Friday, May 10, 2024

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్ధతు ఉంది

కొన్ని రాజకీయ ప్రతిపాదనలను తమ ముందు ఉంచారు
బిజెపి లాంటి శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్ధతు అవసరం
కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి ముందుకు వెళతాం
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో భేటీ అయిన సిఎం రేవంత్

లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి సిపిఎం పార్టీ మద్ధతు ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. హైదరాబాద్‌లో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో సిపిఎం నేతలు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఇరువురు తాజా రాజకీయాలపై చర్చించారు. తమ పార్టీకి మద్దతు ఇచ్చేందుకు వారు అంగీకరించారని సిఎం పేర్కొన్నారు. భువనగిరి పార్లమెంట్‌తో పాటు ఇతర పార్లమెంట్ స్థానాల్లో మద్దతు ఇవ్వాలని సిపిఎంను కోరామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. ఆ పార్టీ నాయకులతో తాజా రాజకీయ పరిణామాలపై చర్చించినట్లు సిఎం వెల్లడించారు. శనివారం ఉదయం సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, జూలకంటి రంగారెడ్డి, చెరుపల్లి సీతారాములు, వీరయ్యలు రేవంత్‌రెడ్డితో సమావేశం అయ్యారు.

The Congress party has the support of the CPM party in the Lok Sabha elections

ఈ సందర్భంగా సిపిఎం నాయకులు తమ ఎదుట కొన్ని రాజకీయ ప్రతిపాదనలు పెట్టారని సిఎం రేవంత్‌రెడ్డి వెల్లడించారు. బిజెపి లాంటి శక్తులను ఓడించేందుకు కాంగ్రెస్‌కు మద్ధతు ఇచ్చేందుకు వారు అంగీకరించినట్లు సిఎం రేవంత్ తెలిపారు. వారితో దేశంలోని ఇండియా కూటమితో కలిసి పని చేయనున్నామని సిఎం పేర్కొన్నారు. స్థానికంగా కొన్ని అంశాల్లో భిన్నాభిప్రాయాలు ఉన్నా, అందరం కలిసి ముందుకు వెళ్లేందుకు నిర్ణయించుకున్నామని రేవంత్‌రెడ్డి వివరించారు. నేటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని, మంచి వాతావరణంలో చర్చలు జరిగాయని రేవంత్ రెడ్డి చెప్పారు ఒకట్రెండు విషయాల్లో కొంత సందిగ్ధత ఉన్నా అధిష్టానంతో చర్చించి నేటిలోగా ఏకాభిప్రాయానికి వస్తామని ఆయన వివరించారు. సిపిఎం సహకారంతో భవిష్యత్‌లో ముందుకెళ్తామని ఆయన అన్నారు. ఈ కలయిక రాష్ట్రంలో కాంగ్రెస్ గెలుపునకు పని చేస్తుందని రేవంత్‌రెడ్డి వెల్లడించారు.

తాజా రాజకీయాలపై చర్చించాం: తమ్మినేని వీరభద్రం
రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాలపై చర్చించామని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం తెలిపారు. తమ పార్టీ అభ్యర్థులను విరమించుకోవాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కోరినట్లు ఆయన పేర్కొన్నారు. పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు మద్ధతు ఇవ్వడానికి తాము సిద్ధంగా ఉన్నామన్నారు. బిజెపి, ఇతర శక్తులను అడ్డుకునేందుకు హస్తం పార్టీకి మద్దతు ఇవ్వాలని తాము నిర్ణయించుకున్నామని తమ్మినేని వీరభద్రం వెల్లడించారు. ‘రాష్ట్రంలో, దేశంలో ప్రస్తుతం ఉన్న తాజా రాజకీయాలపై చర్చించామని ఆయన అన్నారు. భువనగిరి సీటు విషయంలో సిపిఎంకు మద్దతు ఇవ్వాలని రేవంత్ రెడ్డిని కోరామని, భువనగిరి సీటుపై సందిగ్ధత ఉన్నా, మా మద్దతు కాంగ్రెస్‌కు ఉంటుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం పేర్కొన్నారు.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular