాలో లీడ్ రోల్ పోషిస్తుండటం విశేషం. సి.డి. అనే టైటిల్‌తో రూపొందుతున్న ఈ సినిమాకు కృష్ణ అన్నం దర్శకత్వం వహిస్తున్నారు. ఎస్‌ఎస్‌సిఎమ్‌ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కిన ఈ మూవీకి గిరిధర్ ఎగ్జిగూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ఆర్‌ఆర్‌ ధృవన్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. మే 10న చిత్రాన్ని విడుదల చేయనున్నారు. ఈ క్రమంలోనే చిత్ర ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘చీకటి, వెలుతురు మధ్య కనిపించని శత్రువు ఎవరో ఉన్నారు.. ఎవరు చేస్తున్నారు ఇదంతా?.. నా చుట్టూ ఏదో జరుగుతోంది.. నాతో పాటు ఇంట్లో ఉంటోంది దెయ్యమా?.. మరణంతో పాటు యుద్దం తప్పదా?.. నన్ను చంపడానికి వచ్చింది ఎవరు క్రిమినల్? ఆర్ డెవిల్?’ అంటూ హీరో విశ్వంత్ వాయిస్ ఓవర్‌తో ట్రైలర్ సాగుతుంది.

ప్రపంచవ్యాప్తంగా ‘హరోం హర’ థియేట్రికల్ రిలీజ్

0

సుధీర్‌బాబుకు తన మామగారు సూపర్‌స్టార్ కృష్ణ అంటే చాలా గౌరవం. కృష్ణ పుట్టినరోజు నాడు తన సినిమాల కంటెంట్ ఏదైనా విడుదల చేస్తుంటారు. ఈసారి తన అప్ కమింగ్ మూవీ ‘హరోం హర’ చిత్రాన్ని ఇండియన్ ఫస్ట్ సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మే 31న విడుదల చేయనున్నట్లు యూనిట్ అనౌన్స్ చేసింది. ఇది పర్ఫెక్ట్ డేట్. వేసవి సెలవుల దృష్ట్యా జూన్ రెండవ వారంలో పాఠశాలలు, కళాశాలలు తిరిగి తెరవడానికి కొన్ని వారాల కంటే ఎక్కువ సమయం ఉంటుంది. రిలీజ్ డేట్ పోస్టర్ పోస్టర్‌లో సుధీర్ బాబు చేతిలో వేలాయుధం ఉంది, అతని వెనుక ఉన్న వ్యక్తులు గౌరవ సూచకంగా చేతులు ఊపుతున్నారు.

సూపర్ బాబు ఫెరోషియస్ గా కనిపిస్తున్న పోస్టర్ అదిరిపోయింది. ఎస్‌ఎస్‌సి (శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర సినిమాస్) బ్యానర్‌పై సుమంత్ జి నాయుడు నిర్మిస్తున్న యాక్షన్ థ్రిల్లర్‌కు సెహరి ఫేమ్ జ్ఞానసాగర్ ద్వారక దర్శకత్వం వహిస్తున్నారు. మాళవిక శర్మ కథానాయికగా నటిస్తుండగా, సునీల్ కీలక పాత్రలో కనిపించనున్నాడు. హరోం హర 1989లో చిత్తూరు జిల్లా కుప్పం నేపథ్యంలో సాగే పీరియాడికల్ ఫిల్మ్. ఈ సినిమా కోసం కంప్లీట్ గా మేకోవరైన సుధీర్ బాబు కుప్పం స్లాంగ్‌లో డైలాగులు చెప్పనున్నారు. ది రివోల్ట్ అనేది సినిమా ట్యాగ్‌లైన్. టీజర్, పాటలకు ట్రెమండస్ రెస్పాన్స్ వచ్చింది.

ప్రీలాంచ్ పేరుతో మోసం..!

0
* ప్రీలాంచ్ పేరుతో మోసం..!
* ప్రజల సొమ్ముతో రియల్ దందా..?
* అపార్ట్‌మెంట్‌లు కడతాం డబ్బులు అప్పుగా ఇవ్వాలని ఓ రియల్ సంస్థ మోసం
* డబ్బులిచ్చిన వారికి ఎంఓయూ
* కూకట్‌పల్లిలో నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థ దగా..
* హెచ్‌ఎండిఏ, రెరా అనుమతి లేకున్నా
* ప్రజలను బురిడీ కొట్టిస్తున్న సంస్థ

మహారాష్ట్ర, ఢిల్లీ, యూపీ, హర్యానా వంటి రాష్ట్రాల్లో రెరా అంటే అక్కడి బిల్డర్లు భయపడతారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహారిస్తే ఎంత పెద్ద బిల్డర్ అయినా అక్కడి రెరా ముక్కుపిండి జరిమానాను వసూలు చేస్తుంది. కానీ, మన రాష్ట్రంలో ప్రీలాంచ్‌లు చేయవద్దని హెచ్చరికలు జారీ చేసినా కొందరు బిల్డర్‌లు దానిని పట్టించుకోవడం లేదు. తాజాగా కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ పేరుతో ఒక ప్రీలాంచ్ బిల్డర్ సరికొత్త మోసానికి తెర లేపాడు. కొననుగోలు దారుల నుంచి అప్పు కింద ఫ్లాటుకు అయ్యే సొమ్మును బిల్డర్ తీసుకుంటున్నాడు. రెండేళ్ల తర్వాత ఆరు శాతం వడ్డీ చొప్పున కొనుగోలు దారుడికి వెనక్కి ఇచ్చేస్తానని, ఒకవేళ, కొనుగోలుదారుడు ఆ సొమ్మును వద్దంటే అదే సొమ్ముకు తగ్గ ఫ్లాటును రాసిస్తానని నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ యాజమాన్యం బయ్యర్లకు ఎంఓయూ రాసిస్తోంది. ప్రస్తుతం నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థకు హెచ్‌ఎండిఏ అనుమతి లేదు. రెరా పర్మిషన్ లేదు. అయినా, బయ్యర్ల నుంచి వంద శాతం సొమ్మును వసూలు చేయడానికి నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ సంస్థ ఆసక్తి చూపుతోంది. చదరపు అడుగుకు రూ.4,700లనే ఈ సంస్థ పేర్కొంటుంది. కేవలం స్థలం కొనడానికే ఇలా ప్రజల నుంచి ఈ సంస్థ కోట్ల రూపాయలను వసూలు చేస్తే ఆకాశహర్మ్యాలను ఎలా కడతాడరన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది.

