Thursday, May 2, 2024

కష్టాల్లో కవిత ఢిల్లీ లిక్కర్​ స్కాంలో కీలక పరిణామం

టీఎస్​, న్యూస్​:ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్​ఎస్​ ఎమ్మెల్సీ కవితకు కష్టాలు పెరుగుతున్నాయి. తాజాగా ఈ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. 164 సెక్షన్ కింద ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి ముందు శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈడీ కేసులో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారిన సంగతి తెలిసిందే. సీబీఐ కేసులో కూడా అప్రూవర్ గా మారడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఇప్పటికే మాగుంట రాఘవ, దినేష్ అరోరా అప్రూవర్ గా మారారు. ఆ జాబితాలో శరత్ చంద్రారెడ్డి చేరారు. తెలంగాణలో భూముల కొనుగోలు లావాదేవీల వ్యవహారాల్లో శరత్ చంద్రారెడ్డిని ఎమ్మెల్సీ కవిత బెదిరించారని సీబీఐ అభియోగాలు మోపిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ లిక్కర్ స్కామ్ లో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. తీహర్ జైలులో ఉన్న కవితపై సీబీఐ కూడా విచారించి, అరెస్ట్ చేసింది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ను ఈడీ అధికారులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. కేజ్రీవాల్ కుట్రతోనే లిక్కర్ స్కాం జరిగిందని ఈడీ అభియోగాలు మోపింది.

కవితకు కష్టాలు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో సీబీఐ నిందితుడిగా ఉన్న శరత్ చంద్రారెడ్డి అప్రూవర్ గా మారారు. ఈ మేరకు శుక్రవారం రౌస్ అవెన్యూ కోర్టు సీబీఐ బెంచ్ జడ్జి కావేరి భవేజా ఎదుట శరత్ చంద్రారెడ్డి వాంగ్మూలం ఇచ్చారు. ఈ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత పాత్ర ఏంటో సీబీఐ.. ప్రత్యేక కోర్టుకు తెలిపింది. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు సీబీఐ కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. శరత్ చంద్రారెడ్డి .. కవిత జాగృతి సంస్థకు రూ. 80 లక్షల ముడుపులు చెల్లించినట్లు రిపోర్ట్​లో వెల్లడించారు. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని, ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించినట్లు కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొన్నారు. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించారంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని సీబీఐ ఆరోపించింది. ఢిల్లీ లిక్కర్ బిజినెస్‌కు పరిచయం చేసినందుకు కవితకు చెందిన తెలంగాణ జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ. 80లక్షలు చెల్లించారని, మహబూబ్ నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ అభియోగాలున్నాయి. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తాను రూ.14కోట్లు ఇవ్వలేని శరత్ చంద్రారెడ్డి చెప్పారని, కానీ, రూ. 14 కోట్లు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించారని సీబీఐ తన కస్టడీ రిపోర్ట్‌లో పేర్కొంది. స్వయంగా నిందితులు అప్రూవర్లు గా మారి .. బెదిరిస్తేనే డబ్బులు ఇచ్చామని చెప్పడంతో కవితకు అనేక సమస్యలు చుట్టుముట్టినట్లుగా కనిపిస్తోంది.

సంబందిత వార్త‌లు

మ‌రిన్ని వార్త‌లు

ప్ర‌దాన వార్త‌లు

బీజేపీ స‌ర్కార్ తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వాన్ని కూల్చివేసేందుకు కుట్ర‌ జ‌రుపుతుందా?

Most Popular