రూ.2500 కోట్ల వసూలు?

నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ అనే ప్రాజెక్టును కూకట్‌పల్లిలోని ఐడీఎల్ చెరువు వద్ద సర్వే నెంబర్ 10, 11లో 19.12 ఎకరాల్లో నిర్మిస్తానని ప్రజలను మభ్యపెడుతోంది. ఇందులో మొత్తం పధ్నాలుగు టవర్లతో పాటు ఇరవై వేల ఫ్లాట్లను నిర్మిస్తామని పేర్కొంటుంది. దీనికోసం అందమైన బ్రోచర్‌ను నిర్మిస్తోంది. ఇప్పటికే ఫ్రీలాంచ్‌ను ప్రారంభించిన ఈ సంస్థ సుమారు రెండువేల ఐదు వందల కోట్లను వసూలు చేసేలా పక్కా ప్రణాళికతో ముందుకెళుతోంది.

ఇద్దరి మధ్య అండర్‌స్టాండింగ్..?

నార్త్ ఈస్ట్ హ్యాబిటేషన్ ప్రీలాంచ్ ప్రకటన చూసి కొందరు ఔత్సాహిక కొనుగోలుదారులు రియల్ సంస్థను సంప్రదించారు. ఆ సంస్థ ఎగ్జిక్యూటివ్ ఒక మెమోరాండం ఆఫ్ అండర్ స్టాండింగ్‌ను బయ్యర్లకు పంపించారు. అందులో ఆ సంస్థ యజమాని ఈ అవగాహన పత్రం మీద సంతకం పెడుతున్నారు. ఫ్రీలాంచ్‌లో ప్లాట్‌లను కొనేవారు సదరు యజమానికి అప్పు కింద సొమ్ము ఇస్తున్నాడని ఈ ఎంఓయూలో రాసుకుంటున్నారు. ఇలా సొమ్ము ఇచ్చినందుకు గాను రెండు సంవత్సరాల తర్వాత సదరు బిల్డర్ ఆయా మొత్తం మీద ఆరు శాతం వడ్డీతో సొమ్మును వెనక్కి ఇచ్చేస్తాడని అందులో రాసి ఉంది. లే

పుష్పక్ బస్సుల సమయంలో స్వల్పమార్పులు

0

హైదరాబాద్‌లోని వివిధ ప్రాంతాల నుంచి రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టుకు నడిచే పుష్పక్ బస్సుల సమయంలో ఆర్టీసి స్వల్పమార్పులను చేసింది. పుష్పక్ పేరుతో ప్రతి 15 నిమిషాలకు ఒక ఎసి బస్సును ఎయిర్ పోర్టుకు ఆర్టీసి నడుపుతోంది. నగరంలోని ప్రధాన ప్రాంతాలను కలుపుతూ అనేక ప్రదేశాల్లో ప్రయాణికులను ఎయిర్‌పోర్టుకు చేర్చుతున్నాయి. అయితే ఈ బస్సులను నడిపే రూట్‌లలో ఆర్టీసి స్వల్ప మార్పులు చేసింది. అందులో భాగంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి ఎయిర్‌పోర్టు వెళ్లే మార్గంలో స్వల్ప మార్పులు చేసింది.

మెహిదీపట్నం నుంచి పివిఎన్‌ఆర్ ఎక్స్‌ప్రెస్ మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే బస్సులను ఫ్లైవర్ కింద రోడ్డుపై నుంచి మళ్లీంచింది. శుక్రవారం నుంచి ఈ సర్వీసులు ప్రారంభమవుతాయని ఆర్టీసి ఉన్నతాధికారులు తెలిపారు. 49 పుష్పక్ ఎసి బస్సులను నాలుగు రూట్లలో 24 గంటలు ప్రయాణికులకు అందుబాటులో ఉండేలా ఆర్టీసి నడుపుతోంది. ఎయిర్ పోర్టుకు వెళ్లే వారికోసం నెలవారి బస్ పాసులను కూడా అందిస్తోంది. మియాపూర్ ఎక్స్ రోడ్డు, జేబిఎస్, సికింద్రాబాద్ నుంచి పుష్పక్ ఎసి బస్సులను ఆర్టీసి నడుపుతోంది.

నేటి నుంచి రెండు నుంచి మూడు డిగ్రీలకు పెరగనున్న ఉష్ణోగ్రతలు

0

రాష్ట్రంలో ఎండలు భగభగమంటున్నాయి. ఈ క్రమంలోనే ప్రస్తుత ఉష్ణోగ్రతల కంటే రెండు నుంచి మూడు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరిగే అవకాశం ఉందని, దాంతో పాటు మూడు రోజుల పాటు అక్కడక్కడ వడగాల్పులు వీచే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ హెచ్చరించింది. పొడి వాతావరణం కారణంగా ఉష్ణోగ్రతలు పెరుగుతున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. పగటి ఉష్ణోగ్రతలు విపరీతంగా పెరగటంతో ఉదయం 11 గంటల నుంచి 3 గంటల వరకు అవసరమైతే తప్ప బయటకు రాకూడదని వాతావరణ శాఖ పేర్కొంది. ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం 3 వరకు ఎండలు మండుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు అత్యవసర పనులుంటేనే ప్రజలు బయటకు వెళ్లాలని ఐఎండీ సూచించింది. 2015, 2016 సంవత్సరాల్లో రాష్ట్రంలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. అప్పుడు ఆ ఎండల తీవ్రతకు చాలా మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం ఎండలు అప్పటి కాలాన్ని గుర్తు చేస్తున్నాయని, మళ్లీ ప్రజలు మృత్యువాత పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని ప్రభుత్వం హెచ్చరిస్తోంది.

పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదు..

0
  • పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదు..
  • సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదు
  • రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం బిఆర్‌ఎస్ ప్రభుత్వం
  • రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్

పార్టీ ఏదైనా శవ రాజకీయాలు చేయడం సరికాదని రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. గాంధీభవన్‌లో శుక్రవారం ఆయన టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడుతూ సిరిసిల్లకు క్లస్టర్ అడిగితే కేంద్రం ఇవ్వలేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో వస్త్ర పరిశ్రమ సంక్షోభానికి కారణం పదేళ్లు అధికారంలోకి ఉన్నా బిజెపి, బిఆర్‌ఎస్ పార్టీలేనని ఆయన ఆరోపించారు. చేనేతపై జీఎస్టీ వేసిన ఏకైక ప్రధాని మోడీనేని ఆయన అసహనం వ్యక్తం చేశారు. మాజీ మంత్రి కెటిఆర్ సిరిసిల్ల కార్మికుల జీవితాలను నిజంగా బాగు చేసి ఉంటే వారికి ఈ పరిస్థితి రాదని మంత్రి ప్రశ్నించారు. సిరిసిల్ల బ్రాండ్ ఇమేజ్‌ను దెబ్బ తీయద్దని ఈ సందర్భంగా మంత్రి విజ్ఞప్తి చేశారు. చేనేత కార్మికులు ఎవరూ అధైర్య పడొద్దని, ఆత్మహత్యలు చేసుకోవద్దని, సిరిసిల్ల వస్త్ర పరిశ్రమను ఆదుకునేందుకు కాంగ్రెస్ ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి భరోసా ఇచ్చారు. 2004 సంవత్సరం నుంచి -2014ల మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో తాను పార్లమెంట్ సభ్యుడిగా తన నియోజకవర్గంలోని సిరిసిల్ల నేతన్నలకు అనేక కార్యక్రమాలు చేపట్టానని ఆయన తెలిపారు.

ఆనాడు మహిళలకు, చేనేత కార్మికుల ఆరోగ్యానికి సంబంధించిన అనేక కార్యక్రమాలు చేపట్టామన్నారు. 35 కిలోల బియ్యం ఇచ్చే 12 వేల అంత్యోదయ కార్డులను అందచేశామన్నారు. 2014లో తెలంగాణ వస్తే తమ జీవితాలు బాగుపడతాయని ఆశిస్తే పెనం నుంచి పొయ్యిలో పడ్డట్టు అయ్యిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. 35 కిలోల బియ్యం ఇచ్చే ఆ కార్డులను గత ప్రభుత్వం రద్దు చేసిందని ఆయన ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు చనిపోవడానికి కారణం నాలుగు నెలల క్రితం ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వమా లేక గత ప్రభుత్వమా అన్నది నేతన్నలకు తెలుసనీ ఆయన డిమాండ్ చేశారు.

హరీష్ రావు తెలివి మోకాళ్లలో లేదు… అరికాళ్లలోకి జారినట్టుంది

  • హరీష్ రావు తెలివి మోకాళ్లలో లేదు…
  • అరికాళ్లలోకి జారినట్టుంది
  • స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదు
  • మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుంది
  • సిఎం రేవంత్‌రెడ్డి ఆగ్రహం

హరీష్ రావు తెలివి మోకాళ్లలో కాదు, అరికాళ్లలోకి జారినట్టుందని సిఎం రేవంత్‌రెడ్డి ఎద్దేవా చేశారు. హరీష్‌రావు చాంతాడంత లేఖ రాసుకొచ్చి రాజీనామ లేఖ అంటున్నారని, కానీ, స్పీకర్ ఫార్మాట్‌లో లేకుంటే రాజీనామా లేఖ చెల్లదని, హరీష్ రావు తెలివి ప్రదర్శిస్తున్నారని సిఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మోసం చేయాలనుకునే ప్రతిసారి హరీష్ రావుకు అమరవీరుల స్థూపం గుర్తొస్తుందని, వారి మోసానికి ముసుగు అమరవీరుల స్థూపమన్నారు. ఇన్నాళ్లు ఎప్పుడైనా అమరుల స్థూపం దగ్గరకు వెళ్లారా? అని రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. హరీష్ తన మామ చెప్పిన సీస పద్యమంతా లేఖలో రాసుకొచ్చారని సిఎం రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికీ చెబుతున్నా, నీ సవాల్‌ను కచ్చితంగా స్వీకరిస్తున్నా హరీష్‌రావు, పంద్రాగస్టులోగా రూ.2లక్షల రైతు రుణమాఫీ చేసి తీరుతామని, నీ రాజీనామా రెడీగా పెట్టుకోమని హరీష్ రావుకు రేవంత్ గట్టి కౌంటర్ ఇచ్చారు. హరీష్‌రావు రాజీనామాతో ఆగస్టు 15వ తేదీన సిద్దిపేటకు పట్టిన శని వదులుతుందని అన్నారు. రైతుల రుణమాఫీకి సంబంధించి రూ.3,0-40 వేల కోట్లు ఖర్చు చేసేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆయన తెలిపారు. జూబ్లీహిల్స్‌లోని తన నివాసంలో శుక్రవారం ఏర్పాటు చేసిన సామాజిక మీడియా సమ్మేళనం సమావేశంలో రేవంత్ రెడ్డి పాల్గొని మాట్లాడారు.

ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటాం: మంత్రి కోమటిరెడ్డి

మాజీ మంత్రి హరీష్ రావుపై ఆర్ అండ్ బి శాఖ మంత్రి కోమటిరెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్‌లో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ . సిఎం రేవంత్ రెడ్డికి సవాల్ విసిరానని హరీష్ రావు గొప్పలు చెప్పుకుంటున్నారని కోమటిరెడ్డి ఫైర్ అయ్యారు. కాంగ్రెస్ ను విమర్శించడం బిఆర్‌ఎస్ నేతలు మానుకోవాలని ఆయన హితవు పలికారు. ఆగస్టు 15న రుణమాఫీ హామీ నిలబెట్టుకుంటామని ఆయన ధీమా వ్యక్తం చేశారు. దళితులకు మూడెకరాల పేరుతో కెసిఆర్ మోసగించారన్నారు. ఉపాధి హామీ కూలీలకు కనీసం వంద రోజుల ఉపాధి కల్పించలేదన్నారు. ఎమ్మెల్యే పదవి వదులుకునేందుకు హరీష్ రావు భయపడుతన్నారన్నారు. గతంలో తాను మంత్రి పదవిని తృణప్రాయంగా వదులకున్నానని కోమటిరెడ్డి గుర్తు చేశారు. మెదక్‌లో బిఆర్‌ఎస్ కనీసం డిపాజిట్ దక్కించుకోవాలన్నారు. అధికారంలో ఉన్నప్పుడు కెసిఆర్ ఫాంహౌజ్‌లో నుంచి బయటకు రాలేదని మంత్రి కోమటిరెడ్డిగుర్తు చేశారు. ఇప్పుడు కర్రపట్టుకుని కెసిఆర్ బయటకు వస్తున్నారన్నారు. సచివాలయానికి రేవంత్ రెడ్డి వచ్చిన దాంట్లో పది శాతం కూడా కెసిఆర్ రాలేదన్నారు.

కెసిఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్ లేదు

మూడు నెలల్లో రేవంత్ రెడ్డి 60 సార్లు సచివాలయానికి వచ్చారని మంత్రి కోమటిరెడ్డి తెలిపారు. అపాయింట్‌మెంట్లు లేకుండానే సిఎం రేవంత్ రెడ్డిని కలుస్తున్నారని, కెసిఆర్ పాలనలో హోంమంత్రికి కూడా అపాయింట్‌మెంట్ లేదన్నారు. పార్టీ మూతపడే స్థితికి వచ్చినందున ఎక్కడికి వెళ్లాలో వారికి అర్థం కావడం లేదన్నారు. రైతులపై ప్రేమ ఉన్నట్లు హరీష్ రావు నాటకాలాడుతున్నారని కోమటిరెడ్డి అన్నారు. రాజీనామా పత్రం ఒకటిన్నర లైన్ మాత్రమే ఉండాలని, హరీష్ రావు రాజీనామా పత్రాన్ని ఒకటిన్నర పేజీ రాశారని మంత్రి కోమటిరెడ్డి ఎద్దేవా చేశారు. టిఆర్‌ఎస్ అధికారంలోకి వస్తే తొలి సిఎం దళితుడని నాడు కెసిఆర్ చెప్పారని.. దళితుడిని సిఎం చేయకపోతే మెడపై తల ఉండదని గొప్పలు చెప్పారన్నారు. పరిపాలన అనుభవం ఉండాలని తొలిసారి కెసిఆర్ సిఎంగా ఉండాలన్నారని, రెండోసారి బిఆర్‌ఎస్ వచ్చినా దళితుడిని సిఎం చేయలేదన్నారు. ఇప్పటికి 40 కోట్ల మంది మహిళలు ఆర్టీసిలో ఉచిత ప్రయాణం చేశారని మంత్రి కోమటిరెడ్డి పేర్కొన్నారు.. మార్చి 1న జీరో విద్యుత్ బిల్లు వచ్చిందో లేదో తెలుసుకోవాలన్నారు. అధికారం పోగానే కెసిఆర్ పిచ్చినపట్టినట్లు మాట్లాడుతున్నారని మంత్రి కోమటిరెడ్డి మండిపడ్డారు.

అమరవీరుల స్థూపాన్ని హరీష్‌రావు మలినం చేశారు: ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్

తెలంగాణ ఉద్యమ సమయంలో విద్యార్థుల మరణాలకు కారణమైన మాజీ మంత్రి, బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు అమరవీరుల స్థూపం వద్దకు వచ్చి మలినం చేశారని ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ విమర్శించారు. హరీష్ రావు అమరుల స్తూపాన్ని అపవిత్రం చేశారని ఆయన ఆరోపించారు. ఆగస్టు 15 లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట ఇచ్చారని ఆయన అన్నారు. రుణమాఫీ అమలు చేస్తే బిఆర్‌ఎస్ పార్టీని రద్దు చేస్తారా అని సవాల్ విసిరితే హరీష్ రావు తన రాజీనామాతో కొత్త డ్రామాకు తెర తీశారని బల్మూరి మండిపడ్డారు. రూ. 2లక్షల రుణమాఫీకి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు ఆగస్టు 15వ తేదీ లోపు ఇచ్చిన మాట ప్రకారం హామీని నెరవేరుస్తామని ఆయన చెప్పారు. తాను బాధ్యత తీసుకొని హరీష్ రావు రాజీనామాను ఆమోదించేలా చూస్తానని బల్మూరి వెంకట్ తెలిపారు.

నక్కవేషాలు మానుకోండి: అద్దంకి దయాకర్

రైతులకు రైతుబంధు రాకుండా చేసిందే హారీష్ రావు అని, నువ్వు నీ పొలిటికల్ డ్రామాలు ఆపాలని టిపిసిసి ప్రధాన కార్యదర్శి అద్దంకి దయాకర్ అన్నారు. హరీష్ రావు రాజీనామా లేఖను తీసుకొని అమరవీరుల స్థూపం వద్దకు రావడంపై ఆయన మండిపడ్డారు. హరీష్ రావుని తన మామ పట్టించుకోవడం లేదా? ఆయన బామ్మర్ధి పక్కన పెట్టారా? లేకపోతే ఆయన రాజకీయ అస్థిత్వమే ప్రమాదంలో పడిందా? తెలియడం లేదని, రైతులకు రైతుబంధు రాకుండా నిలవరించిన నువ్వు పొలిటికల్ డ్రామాలు ఆపాలని అద్దంకి హెచ్చరించారు. అధికారంలో ఉన్నప్పుడు లక్షల కోట్లు దోచి, ఖజానా ఖాళీ చేసి నంగనాచి మాటలు మాట్లాడుతున్న హరీష్ రావుకు ప్రజలే బుద్ది చెబుతారని ఆయన మండిపడ్డారు. రైతులను జైళ్లలో పెట్టిన మీరా రైతుల గురించి మాట్లాడేది అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. గతంలో రైతు రుణమాఫీ చేసింది, రైతులకు పంటనష్టం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని, ఆగస్టు 15 లోపు రుణ మాఫీ కూడా చేస్తామని, మీ నక్కవేషాలు ఇకనైనా మానుకోవాలని అద్దంకి దయాకర్ హెచ్చరించారు.

ఎమ్మెల్యే కాకున్నా.. నిన్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్‌ది{ కాంగ్రెస్ నేత బండి సుధాకర్ గౌడ్
నువ్వు ఎమ్మెల్యే కాకున్నా నిన్ను మంత్రిని చేసిన చరిత్ర కాంగ్రెస్ పార్టీదన్న విషయం హరీష్ రావు గుర్తుంచుకోవాలని కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి బండి సుధాకర్ గౌడ్ హితవు పలికారు. గతాన్ని అప్పుడే మరిచిపోయావా హరీశ్? అని ఆయన ప్రశ్నించారు. ఉద్యమ సమయంలో తెలంగాణ యువతను రెచ్చగొట్టేందుకు మీద పెట్రోల్ పోసుకొని, అగ్గిపెట్టె మరిచిపోయిన చరిత్ర హరీశ్ రావుదని ఆయన దుయ్యబట్టారు. టిఆర్‌ఎస్ నాయకులు రెచ్చగొట్టడంతోనే 1200 మంది అమరులయ్యారని, అందులో కేవలం 400 మందిని మాత్రమే ఆదుకొని, మిగతా 800 మందిని విస్మరించిన చరిత్ర బిఆర్‌ఎస్ ప్రభుత్వానిదని బండి సుధాకర్ విమర్శించారు.

అమరుల త్యాగాల పునాదుల మీద రాజ్యమేలి రాక్షసానందం పొందిన మీకు అమరవీరుల స్థూపం వద్ద రాజీనామా డ్రామాలాడే నైతిక హక్కు లేదని బండి హెచ్చరించారు. ఇచ్చిన మాట ప్రకారం కాంగ్రెస్ పార్టీ 17 వేల కోట్ల రూపాయల మిగులు బడ్జెట్ తో తెలంగాణ ఏర్పాటు చేస్తే, బంధుప్రీతితో కొత్త రాష్ట్రాన్ని దోచుకొని అప్పుల కుప్పగా చేసింది కల్వకుంట్ల కుటుంబం కాదా? అని బండి సుధాకర్ ప్రశ్నించారు. కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారెంటీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తుంటే ఓర్వలేని బిఆర్‌ఎస్ నాయకులు రుణమాఫీ విషయంలో బద్నాం చేస్తున్నారని ఆయన విమర్శించారు. బిఆర్‌ఎస్ గెలవకపోతే మీ పార్టీని రద్దు చేసుకుంటారా? అని ఆయన ప్రశ్నించారు.

తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టాం

0
  • తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టాం
  • రెండు రోజులుగా ఇదే జరుగుతోంది
  • ఏఐసిసి నిర్ణయాల మేరకే నడుచుకుంటాం
  • టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి

తెలంగాణలో ఘర్ వాపసీ మొదలు పెట్టామని, రెండు రోజులుగా ఇదే జరుగుతోందని టిపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్, చేరికల కమిటీ సభ్యుడు జగ్గారెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం ఆయన గాంధీభవన్‌లో మీడియాతో మాట్లాడుతూ చాలా మంది నాయకులు కాంగ్రెస్‌లోకి వస్తున్నారని, సంబాని చంద్రశేఖర్‌లాంటి వాళ్లు కూడా వెనక్కి వచ్చారని ఆయన అన్నారు. ఏఐసిసి నిర్ణయాల మేరకే నడుచుకుంటామని, మనకు పదవులు ఇచ్చిన సోనియాగాంధీ, రాహుల్‌గాంధీల ఆదేశాల మేరకు వ్యవహారిస్తామన్నారు. రాజీవ్ గాంధీని చంపిన వ్యక్తులను క్షమించిన గుణం సోనియాగాంధీ, రాహుల్‌గాంధీ, ప్రియాంకలది ఆయన అన్నారు. మనం వాళ్ల నీడలో రాజకీయంగా బతుకుతున్నామన్నారు. క్షమించే తత్వం ఉన్న కుటుంబం వాళ్లదని ఆయన తెలిపారు.

బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోంది

తనకు వ్యతిరేకంగా పని చేసిన వాళ్ల కూడా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవచ్చని ఆయన అన్నారు. సంగారెడ్డి బిఆర్‌ఎస్ ఎమ్మెల్యే కాంగ్రెస్‌లో చేరుతానంటే చేర్చుకునేందుకు మేం సిద్ధంగా ఉన్నామని ఆయన ప్రకటించారు. వచ్చే ఎన్నికల్లో టికెట్ అడిగితే ఎలా అన్న ప్రశ్నకు కూడా ఇచ్చేయండి అని చెప్పానని ఆయన తెలిపారు. బిజెపి మరోసారి అధికారంలోకి వస్తే కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా మైనార్టీ రిజర్వేషన్లు తీసేస్తామని అంటున్నారని ఆయన మండిపడ్డారు. దేశంలో బిజెపి మతతత్వ రాజకీయాలు చేస్తోందని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. విభజన రాజకీయాలు చేస్తోన్న బిజెపికి ఎన్నికల్లో బుద్ధి చెప్పాలని ఈ సందర్భంగా జగ్గారెడ్డి పిలుపునిచ్చారు&

వెధవ అంటేవెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు

  • పొన్నం తిట్లను దీవెనలుగా భావిస్తా
  • నా లేఖలవల్లే నిధులొచ్చాయని డబ్బా కొట్టుకునే వినోద్ చేసింది శూన్యం
  • కేసీఆర్ అనే నాణేనికి కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు బొమ్మ, బొరుసులాంటోళ్లు
  • చీకటి ఒప్పందాలతో నన్ను ఓడించాలని కుట్ర
  • బండి సంజయ్ వ్యాఖ్యలు

కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ ఎన్నికల్లో ఘోరంగా ఓడిపోతామనే భయంతోనే మంత్రి పొన్నం ప్రభాకర్ తనను వెధవ అంటూ దూషిస్తున్నారని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, బీజేపీ అభ్యర్ధి బండి సంజయ్ కుమార్ వ్యాఖ్యానించారు. పొన్నం తిట్లు దీవెనలుగా భావిస్తున్నానని చెప్పారు. పొన్నం వెధవ అంటే తన ద్రుష్టిలో ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’’ అని అర్ధమని చెప్పారు. ఓడిపోతామని తెలిసి ఓటుకు రూ.వెయ్యి ఇచ్చి గెలవాలని కాంగ్రెస్ అభ్యర్ధి యత్నిస్తున్నారని పేర్కొన్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి 6 గ్యారంటీల అమలు విషయంలో కాంగ్రెస్ చేసిన మోసాలతోపాటు గత పదేళ్ల పాలనలో బీఆర్ఎస్ చేసిన ద్రోహాన్ని వివరించి బీజేపీకి ఓటేయించాలని కోరారు. దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని పిలుపునిచ్చారు. అందులో భాగంగా ఇంటింటికీ పార్టీ పన్నా ప్రముఖ్ లు పోలింగ్ తేదీ నాటికి ప్రతి ఇంటికీ 5 సార్లు వెళ్లి ఓట్లు అభ్యర్ధించడంతోపాటు తమ తమ పోలింగ్ బూత్ పరిధిలో 100 శాతం పోలింగ్ జరిగేలా క్రుషి చేయాలని సూచించారు. నూటికి నూరుశాతం ఓట్లు వేయించే పోలింగ్ బూత్ బాధ్యులను తాను స్వయంగా అభినందించడంతోపాటు సన్మానిస్తానని చెప్పారు. ఈరోజు మధ్యాహ్నం బోయినిపల్లి మండలానికి వచ్చిన బండి సంజయ్ మాజీ ఎమ్మెల్యే బోడిగె శోభతో కలిసి పార్టీ పన్నా ప్రముఖుల సమావేశంలో పాల్గొని ప్రసంగించారు.

ముఖ్యాంశాలు.
దేశమంతా నరేంద్రమోదీ గాలి వీస్తున్న నేపథ్యంలో కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని బీజేపీ కార్యకర్తలంతా తమ తమ పోలింగ్ బూత్ ల పరిధిలోని తటస్థ ఓటర్లతోపాటు కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలను కలిసి ఓట్లు అభ్యర్ధించాలని బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఎంపీ బండి సంజయ్ కుమార్ కోరారు. ఎన్నికల నాటికి ప్రతి కార్యకర్త ఇంటింటికీ మూడు సార్లు వెళ్లి ఎన్నికల ప్రచారం చేయాలని సూచించారు. తద్వారా అత్యధిక మెజారిటీతో గెలవడం ద్వారా కరీంనగర్ ప్రజా తీర్పును దేశానికి చాటి చెప్పి చరిత్ర స్రుష్టిద్దామని చెప్పారు.

మోదీ పాలనలో దేశాభివ్రుద్ది, సంక్షేమ పథకాలను అమలు చేయడంతోపాటు దేశాన్ని పట్టి పీడిస్తున్న సమస్యల పరిష్కారం కోసం విప్లవాత్మక చర్యలు తీసుకున్న ఘనత నరేంద్రమోదీదే. ఈ విషయాలన్నీ ప్రతి ఇంటికి వెళ్లి వివరించాలి. కమిట్ మెంట్ విషయంలో పన్నా ప్రముఖ్ లను మించినోళ్లు లేరు. క్రమశిక్షణతో ప్రతి ఇంటికీ వెళ్లి సంస్కారవంతంగా నమస్కరిస్తూ మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను, బీజేపీ విధానాలను, సిద్ధాంతాలను వివరిస్తూ ఓట్లు అభ్యర్ధించాలి.

మొన్నటి దాకా బోయినిపల్లిలో ఒక కుటుంబం అరాచకంగా వ్యవహరించింది. కొందరు పోలీసులు వారికి వత్తాసు పలికారు. ఇప్పుడు ఆ కుటుంబం పరారీలో ఉంది. వత్తాసు పోలీసుల పరిస్థితి ఇబ్బందిగా మారింది. ఆనాడు బైంసాలో దారుణాలు జరిగినా ఎవరూ పట్టించుకోలేదు. మొన్న చెంగిచర్లలో మహిళలను అవమానించారు. గర్భవతులపై, చిన్నారులపైనా దాడులు చేశారు. కార్యకర్తలెవరూ ఇక భయపడాల్సిన పనిలేదు. ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో వెనుకంజ వేయాల్సిన అవసరం లేదు. మీ అందరికీ నేను అండగా ఉన్నా. కేసీఆర్ పాలనలోనే ఎన్ని బెదిరింపులకు పాల్పడ్డా, కేసులు పెట్టినా, అరెస్ట్ చేసినా భయపడకుండా పోరాడానని, వందల కేసులు నమోదు చేసినా వెనుకంజ వేయలేదు. ప్రజలు పోరాడే వారి పక్షాన ఉంటారనడానికి ఎన్నికల ప్రచారంలో తనకు వస్తున్న మద్దతే ఇందుకు కారణం.

ఎన్నికల ప్రచారంలో బీజేపీ కార్యకర్తలంతా ధైర్యంగా ఇంటింటికీ వెళ్లి ఓట్లడగవచ్చు. ఎందుకంటే రాష్ట్రంలో గత ఐదేళ్లుగా బీజేపీ నాయకులు, తాను చేసిన పోరాటాలను వివరించి గల్లా ఎగరేసుకుని ఓట్లడగండి. కానీ కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు ఏం చేశారని.. ఆయా పార్టీల కార్యకర్తలు ఓట్లు అడుగుతారో చెప్పాలి.

కరీంనగర్ లో కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు ఘోరంగా ఓటమి పాలుకాబోతున్నయ్. ఎందుకంటే కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా మోదీపట్ల సానుకూలంగా ఉన్నారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ కార్యకర్తలు సైతం మోదీపట్ల, బీజేపీపట్ల సానుకూలంగా ఉన్నందున వారిని కలిసి ఓట్లు అభ్యర్ధించాలని కోరారు. ఓడిపోతాననే భయంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఓటుకు రూ.వెయ్యి పంచి గెలవాలని యత్నిస్తున్నరు. బీఆర్ఎస్ అభ్యర్ధి లేఖలు రాయడం, తాను చేసిన అభివ్రుధ్ధితోపాటు తెచ్చిన నిధులను తన ఖాతాలో వేసుకోవడం తప్ప సాధించిందేమీ లేదు.. 10 ఏళ్లు అధికారంలో ఉంటూ కూడా కరీంనగర్ ఆర్వోబీ నిర్మాణానికి నిధులు తీసుకురాలేదు. నేను సేతు బంధన్ స్కీం కింద రూ.154 కోట్లు తెచ్చి ఆర్వోబీని నిర్మిస్తున్న. మన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో జాతీయ రహదారుల విస్తరణ కోసం వేలాది కోట్లు నేను తీసుకొస్తే.. నా లేఖలవల్లే వచ్చాయని చెప్పడం సిగ్గుచేటు. కేసీఆర్ అనే నాణేనికి బొమ్మ, బొరుసులాంటి వాళ్లు ఇక్కుడున్న కాంగ్రెస్, బీఆర్ఎస్ అభ్యర్థులు. ఇద్దరూ కలిసి చీకటి ఒప్పందాలు చేసుకుని నన్ను ఓడించాలని కుట్ర చేస్తున్నారు. అందుకే దొంగ హామీలిస్తూ మోసం చేయాలని చూస్తున్నరు. వడ్లకు బోనస్ ఇవ్వడానికి, తరుగు, తాలుతో సంబంధం లేకుండా వడ్లు కొనడానికే డబ్బులు లేనోళ్లు..రూ. 2 లక్షల రుణమాఫీ పేరుతో రూ.30 లక్షల కోట్లు ఎక్కడి నుండి తీసుకొస్తారు? మోదీ ప్రభుత్వం పొరపాటున అధికారంలోకి రాకపోతే రైతులకు కేంద్రం ఇస్తున్న సబ్సిడీలను ఎత్తివేస్తారు..

మంత్రి పొన్నం ప్రభాకర్ అక్కసుతో తనను వెధవ, రండ అంటూ బూతులు తిడుతున్నారు. ఆయన గురించి పట్టించుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ఆయన వద్దకు పోవాలంటే ఆ పార్టీ కార్యకర్తలే భయపడుతున్నారు. అయినా పొన్నం తిట్లను నేను దీవెనలుగా భావిస్తున్నా. వెధవ అంటే ‘వెయ్యేళ్లు ధనికుడిగా వర్ధిల్లు’ అని భావిస్తున్నా. నేను చేసిన పోరాటాలతో బీజేపీ కార్యకర్తల గల్లా ఎగరేసుకునేలా చేసిన. కరీంనగర్ ప్రజలు వేసిన ఓటుకు విలువ తీసుకొచ్చానే తప్ప ఏనాడూ ఏసీల్లో కూర్చోలే,మీరున్నారనే ధైర్యంతో కేసీఆర్ ఎన్ని ఇబ్బందులు పెట్టినా భయపడలే. దేశంలో ఏ ఎంపీపైనా లేనన్ని కేసులు నాపై పెట్టినా వెనుకంజ వేయకుండా ఫాంహజ్ లో ఉన్న కేసీఆర్ ను గల్లాపట్టి ధర్నా చౌక్ కు గుంజుకొచ్చిన. రాష్ట్ర అధ్యక్షుడిగా ఉన్న నన్ను రెండు సార్లు జైలుకు పంపినా కేసీఆర్ గద్దె దిగే వరకు పోరాడిన చరిత్ర నాది కాబట్టి వాస్తవాలు ప్రజలకు వివరించి బీజేపీని బంపర్ మెజారిటీతో గెలిపించాలని కోరుతున్నా.

రైతు సంక్షేమం పట్టని మోడీ సర్కారు

0

* బీజేపీపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ధ్వజం

కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం పట్టదని, అన్నదాతల విషయంలో ఇది అసమర్థ సర్కారు అని కాంగ్రెస్ సీనియర్ ప్రధాన కార్యదర్శి జైరాం రమేశ్ ధ్వజమెత్తారు. ముఖ్యంగా వ్యవసాయం రంగంలో ఎన్డీఏ ఘోరంగా విఫలమైందని పేర్కొంటూ ఎనిమిది అంశాలను ప్రస్తావించారు. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వ అసమర్థ, హానికరమైన విధానాలకు అద్దం పడుతున్నాయని దుయ్యబట్టారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ లో పోస్టు చేశారు.

* ‘మోదీ సర్కారు విఫలమైన అన్ని అంశాల్లో వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ చూపించిన అసమర్థ, హానికర ప్రవర్తన అత్యంత ప్రమాదకరమైనది. ఈ శాఖ విఫలమైన తీరు ప్రతి ఒక్కరికీ స్పష్టంగా కనిపిస్తోంది’ అని విమర్శించారు. జీఎస్టీని రైతు వ్యతిరేక చర్యగా అభివర్ణించిన ఆయన.. జీఎస్టీ కారణంగా రైతులకు అవసరమైన అన్ని వస్తువుల ధరలు బాగా పెరిగాయని పేర్కొన్నారు. జీఎస్టీ కారణంగా ట్రాక్టర్ల ధరలు పెరగడమే ఇందుకు ఉదాహరణ అని వ్యాఖ్యానించారు.

* ‘2004-05లో యూపీఏ తొలి బడ్జెట్ లో ట్రాక్టర్లపై ఎక్సైజ్ డ్యూటీ రద్దు చేశాం. కానీ ఇప్పుడు జీఎస్టీ కారణంగా ట్రాక్టర్లపై 12 శాతం పన్ను పడుతోంది. అలాగే ట్రాక్టర్ల టైర్లపై 18 శాతం, స్పేర్ పార్టులపై 28 శాతం భారం పడుతోంది’ అని పేర్కొన్నారు.

* రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామని మోదీ హామీ ఏమైందని జైరాం ప్రశ్నించారు. ‘రైతులకు మోదీ ఇచ్చిన అతిపెద్ద తప్పుడు హామీ ఇది. 2016 నుంచి 2022 మధ్యకాలంలో రైతుల ఆదాయాన్ని రెట్టింపు చేస్తామన్నారు. కానీ ఆ ఆరేళ్లలో వారి ఆదాయం ఏటా 12 శాతం పడిపోయింది’ అని వివరించారు. తాజాగా ఎన్ఎస్ఎస్ఓ ఎస్ఏఎస్ నివేదిక ప్రకారం 2015 నుంచి 2019 మధ్యకాలంలో వ్యవసాయ రంగ ఆదాయం కేవలం 2.8 శాతమే పెరిగిందని పేర్కొన్నారు. ఇవి కరోనా కంటే ముందు గణాంకాలని.. దీనికి కరోనాను సాకుగా చెప్పి తప్పించుకోవడం కుదరదని స్పష్టం చేశారు.

* కనీస మద్దతు ధరలో సరైన పెరుగుదల లేకపోవడంతో రైతులు మళ్లీ రోడ్లెక్కాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. ‘యూపీఏ సర్కారు వరి కనీస మద్దతు ధరను 134 శాతం, గోధుమ మద్దతు ధరను 119 శాతం పెంచగా.. మోదీ సర్కారు వాటిని 50 శాతం, 47 శాతం మేర మాత్రమే పెంచాయని పేర్కొన్నారు. పెరుగుతున్న ధరలకు ఇవి ఏమాత్రం సరిపోవని ఆయన స్పష్టంచేశారు. పంటల వైవిధ్యం, నూనెల కోసం దిగుమతులపై ఆధారపడటం, వాణిజ్య విధానంలో వైఫల్యం, పెరుగుతున్న రుణభారం, రైతు ఆత్మహత్యలు కూడా ఎన్డీఏ ప్రభుత్వ ఘోర వైఫల్యాలేనని జైరాం పేర్కొన్నారు.